బ్రాండ్ వనరులు

మా బ్రాండ్‌కి సంబంధించిన రూపకల్పన విభాగాలు దిగువ ఉన్నాయి. మీకు ప్రారంభంలో ఈ పేజీలో ఉన్న సమాచారం సహాయపడుతుంది, అన్ని వినియోగాలకు YouTube ద్వారా ఆమోదం పొందాలి.

బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్‌ని పూరించండి

YouTube లోగోను ఉపయోగించడం

ఖాళీ ప్రదేశం

లోగో యొక్క ప్రభావం, విజిబిలిటీని ఇమేజ్‌లు, టెక్స్ట్, లేదా ఇతర గ్రాఫిక్స్ తగ్గించకుండా 'ఖాళీ ప్రదేశం' లోగో చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేస్తుంది. మీరు లోగో చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేస్తే, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

లోగో చుట్టూ ఉన్న 'ఖాళీ ప్రదేశం', చిహ్నం ఎత్తుకు సమానంగా లేదా అంత కంటే ఎక్కువగా ఉండాలి.

YouTube లోగో, పూర్తి రంగులు, లేత నేపథ్యంలో

సైజ్‌ను సర్దుబాటు చేయడం

మా లోగోను నిర్దిష్ట సైజ్‌లకు మేము ఆప్టిమైజ్ చేశాము. మా లోగో స్మార్ట్‌ఫోన్‌లో అయినా లేదా పెద్ద స్క్రీన్ మీద అయినా చక్కగా, స్పష్టంగా కనిపించాలి.

YouTube లోగో, పూర్తి రంగులు, లేత నేపథ్యంలో

కనీస డిజిటల్ ఎత్తు: 20dp

YouTube లోగో, పూర్తి రంగులు, లేత నేపథ్యంలో

కనీస ముద్రణ ఎత్తు: 0.125అం లేదా 3.1మిమీ

లోగోని ఉపయోగించకూడని పద్ధతులు

YouTube లోగో అన్నది వ్యక్తులు గుర్తుపట్టగల ఒక చిహ్నం, కనుక ఎప్పుడూ దానిని మార్చకూడదు.

YouTube లోగోని ఎలా ఉపయోగించకూడదో వివరించడం కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలు అందించాము.

చేయకూడనివిచేయకూడనివి

  • చిహ్నం మరియు పదం "YouTube" లేదా దాని అక్షరాల మధ్యలో ఖాళీ స్థలాన్ని మార్చడం
  • ఎరుపు రంగు కాకుండా ఏవైనా ఇతర రంగులను ఉపయోగించడం, దాదాపు పూర్తి నలుపు లేదా తెలుపు
  • "YouTube" కోసం వేరే రకమైన నమూనాను ఎంచుకోవడం
  • డ్రాప్ షాడో వంటి విజువల్ ప్రభావాలను జోడించడం
  • "YouTube" అన్న పదాన్ని ఏదైనా రకంగా మార్చడం లేదా భర్తీ చేయడం
  • లోగో ఆకారాన్ని మార్చడం
  • పదబంధం లేదా వాక్యంలో లోగోని ఉపయోగించడం
YouTube లోగోలను ఉపయోగించే సమయంలో జరిగే సాధారణ పొరపాట్లు

సాలిడ్ నేపథ్యాలలో లోగోని ఉపయోగించడం

వివిధ ఘనరూప నేపథ్యాలలో YouTube లోగో రంగుకు సంబంధించిన సరైన ఉపయోగం ఈ ఉదాహరణల్లో వివరించబడింది. బూడిద రంగు 40% కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా పూర్తి నలుపు రంగులో ఉన్న లోగోని ఉపయోగించాలి. బూడిద రంగు 50% కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా పూర్తి తెలుపు రంగులో ఉన్న లోగోని ఉపయోగించాలి.

ఘనరూప నేపథ్యాలలో YouTube లోగో

పూర్తి రంగుల్లో ఉన్న లోగో

పూర్తి రంగుల లోగోలో రెండు రకాలు ఉన్నాయి, దాదాపు పూర్తి నలుపు మరియు తెలుపు – కానీ, చిహ్నంలో ఉన్న త్రికోణం మాత్రం ఎల్లప్పుడూ తెలుపులో ఉండాలి.

