ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.

విలక్షణమైన రచనాపటిమ, ప్రత్యేకమైన శైలి-శిల్పాలతో కలాన్ని మంత్రదండంగా మార్చిన కథా రచయిత చంద్ర కన్నెగంటి. ఆయన వ్రాసిన కథల్లోంచి పన్నెండు ఆణిముత్యాలు, శ్రీనివాస్ బందా స్వరంలో వినండి.

ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.

ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.

ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.

ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.

సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్లకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.

[ఈ సంచికలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన మాట మౌనం (1988) అన్న సంగీత రూపకం సమర్పిస్తున్నాను. దీనికి సంగీతం కూర్చినది శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ రూపకంలో రజనీకాంతరావు, మల్లాది సూరిబాబు, బాలకృష్ణప్రసాద్, చదలవాడ కుసుమకుమారి, విద్యుల్లత గార్లు పాడిన పాటలు వినవచ్చు. – పరుచూరి శ్రీనివాస్.]

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.

ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్యతో 1995లో ‘వ్యాపకాలు జ్ఞాపకాలు’ అన్న శీర్షిక తో విజయవాడ రేడియో కేంద్రం 1995లో దంటు పద్మావతిగారు నిర్వహించిన సంభాషణ వినండి.

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.

ఈ సంచికలో సి.ఎస్.ఆర్ పాడిన కొన్ని పాటలు, పద్యాలు విందాం. సి. ఎస్. ఆర్ పూర్తి పేరు చిలక(ల)పూడి సీతారామాంజనేయులు. ఆయన మొదట నాటకాల్లోను తరువాత సినిమాల్లోను వేసిన పాత్రల గురించి సమాచారం ఇప్పుడు ఇంటర్నెట్లో తేలికగానే అందుబాటులో వుంది.

అనంతకృష్ణశర్మగారు సాహిత్య రంగంలోనే కాదు సంగీత రంగంలో కూడా గొప్ప పండితులన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంచికలో వినిపిస్తున్న ప్రసంగం మార్చ్, 1960లో అపూర్వ రాగములు అన్న శీర్షిక క్రింద సైంధవి రాగంపై ఆకాశవాణిలో చేసినది.

తొలి అయిదు దశాబ్దాలలో, అంటే 1981-82 వరకు, వచ్చిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమారంగానికి రెండు ప్రత్యేకతలున్నాయి. చాలా మంది పాటల రచయితలు ప్రథమంగా పేరొందిన కవులు కావడం, అలాగే సంగీత దర్శకులు మంచి గాయకులు కూడా కావడం.

గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు.