సేవా నిబంధనలు
Facebookకి స్వాగతం!
వ్యక్తులు పరస్పరం అనుసంధానమవ్వడం, సంఘాలను రూపొందించుకోవడం మరియు వ్యాపారాలను వృద్ధి చేసుకోవడం వంటివి అనుమతించే సాంకేతికతలు మరియు సేవలను Facebook రూపొందిస్తోంది. మేము ప్రత్యేకించి (ఇవి కాకుండా) వేరే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించినప్పుడు మినహా, ఈ నిబంధనలు మీ Facebook, Messenger వినియోగానికి మరియు మేము అందించే ఇతర ఉత్పత్తులు, ఫీచర్లు, యాప్‌లు, సేవలు, సాంకేతికతలు మరియు సాఫ్ట్వేర్ (Facebook ఉత్పత్తులు లేదా ఉత్పత్తుల)ను మీరు వినియోగించే విధానానికి వర్తిస్తాయి. Facebook, Inc. వారు ఈ ఉత్పత్తులను మీకు అందిస్తున్నారు.
Facebook లేదా ఇతర ఉత్పత్తులు మరియు ఈ నిబంధనల క్రింద వర్తించే సేవల కోసం మేము ఎటువంటి ఛార్జీని విధించము. బదులుగా, తమ ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించిన ప్రకటనలను మీకు చూపేందుకుగానూ వ్యాపారాలు మరియు సంస్థలు మాకు చెల్లింపులు చేస్తాయి. మా ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా, మీకు మరియు మీ ఆసక్తులకు సంబంధితమైనవిగా మేము భావించే ప్రకటనలను మేము మీకు చూపవచ్చునని మీరు అంగీకరిస్తున్నారు. మీకు ఎలాంటి ప్రకటనలను చూపవచ్చునని నిర్ధారించుకునేందుకు మేము మీ వ్యక్తిగత డేటాని ఉపయోగిస్తాము.
మేము మీ వ్యక్తిగత డేటాని ప్రకటనదారులకు విక్రయించము మరియు ప్రత్యేకించి మీరు అనుమతిస్తే తప్ప మిమ్మల్ని నేరుగా గుర్తించేటటువంటి ఏ విధమైన (పేరు, ఇమెయిల్ చిరునామా లేదా ఇతర సంప్రదింపు సమాచారం వంటి) సమాచారాన్నీ మేము ప్రకటనదారులతో పంచుకోము. బదులుగా, తమ ప్రకటనలను ఏ రకమైన ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారు వంటి విషయాలను గురించిన ప్రకటనదారులు మాకు తెలియజేస్తారు మరియు ఆసక్తి కలిగి ఉండే అవకాశం ఉన్న వ్యక్తులకు మేము ఆ ప్రకటనలను ప్రదర్శిస్తాము. తమ ప్రకటనలలోని కంటెంట్‌తో వ్యక్తులు ఎంత మేరకు పరస్పర చర్యలో పాల్గొంటున్నారో ప్రకటనదారులు తెలుసుకునేందుకుగానూ, మేము వారి ప్రకటనలకు సంబంధించిన పనితీరు నివేదికలను వారికి అందజేస్తాము. మరింత తెలుసుకోవడానికి దిగువన ఉన్న 2వ విభాగాన్ని చూడండి.
మీరు చూసేటటువంటి కొన్ని ప్రకటనలను నిర్ధారించేందుకు మరియు దిగువన వివరించబడిన ఇతర సేవలు అన్నింటినీ అందజేసేందుకు మేము మీ వ్యక్తిగత డేటాను సేకరించడం మరియు ఉపయోగించడం గురించి మా డేటా విధానం వివరిస్తుంది. మేము మీ డేటాను ఏ విధంగా ఉపయోగిస్తామో తెలుసుకొని గోప్యతా ఎంపికలను సమీక్షించేందుకు, మీరు ఎప్పుడైనా మీ సెట్టింగ్‌లకు కూడా వెళ్లవచ్చు.