లేత నేపథ్యంలో దాదాపుగా పూర్తి నలుపు రంగు లోగోని ఉపయోగించండి. ముదురు నేపథ్యంలో దాదాపుగా పూర్తి తెలుపు రంగు లోగోని ఉపయోగించండి.

పూర్తి రంగుల్లో ఉన్న నేపథ్యాలలో పూర్తి రంగుల్లో ఉన్న YouTube లోగో

ఏకవర్ణ లోగో

నేపథ్యం రంగు కారణంగా పూర్తి రంగుల్లో ఉన్న లోగోని చూడటం ఇబ్బందికరంగా ఉంటే, బదులుగా మీరు ఏకవర్ణ లోగోను ఉపయోగించాలి.

దాదాపు పూర్తి నలుపు (#282828) రంగులో ఉన్న ఏకవర్ణ లోగో చిహ్నంలో తెల్లని త్రికోణం ఉంటుంది. దీనిని లేత బహుళ వర్ణ చిత్రాల్లో ఉపయోగించాలి.

తెల్లని (#FFFFFF) ఏకవర్ణ లోగోలో వర్ణవిహీన త్రికోణం ఉంటుంది. దీనిని ముదురు బహుళ రంగుల చిత్రాలలో ఉపయోగించాలి.

బూడిద రంగు గ్రేడియంట్ నేపథ్యంలో YouTube లోగో

YouTube చిహ్నాన్ని ఉపయోగించడం

మా చిహ్నం

మా చిహ్నం కాల్ టు యాక్షన్‌గా మరియు మా లోగోకు సంక్షిప్త సంస్కరణగా ఉపయోగపడే సరళమైన గుర్తు. మీకు సరైన మొత్తంలో సురక్షిత స్థలంతో 24dpలో లోగో ఉపయోగించగలిగేంత స్థలం లేకుంటే, దానికి బదులుగా YouTube చిహ్నాన్ని ఉపయోగించుకోవాలి.

YouTube చిహ్నం, పూర్తి రంగులు

ఖాళీ ప్రదేశం

లోగో యొక్క ప్రభావం, విజిబిలిటీని ఇమేజ్‌లు, టెక్స్ట్, లేదా ఇతర గ్రాఫిక్స్ తగ్గించకుండా 'ఖాళీ ప్రదేశం' లోగో చిహ్నం చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేస్తుంది. మీరు లోగో చిహ్నం చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేస్తే, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

లోగో చిహ్నం చుట్టూ ఉన్న 'ఖాళీ ప్రదేశం', చిహ్నం ఎత్తుకు సమానంగా లేదా అంత కంటే ఎక్కువగా ఉండాలి.

YouTube లోగో, లేత, ముదుర నేపథ్యంలో లేత రంగు

సైజ్‌ను సర్దుబాటు చేయడం

మా లోగో చిహ్నాన్ని నిర్దిష్ట సైజ్‌లకు మేము ఆప్టిమైజ్ చేశాము. మా లోగో చిహ్నం స్మార్ట్‌ఫోన్‌లో అయినా లేదా పెద్ద స్క్రీన్ మీద అయినా చక్కగా, స్పష్టంగా కనిపించాలి.

YouTube చిహ్నం, పూర్తి రంగులు, లేత నేపథ్యంలో

కనీస డిజిటల్ ఎత్తు: 20dp

YouTube చిహ్నం, పూర్తి రంగులు, లేత నేపథ్యంలో

కనీస ముద్రణ ఎత్తు: 0.125అం లేదా 3.1మిమీ

చిహ్నాన్ని ఉపయోగించకూడని పద్ధతులు

YouTube చిహ్నాన్ని ఎప్పుడూ మార్చకూడదు.

చిహ్నాన్ని ఎలా ఉపయోగించకూడదో వివరించడం కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలు అందించాము.

