2007
Jump to navigation
Jump to search
2007 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 2004 2005 2006 - 2007 - 2008 2009 2010 |
దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
సంఘటనలు[మార్చు]
జనవరి[మార్చు]
- జనవరి 1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
- జనవరి 1: బల్గేరియా, రుమేనియాలు యూరోపియన్ యూనియన్ లోకి ప్రవేశించాయి.
- జనవరి 4: అమెరికా ప్రతినిధులసభ తొలి మహిళా స్పీకర్‌గా నాన్సీ పెలోసీ నియమించబడింది.
- జనవరి 10: హుగో చావెజ్ వెనిజులా అధ్యక్షుడిగా రెండో సారి ప్రమాణస్వీకారం.
- జనవరి 11: ప్రపంచ వాణిజ్య సంస్థ 150వ సభ్యదేశంగా వియత్నాం ప్రవేశించింది.
- జనవరి 30: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ విస్టా, ఆఫీస్ 2007 లను విడుదలచేసింది.
- ఫిబ్రవరి 4: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
ఫిబ్రవరి[మార్చు]
- ఫిబ్రవరి 16: చెచన్యా అధ్యక్షుడిగా మాజీ వేర్పాటు ఉద్యమనేత రమజాన్ కాడిరోవ్ బాధ్యతలు చేపట్టాడు.
మార్చి[మార్చు]
- మార్చి 12: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
ఏప్రిల్[మార్చు]
- ఏప్రిల్ 17: 2014 ఆసియా క్రీడలు నిర్వహణ బిడ్‌ను ఢిల్లీతో పోటీపడి దక్షిణ కొరియాలోని ఇంచెయాన్ నగరం గెల్చుకుంది.
మే[మార్చు]
- మే 16: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
జూన్[మార్చు]
- జూన్ 10: కెనెడియన్ గ్రాండ్ ప్రిక్స్‌ను లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు.
- జూన్ 27: యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
జూలై[మార్చు]
- జూలై 4: 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేదించబడింది.
- జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని చేపట్టింది.
- జూలై 28: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి, ముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఆగష్టు[మార్చు]
- ఆగష్టు 2: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నారాయణదత్త్ తివారీ ప్రమాణస్వికారం.
- ఆగష్టు 28: అబ్దుల్లా గుల్ టర్కీ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
సెప్టెంబర్[మార్చు]
- సెప్టెంబర్ 7: రగ్బీ ప్రపంచ కప్-2007 ఫ్రాన్సులో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 12: రష్యా ప్రధానమంత్రి మైకేల్ ప్రాద్కోవ్, మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది.
- సెప్టెంబర్ 13: బుర్జ్ దుబాయ్ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా రికార్డు సృష్టించింది. టొరంటోలోని సిఎన్ టవర్ రికార్డు ఛేదించబడింది.
- సెప్టెంబర్ 14: రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.
- సెప్టెంబర్ 24: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్యాన్ పై విజయం సాధించింది.
అక్టోబర్[మార్చు]
నవంబర్[మార్చు]
- నవంబర్ 24: ఆస్ట్రేలియా ఎన్నికలలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ విజయం సాధించింది.
డిసెంబర్[మార్చు]
- డిసెంబర్ 3: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 11: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 20,000 మైలురాయిని దాటింది.
- డిసెంబర్ 21: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న రాణిగా రికార్డు సృష్టించించి. దీనితో విక్టోరియా రాణి రికార్డు ఛేదించబడింది.
- డిసెంబర్ 25: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 30: హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 30: కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాడు.
జననాలు[మార్చు]
మరణాలు[మార్చు]
- జనవరి 1: డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
- జనవరి 1: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)
- జనవరి 2: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
- జనవరి 4: కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
- జనవరి 5: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
- జనవరి 22: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)
- మార్చి 22: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918)
- ఏప్రిల్ 7: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
- ఏప్రిల్ 13: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
- ఏప్రిల్ 13: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933)
- జూలై 8: చంద్రశేఖర్, భారత మాజీ ప్రధానమంత్రి.
- జూలై 11: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు.
- జూలై 30: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918)
- ఆగష్టు 17: దశరథ్ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి.
- సెప్టెంబర్ 4: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (జ.1929)
- సెప్టెంబర్ 4: వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
- సెప్టెంబర్ 28: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920)
- సెప్టెంబర్ 29: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
- అక్టోబరు 23: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)
- అక్టోబరు 23: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)
- నవంబర్ 4: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926)
- నవంబర్ 19: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
- డిసెంబరు 13: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
- డిసెంబర్ 27: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)