1. మేము అందజేసే సేవలు
మెరుగైన సమాజ స్థాపనకు చేయూతనివ్వడంతోపాటు ప్రపంచ మానవాళిని ఒక్కటి చేయడమే మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడటానికి, మేము క్రింద వివరించిన ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందిస్తాము:మీ కోసం వ్యక్తిగతీకరించిన అనుభవం అందించబడుతుంది:
Facebookలో మీ అనుభవం మీకంటూ ప్రత్యేకంగా రూపొందిందనే భావన కలిగించేలా ఉంటుంది: వార్తల ఫీడ్‌లో మీకు కనిపించే పోస్ట్‌లు, కథనాలు, ఈవెంట్లు, ప్రకటనలు మరియు ఇతరత్రా కంటెంట్ లేదా మీరు అనుసరించే పేజీలకు మేము అందించే వీడియో ప్లాట్ఫారం మరియు మీరు ఉపయోగించే జనాదరణ అంశాలు, Marketplace మరియు శోధన వంటి ఇతర విశేషాంశాలు మీ అభిరుచుల మేరకు వ్యక్తిగతీకరించి అందించబడతాయి. మీకు సంబంధించి మా వద్ద ఉండే డేటాను ఉపయోగిస్తాము - ఉదాహరణకు, మీరు ఏర్పరుచుకునే అనుసంధానాలు, మీరు ఎంచుకునే ఎంపికలు మరియు సెట్టింగ్‌లు మరియు మీరు పంచుకునే అంశాలు మరియు మా ఉత్పత్తుల్లో మరియు వెలుపల మీ కార్యకలాపాలు, ఇలాంటి వాటన్నింటి ఆధారంగా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరిస్తాము. మిమ్మల్ని మీరు శ్రద్ధ వహించే వ్యక్తులు మరియు సంస్థలతో అనుసంధానిస్తాము:
మీరు ఉపయోగించే Facebook ఉత్పత్తుల వ్యాప్తంగా మీరు ఆసక్తి కనబర్చే వ్యక్తులు, సమూహాలు, వ్యాపారాలు, సంస్థలు మరియు ఇతరత్రా వాటిని కనుగొనడంలో మరియు వారితో/వాటితో అనుసంధానం కావడంలో మీకు సహాయపడతాము. మా వద్ద ఉండే డేటాను ఉపయోగించి మేము మీకు మరియు ఇతరులకు సూచనలు అందిస్తాము - ఉదాహరణకు, గ్రూపుల్లో చేరమనే సూచనలు, ఈవెంట్లకు హాజరవ్వమనే సూచనలు, పేజీలను అనుసరించమని లేదా సందేశాలు పంపమని సూచనలు, కార్యక్రమాలు వీక్షించమనే సూచనలు మరియు మీరు స్నేహితులు కావాలని భావించే లాంటి వ్యక్తుల స్నేహ సూచనలు. బలోపేతమైన మానవ సంబంధాలు మెరుగైన సమాజ స్థాపనకు తోడ్పడతాయి, కనుక వ్యక్తులు తాము శ్రద్ధ వహించే వ్యక్తులు, సమూహాలు మరియు సంస్థలతో అనుసంధామైనప్పుడు మా సేవలు అత్యుత్తమ స్థాయిలో సఫలీకృతం అవుతాయని మేము విశ్వసిస్తున్నాము. మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపర్చగలిగే మరియు మీకు ఆసక్తి ఉన్న అంశాలపై మీ భావాలు/అభిప్రాయాలు పంచుకోగలిగే మరియు చర్చలు చేపట్టగలిగే అధికారం మీకు అందజేస్తుంది:
Facebookలో మీ భావాలను వ్యక్తీకరించడానికి మరియు మీరు శ్రద్ధ కనబర్చే విషయాల గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో పరస్పర భావాలు పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి - ఉదాహరణకు, మీరు ఉపయోగించే Facebook ఉత్పత్తుల అంతటా స్థితి విశేషాలు, ఫోటోలు, వీడియోలు మరియు కథనాలను పంచుకోవడం, స్నేహితులకు లేదా అనేక మంది వ్యక్తులకు సందేశాలు పంపడం, ఈవెంట్లు లేదా సమూహాలను సృష్టించడం లేదా మీ ప్రొఫైల్‌కు