చేయకూడనివిచేయకూడనివి

  • చిహ్నం ఆకారాన్ని క్షితిజ సమతలంగా లేదా లంబంగా సాగదీయడం
  • త్రికోణం యొక్క కోణాలు లేదా పరిమాణాన్ని మార్చడం
  • ఎరుపు రంగు కాకుండా వేరే రంగులను ఉపయోగించడం, దాదాపు పూర్తి నలుపు లేదా తెలుపు
  • చిహ్నాన్ని తిప్పడం
  • ఏవైనా ప్రత్యేక ప్రభావాలను జోడించడం
  • చిహ్నానికి నమూనా లేదా చిత్రాన్ని జోడించడం
  • త్రికోణాన్ని ఇతర ఆకారాలు లేదా చిహ్నాలతో భర్తీ చేయడం
  • త్రికోణాన్ని పదాలతో భర్తీ చేయడం
  • దీర్ఘచతురస్రం కోసం కొత్త ఆకారాన్ని ఎంచుకోవడం
YouTube చిహ్నాలను ఉపయోగించే సమయంలో జరిగే సాధారణ పొరపాట్లు

సామాజిక మీడియాలో లోగోని ఉపయోగించడం

సామాజిక మాధ్యమ ఆస్తులు YouTube ఛానెల్‌కు లింక్‌ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాటిలో YouTube చిహ్నాన్ని ఉపయోగించవచ్చు.

ముఖ్యమైనది: గమ్యస్థాన URL ఒక YouTube ఛానెల్ అయినప్పుడు మాత్రమే మీరు లోగో లేదా చిహ్నాన్ని లింక్ వలె రూపొందించవచ్చు.

సామాజిక మీడియా షేర్ బార్ సందర్భంలో YouTube చిహ్నం

సందర్భంలో YouTube సామాజిక మీడియా చిహ్నం

YouTube రంగులు

YouTube బ్రాండ్ మూలకాలను ఉపయోగించాలంటే తప్పనిసరిగా ప్రత్యేక ఆమోదం పొందాలి, అందుకోసం ఇంగ్లీష్‌లో బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం సమర్పించాలి. ఇంగ్లీష్‌లో లేని అభ్యర్థనల కోసం, మీరు మీ YouTube భాగస్వామ్యాల ప్రతిని సంప్రదించండి. తన వ్యాపార చిహ్నాల అనుచిత వినియోగాలకు అభ్యంతరం చెప్పే హక్కు YouTubeకు ఉంది. అంతే కాక తన హక్కులను ఏ సమయంలోనైనా అమలుచేయగల హక్కు కూడా కలిగి ఉంది.

బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్‌ని పూరించండి

భాగస్వాములు మరియు ప్రకటనకర్తలు

మీరు మీ YouTube ఛానెల్ లేదా కంటెంట్‌ని ప్రచారం చేయాలనుకుంటున్నారు, మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. లోగో మరియు చిహ్నం వినియోగ మార్గదర్శకాలతో పాటు దిగువ పేర్కొనబడిన వాటికి మీరు కట్టుబడి ఉన్నంత కాలం మీరు YouTube పేరు, లోగో మరియు చిహ్నాన్ని ఉపయోగించవచ్చు.

చేయదగినవి

  • YouTube బ్రాండ్ మూలకానికి సంబంధించిన అన్ని వినియోగాలకు YouTube ఆమోదం పొందండి
  • YouTube బ్రాండ్‌కి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను అనుసరించండి
  • ఛానెల్ కళాకృతిలో YouTube లోగోని పదేపదే ఉపయోగించవద్దు
  • ఉపయోగిస్తున్న లోగోలు తాజాగా ఉన్నట్లు నిర్ధారించుకోండి
  • సామాజిక చిహ్నం లైనప్‌లో YouTube చిహ్నాన్ని ఉపయోగించడం
  • మీ ఛానెల్‌కి లింక్ చేస్తున్నప్పుడు లేదా వ్యక్తులను దారి మళ్లిస్తున్నప్పుడు మీ ఛానెల్ లేదా కంటెంట్‌ని ప్రచారం చేయడం కోసం ప్రామాణిక లోగోని ఉపయోగించండి

చేయకూడనివి

  • YouTube వెలుపలి సైట్‌లకు దారి మళ్లించడం కోసం లోగోలు లేదా బ్రాండ్ మూలకాలను ఉపయోగించడం
  • లోగోలను, చిహ్నాలను లేదా ఇతర బ్రాండ్ మూలకాలను ఏదైనా రకంగా మార్చడం, ఉదాహరణకు భాగాలను, స్థితిని మార్చడం, సాగదీయడం, కుదించడం, రంగు లేదా నమూనాలను మార్చడం, తలకిందులు చేయడం లేదా తిప్పడం లేదా ప్రభావాలను జోడించడం మొదలైనవి
  • (దృశ్యమానత తక్కువగా ఉన్న కారణంగా) పూర్తి రంగుల లోగోని ఎరుపు రంగులో ఉపయోగించడం
  • లోగో లేదా చిహ్నాన్ని పాక్షికంగా కప్పివేయడం
  • లోగో లేదా చిహ్నంలో చిత్రాన్ని ఉంచడం

YouTube బ్రాండింగ్‌ను ఉపయోగించడంపై ఇక్కడ కొన్ని మంచి మరియు చెడు ఉదాహరణలు అందించాము:

YouTubeని ఇతర సామాజిక మీడియా చిహ్నాల లోపల ఉపయోగించే సమయంలో, YouTube లోగోకి బదులుగా YouTube చిహ్నాన్ని ఉపయోగించడం ఉత్తమం.

చేయదగినవి
చేయకూడనివి

సరైన YouTube లోగో & చిహ్నం

దయచేసి మీరు అనధికారిక లేదా పాత లోగోను (చాలా రకాలు ఉన్నాయి) కాకుండా సరైన, అప్‌డేట్ చేసిన YouTube లోగోను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకోవడం కోసం ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. తాజా లోగోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

చేయదగినవి
చేయకూడనివి

దృశ్యమానత తక్కువగా ఉన్న కారణంగా ఎరుపు రంగు నేపథ్యంలో ప్రామాణిక లోగోని ఉపయోగించకూడదు. ఎరుపు రంగు నేపథ్యంలో తెలుపు ఏకవర్ణ లోగో ఉత్తమంగా ఉంటుంది.

చేయదగినవి
చేయకూడనివి

వెబ్‌సైట్‌లో ఉన్న YouTube లోగోతో ఛానెల్ కళాకృతిలో పూర్తి రంగుల్లో ఉన్న లోగోని పునరావృతంగా ఉపయోగించకూడదు.

చేయదగినవి
చేయకూడనివి

మూడవ పక్ష ఆమోదాలు

  • మీకు చెందని ఏదైనా కంటెంట్‌ను మీరు YouTubeకు అప్‌లోడ్ చేసేప్పుడు సంబంధిత కంటెంట్ యజమానుల నుండి మూడవ పక్ష ఆమోదాలను పొందే బాధ్యత మీదే.
  • మీరు ప్రచార మెటీరియల్‌లో ఏదైనా కంటెంట్‌ని చూపేలా అయితే, సంబంధిత కంటెంట్ యజమానుల నుండి తప్పనిసరిగా సముచిత మూడవ పక్ష ఆమోదం పొందాలి.
  • మా భాగస్వాముల తరపున అనుమతుల గురించి YouTube చర్చించదు. సముచిత అనుమతులను పొందాలంటే, మీరు తప్పనిసరిగా నేరుగా చిత్రం లేదా వీడియో యొక్క యజమానిని సంప్రదించాలి.
  • YouTubeకి అప్‌లోడ్ చేయడం ద్వారా, మీ వీడియోని అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అన్ని హక్కులు మీకు ఉన్నట్లు మీరు హామీ ఇస్తున్నారు. తన యొక్క వినియోగ నిబంధనలు లేదా సంఘం మార్గదర్శకాలు ఉల్లంఘిస్తున్న ఏ కంటెంట్‌ని అయినా సైట్ నుండి తీసివేయగల హక్కు YouTubeకు ప్రత్యేకంగా ఉంది.

"యూట్యూబర్" అనే పదాన్ని ఉపయోగించడం

సృష్టికర్తలకు మార్గదర్శకాలు

  • చాలా మంది సృష్టికర్తలు తమను తాము యూట్యూబర్‌లని పిలుచుకోవడానికి ఇష్టపడుతుండడం మాకెంతో నచ్చింది. అయితే “యూట్యూబర్” లేదా “ట్యూబర్” అనే పదాలు అసలైన వీడియో లేదా సంగీతం కంటెంట్‌ని సృష్టించి, YouTubeలో అప్‌లోడ్ చేసే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిందిగా మేము కోరుతున్నాము.
  • ఇంకా మేము "యూట్యూబర్" పదాన్ని అనధికారిక ఉపయోగానికి మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నాము. ఆ పద్ధతిలో దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కనుక దయచేసి వీడియో సిరీస్, పుస్తకాలు మరియు కార్యక్రమాల వంటి వాటి అధికారిక పేర్లలో “యూట్యూబర్” లేదా “ట్యూబర్” అనే పదాలు ఉపయోగించకండి లేదా అలాంటి పదాలు కలిగిన డొమైన్‌లు, ఛానెల్ పేర్లు లేదా వ్యాపార చిహ్నాలను రిజిస్టర్ చేయాల్సిందిగా కోరకండి. ఇది మొత్తం సృష్టికర్త సంఘం కోసం YouTube వ్యాపార చిహ్నాన్ని కాపాడడంలో మాకు సహాయపడుతుంది.

ప్రకటనదారులకు మార్గదర్శకాలు

  • “యూట్యూబర్” అనే పదం అసలైన వీడియో లేదా సంగీత కంటెంట్‌ని సృష్టించి, YouTubeలో అప్‌లోడ్ చేసే వ్యక్తిని సూచించే సమయంలోనే ఉపయోగించాలి. ఇతర వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే అప్‌లోడ్ చేసే వ్యక్తులను సూచించడానికి "యూట్యూబర్‌లు” అనే పదం ఉపయోగించడం సరి కాదు.
  • "యూట్యూబర్" అనే పదం అనధికారికంగా మాత్రమే ఉపయోగించబడుతుందని మేము నిర్ధారించుకోగలిగేందుకు, వీడియో సిరీస్, పుస్తకాలు మరియు కార్యక్రమాల వంటి వాటి అధికారిక పేర్లలో “యూట్యూబర్” అనే పదాన్ని ఉపయోగించకూడదని, అలాంటి పదాలు కలిగిన డొమైన్‌లు, ఛానెల్ పేర్లు లేదా వ్యాపార చిహ్నాలను రిజిస్టర్ చేయాల్సిందిగా కోరకూడదని, మూడవ పక్షాలను కోరుతున్నాము. ఇది మాకోసం మరియు YouTube కమ్యూనిటి కోసం, YouTube వ్యాపార చిహ్నాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
  • “ట్యూబర్” అనే పదాన్ని YouTube సృష్టికర్తలు అనధికారికంగా ఉపయోగించవచ్చు, కానీ ప్రకటనదారులు ఎన్నడూ దాన్ని ఉపయోగించకూడదు.

YouTube బ్రాండ్ మూలకాలను ఉపయోగించాలంటే తప్పనిసరిగా ప్రత్యేక ఆమోదం పొందాలి, అందుకోసం ఇంగ్లీష్‌లో బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం సమర్పించాలి. ఇంగ్లీష్‌లో లేని అభ్యర్థనల కోసం, మీరు మీ YouTube భాగస్వామ్యాల ప్రతిని సంప్రదించండి. తన వ్యాపార చిహ్నాల అనుచిత వినియోగాలకు అభ్యంతరం చెప్పే హక్కు YouTubeకు ఉంది. అంతే కాక తన హక్కులను ఏ సమయంలోనైనా అమలుచేయగల హక్కు కూడా కలిగి ఉంది.

బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్‌ని పూరించండి

వినోదం మరియు మీడియా

YouTube బ్రాండ్‌ను ఏదైనా మీడియాలో (వీడియోలు, టీవీ కార్యక్రమాలు, చలనచిత్రాలు, వార్తాపత్రికలు, మొ.) చూపడానికి దయచేసి ఈ మార్గదర్శకాలను చదవండి.

