1860
Jump to navigation
Jump to search
1860 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1857 1858 1859 - 1860 - 1861 1862 1863 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు[మార్చు]
- ఏప్రిల్ 9: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
- మే 18: చికాగోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
- ఆగష్టు 17: బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ కమిషన్ను ఏర్పాటు చేసింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
- అక్టోబర్ 3: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
- అక్టోబర్ 6: ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.
తేదీ వివరాలు తెలియనివి[మార్చు]
- రాష్ట్రపతి నిలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ బొల్లారంలో భారత రాష్ట్రపతి విడిది కోసం నిర్మించబడింది.
జననాలు[మార్చు]
- జనవరి 29: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత. (మ.1904)
- జూలై 14: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
- జూలై 18: జయంతి రామయ్య పంతులు, కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
- ఆగష్టు 13: అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్.
- ఆగష్టు 22: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
- అక్టోబర్ 8: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933)
- అక్టోబర్ 13:హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
తేదీ వివరాలు తెలియనివి[మార్చు]
- అల్లంరాజు రంగశాయి కవి తెలుగు కవి. (మ.1936)
- ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి తెలుగు కవి, పండితుడు. (మ.1916)
- ఎడ్ల రామదాసు రామభక్తులు, గేయ రచయిత, తత్త్వకర్త. (మ.1910)
- చింతా వెంకట్రామయ్య కూచిపూడి నాట్య గురువు. (మ.1949)
- రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గాయకుడు. (మ.1935)
- బిరుదురాజు శేషాద్రి రాజు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు రచయిత.
- సత్యవోలు గున్నేశ్వరరావు, రంగస్థల నటుడు, నాటకరంగ పోషకుడు, సమాజ నిర్వాహకుడు. (మ.1925)
- సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, సంగీత విద్వాంసుడు. (మ.1922)
- అపర్ణ పాండా పర్లాకిమిడి మహారాజు యొక్క గురువు. (మ.1927)
- విష్ణు నారాయణ్ భాత్కండే హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత థాట్ పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వాడు. (మ.1936)
- చంద్రముఖి బసు, భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి కళలలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన తొలి మహిళ. (మ.1944)
మరణాలు[మార్చు]
- డిసెంబర్ 19: డల్ హౌసీ, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా భారతదేశమును పరిపాలించిన ఒక అధికారి. (జ.1812)