“మీరెక్కడి మనిషి బాబూ! సినిమా వాళ్లను ఎవడయినా అలాగే అంటాడు. ఇప్పుడు కొత్తగా వాళ్లకు మర్యాదలేమిటీ?” చిరాకు అణుచుకుని మళ్లీ అందుకున్నాడు. “ఆ బాబుగారికి నటనలో ఓనమాలు తెలీవు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాక మొహంలో ఒకటే ఫీలింగ్. వాళ్ల బాబు దగ్గర డబ్బులుండబట్టి అన్ని సినిమాలు ఫ్లాపయినా ఇంకా సినిమాలు తీస్తూ జనాల్ని చంపుతున్నాడు కానీ బుర్ర ఉన్న వాడెవడూ డైలాగ్ లేని వేషం కూడా ఇవ్వడు.

భారత దేశపు బీద అమ్మాయిలందరిలాగే ఓపికమ్మకు ఓపిక ఎక్కువ. పదిహేనేళ్ళకే పెళ్ళి చేస్తే అప్పటి వరకూ ముక్కూ మొహం తెలియని అత్తవారింటికి వెళ్ళి ఓపికగా ఇంటెడు చాకిరీ చేసింది. కాలక్రమేణా ముగ్గురు మగ పిల్లలు, ఓ ఆడ పిల్ల పుడితే వారందరినీ ఓపికగా సాకింది. ఇంతలో భర్తను గిట్టని వారెవరో జైలు పాలు చేయగా సంసారం కిందపడ్డ గుమ్మడికాయలా ముక్కచెక్కలు కాకుండా ఓపికగా కాచుకుంది.

అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. బాక్‌పాక్ లోంచి బట్టలన్నీ తీసి, తను వేసుకున్న ప్యాంటు, టీషర్టూ కూడా తీసేసి చకచకా వాషింగ్ మెషీన్లో పడేశాడు. అతను టీషర్టు తీస్తున్నప్పుడు చూశాను. తెల్లగా కండలు తిరిగిన శరీరం, చంకలకింద జీబురుగా పెరిగిన నల్లటి వెంట్రుకలు, పొట్టమీద పలకల మధ్య డైమ్‌లా మెరుస్తున్న బొడ్డూ, పొడుగాటి తెల్లటి చేతులూ–అతని ఒంటిమీంచి వస్తున్న మొగవాసన. అతని దేహం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఒక రచన అంటే ఏమిటి? దానికి, రచయితకి ఉండే సంబంధం ఏమిటి? రచనలో పాఠకుడి పాత్ర ఏమిటి? ఈ విషయాలు ప్రాముఖ్యంలోకి రాకముందే, ఈ కావ్యదహనోత్సవం జరిగింది. డెత్ ఆ ది ఆథర్ అని 1967లో గానీ రోలాండ్ బార్తా రాయలేదు. దానికి ముందే, ఈ సమావేశంలో ఒక పాఠకుడు ఈ ప్రశ్నలు రేకెత్తుతాడు.

ఆమె అతని ముంజేతిలో చేయి కలిపి నడవసాగింది. అతను మాటిమాటికీ గొంతు సవరించుకోవడం మొదలెట్టాడు. మనసు వికలం అయినప్పుడల్లా అలా చెయ్యడం అతని అలవాటు. బస్‌స్టాండ్ కిందకు చేరి నిలుచున్నాక అతను గొడుగు ముడిచాడు. ఎదురుగా కొద్దిదూరంలో, గాలికి ఊగుతూ ఆకులనుండి నీళ్ళు రాలుతున్న చెట్టుక్రింద, చిన్న బురదగుంటలో, ఇంకా రెక్కలురాని పక్షిపిల్ల ఒకటి అటూ ఇటూ పొర్లుతోంది బైటకు రాలేక.

ఛైర్మన్ మావ్ అన్నట్లుగానే, ఈ ఉద్యమం (కల్చరల్ రివల్యూషన్) ధ్యేయం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే క్యాపిటలిజం దారి తొక్కుతున్నవాళ్ళనూ, క్యాపిటలిస్టుల్లో రియాక్షనరీలనూ ఏరివేయడం. నాలాంటి సామాన్యులకూ ఈ ఉద్యమానికీ అస్సలు సంబంధం లేదు.

లూచియా డి లమర్‌మూర్ అనునది సాల్వదోరే కమ్మరానో అను ఇటాలియను కవి రచించిన విషాదాంతసంగీతరూపకము. దీని నితడు సర్ వాల్టర్ స్కాట్ రచించిన లమర్‌మూర్ వధువు అను నవల ననుసరించి రచించియుండెను. ఈ రూపకమును సుప్రసిద్ధుడైన ఇటలీదేశసంగీతకర్త గితానో దొనిట్సెత్తి సంగీతబద్ధము చేసెను.

భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.

సూర్య చంద్రులు లేరని
హరివిల్లు ఆకాశాన్ని విడిచి వెళ్ళింది
ఆధారంగా ఉంటుందనుకున్న దారం
పతంగం చేయి వదిలి ఫక్కున నవ్వింది
మది ఊసుల్ని గానం చేయాలనుకున్న కోకిల
శ్రోతలే లేక బిక్కు బిక్కు మన్నది

ఎన్నెన్ని నిండుకుండల్లాంటి మేఘాలు! గుండుపిన్నుతో గుచ్చకుండానే టప్‌మని పేలిపోయే బెలూన్‌లా ఎంత వుబ్బిందో నా గుండెకాయ! ఎప్పుడు ముట్టుకుంటే పేలిపోతదోనని కాపలా కాస్తుంట. నీ వూహల ప్రపంచం గేటు కాడ నిలబడి, కూలబడి, నిండుకున్న వూటచెలిమల తడిని తడుముకుంటుంటే ఖాళీ ఆకాశంలో రంగుల గాలిపటాలు ఎగరేసిన సాయంత్రాలు యాదికొస్తుంటాయి. మాంజా తెగిన పతంగై నీ కోసం వెతుకుతుంటా.

మళ్లీ… నవ్వేయాల్సొస్తుంది
గడ్డకట్టిన ముఖాన్ని చీల్చుకుని
నుదుటిమీద జీవితం తుఫుక్కున
ఉమ్మిన తడి నిజాలు జారిపోతుండగా
మళ్లీ… ముడి విప్పాల్సొస్తుంది
ఛెళ్లున తగిలిన చెంపదెబ్బ
మనసుని మండిస్తుండగా

జూస్‍ని పోలిన వ్యక్తి ఇంద్రుడు. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో ఒకడు.

గూడెంలోని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిన ఒక నిజాయితీ గల టీచరు అనుభవాలు, చిన్న కథలుగా మారిన సంపుటి; ‘మొగ్గలు’ అనే ఒక ప్రత్యేకమైన కవితారూపమిది అని వెలువరించిన పుస్తకం; అంతర్జాల పాఠకుల చూపునీ, కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన ముక్తకాలు, ఈ సంచికలో.

క్రితం సంచికలోని గడినుడి-40కి మొదటి ఇరవై రోజుల్లో ఆరుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, సరస్వతి పొన్నాడ, వైదేహి అక్కిపెద్ది, కన్యాకుమారి బయన. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-40 సమాధానాలు.

ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో… కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020 కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ పురస్కారపు 2019 గ్రహితలు కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి – బడి; కథ: యమ్.వి రామిరెడ్డి – వెంటవచ్చునది.