బ్రాండ్ వినియోగ ఆమోదం

మీరు వినోదం మరియు మీడియా పరిశ్రమలో ఉన్నట్లయితే, ఏ మీడియాలో అయినా (ఉదా. టీవీ, సంగీతపరమైన వీడియోలు, చలన చిత్రాలు, పుస్తకాలు మొదలైనవి) YouTube లోగోలు, చిహ్నాలు లేదా UI యొక్క మూలకాలను (ఉదా. బటన్‌లు, పేజీలు, మొబైల్ స్క్రీన్‌షాట్‌లు మొదలైనవి) చూపించే అన్ని ఉత్పత్తి నియామకాలకు తప్పనిసరిగా YouTube ఆమోదం పొందాలి. దయచేసి దిగువ ఉన్న వాటితో సహా లోగో వినియోగ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండండి, ఆపై బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా ఆంగ్లంలో మీ అభ్యర్థనను సమర్పించండి. ఉత్పత్తి నియామకాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా అయితే, మీరు Google Inc. విడుదల ఫారమ్‌లలో సంతకం చేయాల్సి రావచ్చు.

ముఖ్యమైనది: మీరు పత్రికా విభాగానికి చెందిన వారు అయితే, మీరు బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం అభ్యర్థనను సమర్పించాల్సిన అవసరం లేదు. దయచేసి గురించి చదవండి. ఆ తర్వాత, మీరు YouTube లోగో లేదా చిహ్నాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ఉపయోగించవచ్చు.

Google అనుమతుల ఫారమ్‌ని నింపండి

మీ ఉత్పత్తి నియామకాల అభ్యర్థనను సమర్పించడానికి ముందు, దయచేసి క్రింది వాటిని నిర్ధారించుకోండి

  1. ఉత్పత్తి నియామకం YouTubeను సానుకూల లేదా తటస్థ మార్గంలో ప్రతిబింబిస్తుంది.
  2. నిర్దిష్టంగా ఉత్పత్తి నియామకం కోసం రూపొందించబడిన ఏ వీడియో అయినా కూడా YouTube సంఘం మార్గదర్శకాలు మరియు YouTube వినియోగ నిబంధనలు ఉల్లంఘించకూడదు.
  3. మీరు మీ అభ్యర్థనతో పాటు సమర్పించవలసిన నియామకం కోసం సందర్భాన్ని మరింత వివరించవచ్చు. మీరు YouTube లోగో అనుకరణలు మరియు/లేదా సందర్భంలో YouTube ఇంటర్ఫేజ్ యొక్క అనుకరణలతో PDF ఫైల్‌ని సమర్పించాలి, అలాగే సంబంధిత స్క్రిప్ట్ పేజీలు, నిర్మాణంపై స్థూలదృష్టి, నిర్మాణ సంస్థ పేరు, నిర్మాణం పేరు మరియు నటుడు (నటులు), దర్శకులు మొదలైన ఇతర వివరాలను అందించాలి, నిర్మాణంలో YouTubeకి ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వబడుతుందో తెలుసుకోవడంలో ఇవి మాకు సహాయపడతాయి.

