మీ చిన్నారి

Thinkstock

మీ చిన్నారికి పూర్తిగా కొత్త ప్రపంచం

శబ్దాలతో కూడినఈ అతిపెద్ద ప్రపంచం మీ చిన్నారి కొత్తగా ఉంటుంది! మీ చిన్నారి ఉలిక్కి పడుతూ ఉండు క్రమంగా వాటికిఅలావాటు పడిపోతాడు. వెంటనే, అతని కదలికలు మృదువుగా అవుతాయి.

మీ చిన్నారికి పాలు సరిపోవడం లేదని మీరు ఆందోళన చెందవచ్చు. మీ చిన్నారి, ప్రతి 2 నుండి 3 గంటలకు లేదా రోజుకు కనీసం 8 సార్లు పాలు తాగితేసరిపోతుంది. దీనిని పరీక్షించుటకు, మీ చిన్నారి మలం యొక్క రంగును చూస్తే సరిపోతుంది. అది ముందుగా నలుపురంగులో ఉండి, 4 వ రోజుకెల్లా పసుపుపచ్చ రంగులోనికి మారుతుంది.

మీ చిన్నారి మీ చనుమొనను పీలుస్తాడు, పట్టుకుంటాడు మరియు మిటకరించి దాని కొరకు వెతుకుతాడు. కొన్నిసార్లు, మీ చిన్నారి మీ కళ్ళలోకి నేరుగా చూస్తాడు. మీరు తిరిగి చూసి, చిరునవ్వుతో తలాడించడం మంచిది. అతను త్వరగా నేర్చేసుకుంటున్నాడు!

సుమారుగా రెండు వారాలలో మీ చిన్నారి బోర్లా పడుకొని తన తలను పైకి లేపడానికి ప్రయత్నించడం మీరు చూస్తారు. అతను తన తలను ప్రక్కవైపులకు కూడా తిప్పగలగవచ్చు. దీని వలన అతని మెడ కండరాలు అభివృద్ధిచెందుతాయి.

ఒక నెల గడిచేసరికి, మీ చిన్నారికివణకడం, గగుర్పాటు వంటి లక్షణాలు మెల్లగా తగ్గిపోతాయి. అతను రోజురోజుకు బలంగా ఎదుగుతున్నాడు మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నేర్చుకుంటున్నాడు.

ఒక ఆనందకరమైన మార్పేమిటంటే అతను శబ్దాలు చేయడం మొదలుపెడతాడు. ఇది బాబు మీతో మాట్లాడడం అన్నమాట! మీరు కూడా తిరిగి మాట్లాడండి. మీరు అతన్ని కింద పడుకోబెట్టినపుడు మరియు దూరంగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూనే ఉండండి.

మీ నవజాత శిశువును దగ్గరగా హత్తుకోండి!

మీ బిడ్డ జన్మించిన తరువాత, మీ శరీరం మావి అనే దానిని విసర్జిస్తుంది. మీకు తిరిగి సంకోచాలు సంభవిస్తాయి, కానీ ఈ సారి బలహీనంగా ఉంటాయి.

మీ నవజాత శిశువును మీ చర్మానికి తాకేలా హత్తుకోండి. అతను మీ రొమ్మును చీకడానికి చూస్తాడు. వీలయినంత త్వరగా మీ రొమ్మును అందించండి. ఇలాంటి చనుబాలివ్వడం మూలాన మీ సంకోచాలు, మావిని సులభంగానే వెలుపలికి త్రోయగలవు.

మావి, మరియు నీరు ఖాళీ అయిన బ్యాగ్, మీ గర్భాశయం క్రిందికి జారి పడిపోతాయి. అవి మీ యోనిగుండా బయటకు వస్తాయి.

మీ బిడ్డను మీకు దగ్గరగా హత్తుకోండి. మీ చర్మానికి హత్తుకోవడం అతనికి వెచ్చదనాన్ని ఇస్తుంది, అతనికి చనుబాలివ్వడం వలన మీ రక్తస్రావం తగ్గుతుంది.

జన్మించిన తరువాత విశ్రాంతి తీసుకోండి మరియు మీ బిడ్డ గురించి తెలుసుకోండి. మీకు కలిగే రక్తస్రావం కొరకు కొన్ని ప్యాడ్స్ లేదా శుభ్రమైన బట్టలు అవసరమవుతాయి. ఈ రక్తస్రావాలు మొదట్లో ఎక్కువగా ఉండి, ఎక్కువ ముట్లుగా అనిపిస్తాయి. అది సరి అవుతుంది, తగ్గిపోతుంది. మీ బిడ్డ జన్మించిన తరువాత అనేక వారాల పాటు రక్తస్రావం కొనసాగుతుంది.

నా బిడ్డను ఎలా వెచ్చగా ఉంచాలి?

మీ బిడ్డ జన్మించిన వెంటనే వెచ్చగా ఉంచడమనేది ముఖ్యం. శిశువులు, గర్భాశయం వెలుపల ఉన్న కొత్త, చల్లని, ఉష్ణోగ్రతలో ఇమడలేరు, మరియు వారి వెచ్చదనాన్ని త్వరగా కోల్పోతారు.

మీ శిశువు జన్మించినపుడు, అతను తడిగా ఉంటాడు, కాబట్టి అతనిని ముందుగా తుడవండి.

కనీసం 6 గంటల వరకు అతనికి స్నానం చేయించాల్సిన అవసరం ఉండదు. మీ బిడ్డ జీవితంలోని మొదటి 6 గంటల వరకు, బొడ్డుతాడును మాత్రమే శుభ్రపరచండి. మిగిలిన శరీరానికి స్నానం అవసరంలేదు. వెంటనే స్నానం చేయించడం వలన అతను అస్వస్థతకు గురయి, అతని శరీరం చల్లబడిపోతుంది.

మీ రొమ్ములపై మీ బిడ్డను పడుకోబెట్టమని మీ సహాయకురాలిని కోరండి. మీ వెచ్చదనం వలన అతనికి చల్లదనం కలుగకుండా ఉంటుంది. అతని జారి పడిపోకుండా గట్టిగా హత్తుకోండి.

మీ ఇద్దరిపై ఒక శుభ్రమైన వెచ్చని దుప్పటిని వేసుకోండి. దీనివలన లోపలి వేడి అలాగే ఉంటుంది. అతనిని సురక్షితంగా ఉంచడానికి మీరు జోలెను కూడా చేయవచ్చు. ఇంకా అతని తలపై ఒక చిన్న టోపీ లేదా వస్త్రం కప్పండి. శిశువులు వారి తల ద్వారా ఎక్కువ వేడిని కోల్పోతారు.

చర్మం నుండి స్పర్శద్వారా మీ బిడ్డను వెచ్చగా ఉంచడం వలన మీకు మరియు మీ బిడ్డకు ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి వీలవుతుంది. ఇన్నిరోజులు మిమ్మల్ని లోపలనుండి తంతూన్నదెవరో మీరు చూస్తారు! ఇలా మీ బిడ్డను హత్తుకోవడం వలన మీ బిడ్డ మీ రొమ్ములను సులభంగా అందుకుని పాలు త్రాగడం ప్రారంభిస్తాడు.

ఆమెకు అవసరమైనది చనుబాలు మాత్రమే

మీకు రొమ్ములు ఉన్నాయంటే దానికి కారణం మీరు మీ బిడ్డకు ఆహారాన్ని అందివ్వగలరని అర్థం!

మీ బిడ్డ మొదటి 6 నెలల వరకు ఆరోగ్యంగా ఉండడానికి మీ చనుబాలు మాత్రమే సరిపోతాయి. ఆమెకు 6 నెలల కన్నా ముందు ఘనాహారం అవసరంలేదు. ఏదైనా ఇతర రకాల పాలు కూడా ఆమెకు అవసరంలేదు. ఆమెకు నీరు లేదా ఇతర పానీయాలు కూడా అవసరం లేదు.
మీ చనుబాలు ప్రత్యేకమైనవి. మీ బిడ్డ ఎదుగుతున్నకొద్దీ అవి మారతాయి.

ప్రసవం తరువాత మీలో ఏర్పడిన పాలు మీగడగా మరియు అధిక విటమిన్లతో ఉంటాయి మరియు మీ బిడ్డ సంక్రమణల బారిన పడకుండా పోరాడగలవు. వీటివలన ఆమె ఆరోగ్యంగా ఉంటుంది.

మీ పాలు తరువాత తెల్లగానూ మరియు కొంచెం పలుచగా మారతాయి. ఇది ఆమె దాహాన్ని తీరుస్తుంది, కాబట్టి వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఆమెకు నీరు కూడా అవసరంలేదు. మీ బిడ్డ అవసరాలకు తగినట్లుగా మీ పాలు మారుతూ ఉంటాయి.

