ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్‌లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు.

ఏమవుతుంది నాకు? గిల్టీగా ఎందుకుంది, నా లోపల భయమెందుకు? మణి ఇదివరకటిలా లేదు. ప్రశ్నలు వేసినా నన్నేమి అనలేదు, నా వైపు చూసే అభావపు చూపు తట్టుకోలేకుండా ఉన్నా. ఉక్రోషంగా చెప్పాలనిపించింది భరణి నన్ను వెతుక్కుంటా వచ్చాడు నిన్ను చూసుకోమని అని. కాని చెప్పలేకపోయా. మనుషులు మన అవసరాలను చూసి, వాళ్ళ పనులు చేయించుకుంటారు. ప్రేమ స్నేహం ముసుగులో భరణి చేసిందేంటి?

“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలుపడరా వీళ్లు?!”

నిద్ర తెలుస్తున్నా, సమయం చూడనంత
గాఢమైన ముడులు కునుకుకీ కట్టక
ఒంటిమీద ఉరేస్తాయి నన్ను,
నాలుగూ పదకొండు ఇక నిద్రపో అని నువ్వనే వరకూ.

కాలు ఆనించిన చోటు విమానాలు ఆగే చోటు. స్థలాలని కలుపుతూ, కాలాలని మారుస్తూ, నాగరికతలని కరెన్సీ నోట్లలా తర్జుమా చేయగలిగే పవిత్ర స్థలి. నువ్వు అక్కడే నిలబడివున్నా నీతో పాటు ఇదే కాలంలో ఇదే క్షణంలో జీవించిన, జీవిస్తున్న ఈ కోట్లకోట్లమంది సంబంధం లేని జనాల ఆటుపోట్లు, ఒకరినొకరు తోసుకుంటూ తప్పుకుంటూ వస్తూ పోతూ… ఇవ్వేమీ నిన్ను తాకే స్థితిలో నువ్వు లేవు.

రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది. ‘ఒక నెల రోజలుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం’ అని అబద్ధమాడాను.

అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి

ఈ పధకం ప్రకారం బంధులుడు, అతని ముప్ఫై ఇద్దరు పిల్లలూ రహస్యంగా వెళ్ళి ఫలానా రాజ్యం సరిహద్దుల్లో జరగబోయే తిరుగుబాటు అణచాలి. అలా వాళ్ళు వెళ్ళినపుడు అక్కడ దాక్కున్న ప్రసేనజిత్తు సైన్యం ఈ బంధులుణ్ణీ, అతని పిల్లలనీ హతమారుస్తుస్తుంది వాళ్లు నిద్రలో ఉండగా. అలా అతి బలవంతుడైన బంధులుణ్ణి పిల్లల్తో సహా వదిలించుకుంటే దరిద్రం వదులుతుంది ప్రసేనజిత్తుకి.

ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టునని ప్రజలనమ్మకము.

రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!

మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.

వాటికెపుడు పోస్తావో
ఆ మార్మిక జీవాన్ని
ఎవరి గుండెలోనో
కంటితడిలోనో
పొర్లాడి వచ్చిన పుప్పొడిని
ఆ గదినిండా కుమ్మరిస్తాయి
వెంటనే దాన్నొక తేనెపట్టులా మార్చి
నువ్వు తాళం పెట్టేస్తావు

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.