మూడవ పక్ష ఆమోదాలు

  • సైట్‌లో ఉన్న మూడవ పక్ష కంటెంట్‌పై YouTubeకి ఎలాంటి హక్కులు ఉండవు. మీ ఉత్పత్తి నియామకంలో వినియోగదారు లేదా భాగస్వామి యొక్క కంటెంట్ చూపబడినట్లయితే, కంటెంట్‌ని ఉపయోగించడానికి కంటెంట్ యజమాని (యజమానులు) నుండి అనుమతి పొందాల్సిన బాధ్యత మీదే.
  • మా భాగస్వాముల తరపున అనుమతుల గురించి YouTube చర్చించదు. సముచిత అనుమతులను పొందాలంటే, మీరు తప్పనిసరిగా నేరుగా చిత్రం లేదా వీడియో యొక్క యజమానిని సంప్రదించాలి.
  • YouTubeకి అప్‌లోడ్ చేయడం ద్వారా, అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అన్ని హక్కులు మీకు ఉన్నట్లు మీరు హామీ ఇస్తున్నారు. తన యొక్క వినియోగ నిబంధనలు లేదా సంఘం మార్గదర్శకాలు ఉల్లంఘిస్తున్న ఏ కంటెంట్‌ని అయినా సైట్ నుండి తీసివేయగల హక్కు YouTubeకు ప్రత్యేకంగా ఉంది.
  • మీ సమాచారం మరియు మెటీరియల్‌లు మొత్తం మీ వద్ద సిద్ధంగా ఉన్న తర్వాత, బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం ఆంగ్లంలో బ్రాండ్ ఉపయోగ అభ్యర్థనను సమర్పించండి. దయచేసి ప్రత్యుత్తరం కోసం గరిష్టంగా వారం రోజులు వేచి ఉండండి. ఆంగ్లంలో లేని అభ్యర్థనల కోసం, మీ YouTube భాగస్వామ్యాల ప్రతికి వెళ్లండి. తన వ్యాపారచిహ్నాల యొక్క ఏవైనా అనుచితమైన వినియోగాలపై అభ్యంతరం వ్యక్తం చేయగల మరియు తమ హక్కులను ఏ సమయంలోనైనా అమలు చేయగల హక్కు YouTubeకు ప్రత్యేకంగా ఉంది.

YouTube బ్రాండ్ మూలకాలను ఉపయోగించాలంటే తప్పనిసరిగా ప్రత్యేక ఆమోదం పొందాలి, అందుకోసం ఇంగ్లీష్‌లో బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం సమర్పించాలి. ఇంగ్లీష్‌లో లేని అభ్యర్థనల కోసం, మీరు మీ YouTube భాగస్వామ్యాల ప్రతిని సంప్రదించండి. తన వ్యాపార చిహ్నాల అనుచిత వినియోగాలకు అభ్యంతరం చెప్పే హక్కు YouTubeకు ఉంది. అంతే కాక తన హక్కులను ఏ సమయంలోనైనా అమలుచేయగల హక్కు కూడా కలిగి ఉంది.

Google అనుమతుల ఫారమ్‌ని నింపండి

API డెవలపర్‌లు

YouTube API ద్వారా మీరు YouTube విధిని మీ అప్లికేషన్ లేదా డివైజ్‌లో జోడించవచ్చు. దిగువ పేర్కొన్న సైట్‌ని సందర్శించి, మార్గదర్శకాలను చదవండి మరియు మీ అప్లికేషన్, డివైజ్ లేదా మార్కెటింగ్ మెటీరియల్‌లలో YouTube బ్రాండింగ్‌ని జోడించడానికి మీకు అవసరమైన ఆస్తులను డౌన్‌లోడ్ చేసుకోండి.

YouTube API డెవలపర్‌ల బ్రాండింగ్ మార్గదర్శకాలను సందర్శించండి

డివైజ్ భాగస్వాములు

YouTube బ్రాండ్‌కి సంబంధించిన మీ వినియోగానికి ఆమోదం పొందాలంటే, దయచేసి బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్ ద్వారా సమీక్ష కోసం ఆంగ్లంలో అభ్యర్థనను సమర్పించండి. దయచేసి ప్రత్యుత్తరం కోసం గరిష్టంగా వారం రోజులు వేచి ఉండండి. తన వ్యాపారచిహ్నాల యొక్క ఏవైనా అనుచితమైన వినియోగాలపై అభ్యంతరం వ్యక్తం చేయగల మరియు తమ హక్కులను ఏ సమయంలోనైనా అమలు చేయగల హక్కు YouTubeకు ప్రత్యేకంగా ఉంది. మీ పరికరంలో YouTube మరియు YouTube బ్రాండ్ యొక్క మీ వినియోగానికి YouTubeతో ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందం అవసరం మరియు ఒప్పందంలో YouTube యొక్క సర్టిఫికేట్ అవసరాలను ఆమోదించే పరికరానికి లోబడి ఉంటుంది.

బ్రాండ్ వినియోగ అభ్యర్థన ఫారమ్‌ని పూరించండి