అందరూ ఏమన్నా బామ్మా నాన్నా నన్ను ఎప్పుడూ ఏమన్రు. అలాంటిది ఇవాళ నే చేసిన పనికి బామ్మా కోప్పడుతోంది. అయితే నాన్నా దెబ్బలాడతాడు. నాన్నని చూస్తే ఎప్పుడూ భయం లేదా – అలాంటిది ఇప్పుడు తనవేపు చూడ్డానికి భయం వేసింది. బుర్రొంచుకుని అలాగే దిమ్మసాచెక్కలా చీడీ మీదికి ఎక్కకుండా నిలబడిపోయా.

చురుకుదనం మూర్తీభవించినట్టు కనిపించే జానకమ్మ తన అయిదు నెలల నివాసాన్ని, రెండు నెలల పైచిలుకు సాగరయానాన్నీ వింతలూ విశేషాలూ వినోదాలకూ పరిమితం చెయ్యలేదు. ఉన్న సంపదతో, తమతో తీసుకువెళ్ళిన ముగ్గురు సేవకుల సాయంతో సుఖంగా, విలాసంగా గడపలేదు. జిజ్ఞాస, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆమెను అనుక్షణం నడిపించాయి.

అక్కడినుండి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఆయన తన తపస్సునుండి కొద్దిగా కదిలి ‘నువ్వు కార్టూనిస్ట్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్టూన్లు వేయడంలో అంత గొప్ప ఏమున్నదబ్బా? పనికి వచ్చే వేరే పని ఏదయినా చేసుకోవచ్చు కదా?’ కళ్ళు తెరవకుండా సలహా ఇచ్చాడు. నేను మౌనంగా లేచి నిలబడ్డాను.

ఓరి నాయనో! చాలామందికి ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు ‘బడా పిట్ఠూ’తో సహా రావాలంటే, అవన్నీ తగిలించుకోవడానికి కనీసం పది నిముషాలు పడుతుంది. తప్పేదేముంది! పరుగు పెట్టాం బారక్ లోకి. అసలెందుకు ధగ్లారామ్ మమ్మల్నందరినీ పరుగులు తీయిస్తున్నాడు? అతనికి ఇంత కోపం రావడం మాలో ఎవరమూ ఎప్పుడూ చూడలేదు. తగిలించుకుంటున్నాం. బూట్లు తొడుక్కుంటున్నాం. బయటికి వచ్చి ఫాలిన్‍లో చేరేసరికి పది నిముషాలు పట్టింది.

కొన్ని నవలలు చదివీ చదివగానే అర్థమై, ఉదాత్తంగా, ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని నవలలను నిశితంగా చదివి, పొరలు విప్పుకుంటూ పోతే తప్ప, వాటిలోని పస అర్థం కాదు. ఈ నవల రెండో కోవకు చెందింది. నవలలో కథ గొప్పదేమీ కాదు. ఒకరకంగా ఒక బలహీనుడు, విధి ఎలా లాక్కుపోతే అలా వెళ్లే యువకుడి కథ.

ఒక తురకోడు పెద్ద కులస్తుడైన పిళ్ళైపై ఎలా చెయ్యి చేసుకుంటాడు? అని ఒక ముఠా సరంజామా వేసుకుని వస్తే, శాలమహాదేవాలయం ట్రస్టీ అనంతన్ నాయర్ వాళ్ళను ఆపి ‘పోయి మీ పనులు మీరు చూస్కోండ్రా! వావీ వరుసల్లేకుండా అడ్డగోలుగా ఒ‌ళ్ళు కైపెక్కి జంతువులా ప్రవర్తిస్తే తురకోడి చేతుల్లోనైనా చస్తాడు, చీమ కుట్టయినా చస్తాడు’ అన్నాడట. అనంతన్ నాయర్ మాటకు శాలబజార్‍లో ఎవరూ ఎదురు చెప్పరు.

ఒత్తిగిల్లి ఒకవైపుకి, నిద్రపోతోంది
అమ్మ. నానిన
ఆకుల వాసనేదో గదిలో. తన

నిద్రలోనూ ముఖంలోనూ, వాన
ఆగాక బయల్పడే
మృదువైన వెలుతురు, గాలి –

రాగము లెన్నని? రాతిరి కాంత
తీగల వీణను తీయగ అడిగె.
వీణియ నవ్వెను హాయిగ ఊగి,
మోగెను తీగల వింతగ సాగి-
సరి! సరి! పదసరి దాపరీ!
సరిగమపదని గని నీదని గని
సరిగ నీ దాగని పస గని
మరి సరిగ నీ దాగని గరిమ గని

మీరలేని జీవన వాస్తవంలా
తీరం మీద రెపరెపలాడే
ప్రమాదసూచికలు

ఇసుక బొరియల్లోకి దూరాలని
వంకరకాళ్ళతో పరుగెట్టే
ఎండ్రకాయలు

సముద్రం లాంటి ఆకాశంలో
అసహజమైన రూపాలెన్నో
సహజంగా మొలుస్తాయి
నింగినిండా అల్లుకుపోయే మబ్బులు
రంగు కాగితాల్లా ఎగిరే పక్షుల కోసం
వడ్లకుచ్చుల ముఖాలతో
పొదరింటికి తోరణాలు కడతాయి

మతిమరుపుతో నా మెదడు మీదా
గాలివిసుర్లతో తన వరండాల మీదా
దుమ్ము పేరుకొంటోంది
విప్పలేకపోయిన ఒక్కొక్క ముడినీ
ఒప్పుకొంటూ నేనూ
పుచ్చుకి దారిచ్చి పడిపోతున్న
కొయ్య స్తంభాలతో తనూ.

కలవరంగా అరుస్తున్న
కాకి దుఃఖం
ఒక ఖాళీ మధ్యాహ్నంలో

చెంపలపై
కన్నీటి చారికలు
అద్దం
మసక నదిలా కనిపిస్తో

పాదములోని మాత్రల విఱుపు, పదముల విఱుపు పద్యములకు ఒక క్రొత్త విధమైన అందమైన అద్భుతమైన నడకను ప్రసాదిస్తుంది. లేకపోతే పద్యమనే చట్రములో పదాడంబరముతో వచనమును వ్రాసినట్లు ఉంటుంది. ఛందస్సు శారదాదేవి రెండు స్వరూపములైన సంగీత సాహిత్యములకు ప్రతీక. సంగీతము లేని సాహిత్యము బధిరత్వమే, సాహిత్యము లేని సంగీతము అంధత్వమే. అప్పుడే ఛందస్సు పాత్ర సార్థకమవుతుంది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: