మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 87,886 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఒసామా బిన్ లాడెన్ సంహారం

ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా వ్యవస్థాపకుడు, దాని మొదటి నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో 2011 మే 2 న స్థానిక సమయం అర్ధరాత్రి 1:00 (భారత సమయం 1:30) తరువాత అమెరికా దేశపు నావల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ కు చెందిన నేవీ సీల్స్ సైనికులు సంహరించారు. ఈ బృందాన్ని DEVGRU లేదా సీల్ టీం సిక్స్ అని కూడా అంటారు. సిఐఎ నేతృత్వం వహించిన, ఆపరేషన్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరున్న ఈ ఆపరేషనులో సిఐఎ తో పాటు, దాడిలో పాల్గొన్న స్పెషల్ మిషన్ యూనిట్లతో సమన్వయం చేస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC) కూడా పాల్గొంది. పాకిస్తాన్‌ భూభాగంలో చేసిన ఈ ఆపరేషన్ను పాకిస్తాన్ బలగాలతో కలిసి సంయుక్తంగా చేపడితే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలించారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్నీ విశ్వసించలేమని బరాక్ ఒబామా నిర్ణయించాడు. దాడి ముగిసాక, అమెరికా చెప్పేదాకా ఈ దాడి జరిగిన సంగతి పాకిస్తాన్‌కు తెలియదు. బిన్ లాడెన్ భౌతిక కాయాన్ని విమాన వాహక నౌకలో తరలిస్తూ, ఉత్తర అరేబియా సముద్రంలో ఖననం చేసారు. బిన్ లాడెన్ చేసిన సెప్టెంబరు 11 దాడుల తరువాత, అతడి కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికా జరిపిన అన్వేషణ ఈ ఆపరేషనుతో ముగిసింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... చంద్రగోమిన్ నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఒక పురాతన కవి అనీ!
  • ... పిల్లల టీవీ ధారావాహిక ఛోటా భీమ్ హైదరాబాదు కేంద్రంగా ఉన్న గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ రూపొందిస్తుందనీ!
  • ... లేజర్ నెట్ శక్తివంతమైన కాంతికిరణాల ద్వారా ఇంటర్నెట్ ను అందించే సాంకేతికత అనీ!
  • ... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) భారతదేశంలో అన్ని ప్రభుత్వాలను ఆడిట్ చేసే సంస్థ అనీ!
  • ... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లోయ విశాలమైన ఆపిల్ తోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!
చరిత్రలో ఈ రోజు
నవంబరు 3:


ఈ వారపు బొమ్మ
నెల్లూరులో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మెక్లీన్స్ లైబ్రరీ

నెల్లూరులో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన మెక్లీన్స్ లైబ్రరీ

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.