మీ బిడ్డ ఎంత ఎక్కువగా తాగుతూ ఉంటే మీకు అంత ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మీ రొమ్ములు చిన్నవిగా ఉన్నా కూడా, మీ బిడ్డకు తగినంత పాలను మీ శరీరం ఉత్పత్తి చేయగలుగుతుంది. మీ చిన్నారి నవజాత శిశువు కొరకు మరియు ఆమెకు 6 నెలల వయస్సు వచ్చేంతవరకు, తగినంత పాలను మీరు ఉత్పత్తి చేయగలుగుతారు.

మీ బిడ్డ కడుపు, ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం మరియు చెవులలో క్రిములతో పోరాడడానికి మీ చనుబాలు మీ బిడ్డకు సహాయపడతాయి. మొదటి సంవత్సరంలో చనుబాలు త్రాగుతున్న పిల్లలు, ఇతర పాలు త్రాగుతున్న పిల్లల లాగా జబ్బుపడరు.

మీరు పనికి తిరిగి వెళ్ళాలంటే, మీరు మీ చనుబాలను పిండివేయచ్చు మరియు మరొకరెవరైనా ఆపాలను మీ బిడ్డకు త్రాగించవచ్చు. మీ బిడ్డకు మీ చనుబాలను ఉగ్గు గిన్నె ద్వారా లేదా ఒక గిన్నె ద్వారా ఎలా త్రాగించాలో మీ బిడ్డను చూసుకునే వారికి నేర్పించండి. చనుబాలు, మీ రొమ్ములనుండి పిండిన 6 గంటల వరకు చక్కగా అదే పోషకవిలువలను కలిగి ఉంటాయి.

6 నెలల తరువాత, ఎదుగుతున్న మీ బిడ్డకు చనుబాలకంటే ఎక్కువ ఆహారం అవసరం. కానీ మీ చనుబాలు ఇంకా ఉండగనే, ఆమె ఘనాహారాలను తీసుకోవడం నేర్చుకుంటుంది మరియు ఇది ఆమెకు 2 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది.

చనుబాలు ఇవ్వడం – ఎలా ప్రారంభించాలి?

ముందుగా, మీరే స్వయంగా శుభ్రమైన, సురక్షితమైన నీటిని ఒక గ్లాసులో తీసుకొని మీకు అందేటట్టుగా ఉంచుకోండి. చనుబాలివ్వడం వలన మీకు దాహం కలుగవచ్చు.

తరువాత మీరు మీ చేతులు మరియు వీపు నొప్పి కలుగకుండా మీ బిడ్డను పట్టుకునే స్థితిలో కూర్చునేలాగా ఒక సౌకర్యవంతమైన స్థలం చూసుకోండి. మీ వీపుకు ఆధారం ఉండునట్లుగా చూసుకోండి మరియు మీరు వెనుకకు వాలిపోకుండా చూసుకోండి.

మీ బిడ్డను సరిగ్గా ఎత్తుకోవడంలో సహాయపడడం కొరకు దగ్గరలో కొన్ని దిండ్లు లేదా దుప్పట్లను ఉంచుకోండి. వివిధ భంగిమలను ప్రయత్నించండి. చాలా మంది తల్లులకు, వారి రొమ్ముల మధ్య వారి బిడ్డను ఊయలలాగా ఉంచుకుని, ఒక మెత్తటి దిండుపై పైకి పట్టుకునే భంగిమ సరియైనదిగా ఉంటుంది. లేదా మీ బిడ్డను మీ చేతులక్రింద పట్టుకుని, అతని పాదాలు వెనుకకు ఉండునట్లుగా మరియు తల రొమ్ములవద్ద ఉండునట్లుగా పట్టుకోండి. మీకు ఏది ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుందో దానిని చేయండి.

మీరిద్దరూ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు, మీ బిడ్డ మీ రొమ్మును తన నోటితో పట్టుకుని, పాలుత్రాగడానికి తగిన సమయం.

మీ బిడ్డ పాలుత్రాగడానికి 5 నుండి 40 నిమిషాలు పట్టవచ్చు. ఒకవేళ శబ్దం వలన అంతరాయం కలిగితే, నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. మీకు విసుగ్గా ఉంటే, రేడియో లేదా టివి ఆన్ చేసి లేదా ఒక మిత్రుడు లేదా బంధువుతో పాటుగా కూర్చుని చనుబాలనివ్వండి.



Track your baby’s development

Join now to receive free weekly newsletters tracking your baby’s development and yours throughout your pregnancy.
Trying to conceive?