ఇస్మాయిల్ (కవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇస్మాయిల్
ఇస్మాయిల్.jpeg
చెట్టుకవి ఇస్మాయిల్
జననంఇస్మాయిల్
మే 26, 1928
నెల్లూరు జిల్లా, కావలి గ్రామం
మరణంనవంబర్ 25, 2003
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధిప్రముఖ కవి

ఇస్మాయిల్ (మే 26, 1928 - నవంబర్ 25, 2003) కవి, అధ్యాపకుడు.[1]

జననం[మూలపాఠ్యాన్ని సవరించు]

మే 26, 1928నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జన్మించాడు. కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా పుచ్చుకున్నాడు. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశాడు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశాడు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  1. మృత్యువృక్షం (1976)
  2. చిలకలు వాలిన చెట్టు (1980)
  3. చెట్టు నా ఆదర్శం (1982)
  4. రాత్రి వచ్చిన రహస్యపు వాన (1987)
  5. బాల్చీలో చంద్రోదయం
  6. కప్పల నిశ్శబ్దం (హైకూలు)
  7. రెండో ప్రతిపాదన
  8. కవిత్వంలో నిశ్శబ్దం (1990) (విమర్శ)
  9. కరుణముఖ్యం (విమర్శావ్యాసాలు)
  10. పల్లెలో మా పాతయిల్లు (మరణానంతరం అభిమానులు తీసుకువచ్చిన కవితాసంకలనం)

రచనల నుండి మచ్చు తునక[మూలపాఠ్యాన్ని సవరించు]

మోహానికీ
మోహరానికీ
రవంతే తేడా.
ప్రేమికుడికీ
సైనికుడికీ
ఒకటే ఏకాగ్రత!
ప్రియుడి కంటికొసని
ప్రేయసి నిత్యం జ్వలిస్తే
జవాను తుపాకి తుదని
శత్రువు నిశ్చలంగా నిలుస్తాడు.
స్మరరంగంలో లేచే సుడిగాలే
సమరరంగంలో పిడికిలి బిగిస్తుంది.
కోరికల తుఫానుకి
కొంకర్లు తిరిగే నరాలచెట్టులా
సంకుల సమరంలో
వంకర్లుపోయిన ముళ్ళకంచెలూ మెషీన్‌గన్లూ.
మృత్యుభంగిమలకి
రత్యంతభంగిమలకి
వ్యత్యాసం ఉందంటారా?
ఉవ్వెత్తుగా లేచిపడి
ఉద్రేకపు చివర్ల
బిగుసుకునే దేహాలకి కారణం
భావప్రాప్తా, అభావమా?
ఐతే,
బుద్ధిగా ప్రేమించుకోక
యుద్ధాలెందుకు చేస్తారో
నాకర్థం కాదు.

(చెట్టు నా ఆదర్శం నుండి)

పురస్కారాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  • 1976 సంవత్సరానికి ఇతని మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం దక్కింది.
  • 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో ఇతనికి పురస్కారం అందజేసింది.

మరణం[మూలపాఠ్యాన్ని సవరించు]

నవంబర్ 25, 2003 న ఆయన మరణించారు.

మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ కరపుస్తకం నుండి

[1] [2]

[3]

వెలుపలి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

ఇస్మాయిల్ మిత్ర మండలి బ్లాగు (https://web.archive.org/web/20180419193027/http://ismailmitramandali.blogspot.in/)

  1. Baba, Bolloju (25 November 2014). "సాహితీ-యానం: ఇస్మాయిల్". సాహితీ-యానం.[permanent dead link]
  2. Baba, Bolloju (6 June 2016). "సాహితీ-యానం: పల్లెలో మా పాత ఇల్లు – ఇస్మాయిల్". సాహితీ-యానం.[permanent dead link]
  3. బొల్లోజు, కవుల కవి. "కవుల కవి ఇస్మాయిల్".[permanent dead link]