కంటెంట్‌ను జోడించడం వంటివి. మేము కూడా వ్యక్తుల కోసం నేటి సాంకేతికతను అందించపుచ్చుకుంటూ అనేక మార్గాలను అభివృద్ధి చేసాము మరియు వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాము, ఉదాహరణకు అభివృద్ధి చెందిన సహజ కాల్పనికత మరియు 360 వీడియోలు, వీటి సహాయంతో Facebookలోని కంటెంట్‌ను మరింత భావప్రకాశంగా మరియు ఆకర్షణీయంగా రూపొందించగలరు మరియు పంచుకోగలరు. మీకు ఆసక్తి అనిపించే కంటెంట్, ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది:
Facebook మరియు ఇతరత్రా Facebook ఉత్పత్తులు ఉపయోగించే అనేక వ్యాపార రంగాలు మరియు సంస్థల నుండి అందించబడే కంటెంట్, ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనడంలో మీకు సహాయపడేందుకు మేము మీకు ప్రకటనలు, ఆఫర్లు మరియు ఇతర ప్రాయెజిత కంటెంట్‌ను చూపుతుంటాము. దిగువన ఉన్న 2వ విభాగం మీకు దీనిని గురించి మరింత వివరిస్తుంది. హానికర ప్రవర్తనను అడ్డుకోవడంతోపాటు మన సమాజానికి రక్షణను మరియు మద్దతును అందిస్తాము:
తాము సురక్షితంగా ఉన్నట్లు భావించినప్పుడే ప్రజలు Facebookలో సంఘాన్ని ఏర్పరుస్తారు. మా ఉత్పత్తులు దుర్వినియోగం పాలవుతుంటే, ఇతరుల పట్ల ద్వేషపూరిత ప్రవర్తనను కనబరుస్తుంటే మరియు మా సంఘానికి మద్దతు తెలపడంలో లేదా రక్షణ కల్పించడంలో మేము సహాయం అందించగల పరిస్థితులు ఉంటే గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు అధునాతన సాంకేతికత వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంటాము. మాకు ఇలాంటి కంటెంట్ లేదా ప్రవర్తన గురించి తెలిస్తే, మేము తగిన చర్య తీసుకుంటాము - ఉదాహరణకు, సహాయాన్ని అందించడం, కంటెంట్‌ను తీసివేయడం, నిర్దిష్ట ఫీచర్లకి యాక్సెస్‌ను తీసివేయడం లేదా పరిమితం చేయడం, ఖాతాను నిలిపివేయడం లేదా చట్ట పరిరక్షణ సంస్థను సంప్రదించడం. మా ఉత్పత్తులలో ఏదైనా ఒక దానిని ఉపయోగించే ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడినట్లు లేదా హానికరమైన ప్రవర్తనను కనబరుస్తున్నట్లు మేము గుర్తించినప్పుడు డేటాను ఇతర Facebook కంపెనీలతో పంచుకుంటాము. అందరికీ సురక్షితమైన మరియు క్రియాశీల సేవలను అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తాము మరియు అభివృద్ధి చేస్తాము:
మేము కృత్రిమ మేధస్సు, యాంత్రిక అధ్యయన సిస్టమ్‌లు మరియు అభివృద్ధి చెందిన ఆర్గుమెంటెడ్ రియాలిటీ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తాము, అభివృద్ధి చేస్తాము, వీటి వలన వినియోగదారులు మా ఉత్పత్తులను భౌతికంగా ఉండటం లేదా భౌగోళిక స్థానం వంటివి అవసరం లేకుండానే ఉపయోగించగలరు. ఉదాహరణకు, దృష్టి లోపాలు ఉన్న వ్యక్తులు Facebook లేదా Instagramలో పంచుకోబడిన ఫోటోలు లేదా వీడియోల్లో ఏమి ఉన్నది లేదా ఎవరు ఉన్నది వంటివి అర్థం చేసుకోవడంలో ఇలాంటి సాంకేతికత సహాయపడుతుంది. పరిమిత స్థాయిలో యాక్సెస్ ఉండే ప్రాంతాల్లో ఉంటున్న మరింత మంది వ్యక్తులు ఇంటర్నెట్కు అనుసంధానమయ్యేలా చేయడానికి మేము అధునాతన నెట్వర్క్ మరియు కమ్యూనికేషన్ సాంకేతికతను కూడా రూపొందించాము. అలాగే, మా ఉత్పత్తుల్లో మా కమ్యూనిటీలు మరియు సమగ్రతకు భంగం కలిగించే దుర్వినియోగ మరియు ప్రమాదకర కార్యాచరణను గుర్తించగల మా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి స్వయంచాలిత వ్యవస్థలను అభివృద్ధి చేసాము. మా సేవలను మెరుగైనవిగా తీర్చిదిద్దే మార్గాలపై పరిశోధన:
మేము మా ఉత్పత్తులను అభివృద్ధి పరిచి, పరీక్షించడంతోపాటు మెరుగుపరిచే పరిశోధనలో నిమగ్నమై ఉన్నాము. మా వినియోగదారులకు సంబంధించి మేము కలిగి ఉన్న డేటాని విశ్లేషించడం మరియు వ్యక్తులు మా ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడం, ఉదాహరణకు సర్వేలను నిర్వహించి, కొత్త ఫీచర్లను పరిష్కరించడం వంటివి ఇందులో ఉంటాయి. మా సేవలను అభివృద్ధి పరచడంతోపాటు మా సేవలకు మెరుగులద్దే ఈ పరిశోధనకు మా వంతు సహకారాన్ని అందించడం కోసం డేటాను ఎలా వినియోగిస్తున్నామో, మా డేటా విధానం వివరిస్తుంది. Facebook కంపెనీ ఉత్పత్తులన్నింటిలో స్థిరమైన మరియు నిరంతరమైన అనుభవాలను అందించండి:
వ్యక్తులు, సమూహాలు, వ్యాపారాలు, సంస్థలు మరియు మీకు ముఖ్యమనిపించే వాటిని లేదా వారిని కనుగొని, అనుసంధానించడంలో మా ఉత్పత్తులు మీకు సహాయపడతాయి. మీరు ఉపయోగించే విభిన్న Facebook కంపెనీ ఉత్పత్తులు అన్నింటిలో స్థిరమైన మరియు పొందికైన అనుభవాన్ని పొందేలా మేము మా వ్యవస్థలను రూపొందిస్తాము. ఉదాహరణకు, మీరు Facebookలో మాట్లాడే వ్యక్తులకు సంబంధించిన డేటాను మేము ఉపయోగించడం ద్వారా Instagram లేదా Messengerలో వారితో మీరు సులభంగా అనుసంధానం కాగలిగేలా చేస్తాము, అలాగే మీరు Facebookలో అనుసరించే వ్యాపార సంస్థతో Messenger ద్వారా కమ్యూనికేట్ చేసే సౌలభ్యాన్ని మీకు అందిస్తాము. మా సేవలకు ప్రపంచవ్యాప్త యాక్సెస్‌ను అనుమతించండి:
మా ప్రపంచవ్యాప్త సేవను అమలు చేయడం కోసం, మేము కంటెంట్ మరియు డేటాను మీ నివాస దేశం వెలుపలి ప్రాంతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా డేటా కేంద్రాలు మరియు సిస్టమ్‌లలో నిల్వ చేయాలి మరియు పంపిణీ చేయాలి. ఈ మౌలిక సదుపాయం Facebook, Inc., Facebook ఐర్లాండ్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు నిర్వహించవచ్చు లేదా నియంత్రించవచ్చు. 2. మా సేవలకు నిధులు ఎలా సమకూరుతాయి
Facebook, అలాగే మేము అందించే ఇతర ఉత్పత్తులు మరియు సేవలను వినియోగించడానికి చెల్లించేందుకు బదులుగా, ఈ నిబంధనలు వర్తింపజేయబడే Facebook ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా Facebook కంపెనీ ఉత్పత్తులలోనూ మరియు వెలుపల ప్రచారం చేసే నిమిత్తం మేము చెల్లింపులు పొంది ఉన్న కొన్ని వ్యాపారాలు మరియు సంస్థలకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను మేము మీకు చూపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. మీకు మరింత సంబంధితమైన ప్రకటనలను చూపేందుకు, మేము మీ కార్యకలాపాలు మరియు ఆసక్తులు మొదలైనటువంటి మీ వ్యక్తిగత డేటాకి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము. మేము మా ప్రకటన వ్యవస్థను ఎలా రూపొందించాము అని తెలియజేసేందుకు, వ్యక్తుల గోప్యతను రక్షించడం అనేది కీలకమైనది. అంటే ప్రకటనదారులకు మీరు ఎవరు అని తెలియజేయకుండానే, మేము మీకు సంబంధితమైన మరియు ఉపయోగకరమైన ప్రకటనలను చూపుతాము అని అర్థం. మీ వ్యక్తిగత డేటాని మేము విక్రయించము. ప్రకటనదారులు, తమ వ్యాపార లక్ష్యాన్ని గురించి మరియు తమ ప్రకటనలను ఏ రకమైన ప్రేక్షకులు (ఉదాహరణకు, సైకిల్ తొక్కడం ఇష్టపడే 18-35 ఏళ్ల వ్యక్తులు వంటి వాళ్లు) చూడాలని తాము కోరుకుంటున్నారు వంటి విషయాలను గురించి మాకు తెలియజేసేందుకు అనుమతిస్తాము. అప్పుడు మేము వారి ప్రకటనలను వాటిలో ఆసక్తి కలిగి ఉండే అవకాశం ఉన్న వ్యక్తులకు చూపుతాము. Facebookలోనూ మరియు వెలుపల వ్యక్తులపై తమ కంటెంట్ ఎంతమేరకు ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవడంలో ప్రకటనదారులకు సహాయపడేందుకు వారి ప్రకటనల ప్రభావానికి సంబంధించిన నివేదికలను కూడా వారికి అందజేస్తాము. ఉదాహరణకు, ప్రకటనదారులు తమ ప్రేక్షకులను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు మేము వారికి సాధారణ జనాభా మరియు ఆసక్తి సంబంధిత సమాచారాన్ని (ఉదా, మాడ్రిడ్‌లో నివసిస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌ను ఇష్టపడే 25 - 34 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీ ప్రకటనను చూసారు) అందిస్తాము. మీరు నిర్దిష్టంగా అనుమతిస్తే మినహా, నేరుగా మిమ్మల్ని గుర్తించేటటువంటి ఏ విధమైన సమాచారాన్నీ (మీ పేరు లేదా మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించబడే లేదా మీరు ఎవరో గుర్తించే వీలు కల్పించే ఇమెయిల్ చిరునామా వంటి సమాచారం) మేము ఎవరితోనూ పంచుకోము. Facebook ప్రకటనలు ఎలా పని చేస్తాయి అనే మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఎగువన మేము వివరించిన సేవలను మీకు అందించే క్రమంలో మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము మరియు వినియోగిస్తాము. మేము మీ డేటాను సేకరించడం మరియు ఉపయోగించడం గురించి మీరు మా డేటా విధానంలో మరింత తెలుసుకోవచ్చు. మీకు చూపబడేటటువంటి ప్రకటనలు మరియు ప్రకటనదారుల రకాలు, అలాగే మేము మీకు ఏ విధమైన ప్రకటనలు చూపాలో నిర్ధారించుకునేందుకు ఉపయోగించేటటువంటి సమాచార రకాలపై మీకు నియంత్రణ ఉంటుంది. మరింత తెలుసుకోండి.3. Facebook మరియు మా సంఘానికి మీ నిబద్ధతాంశాలు
మా లక్ష్యసాధన వైపు మరింత ఎక్కువగా పురోగమించడంలో సహాయపడాలనే ఉద్దేశ్యంతో మీకు మరియు ఇతరులకు ఈ సేవలను అందిస్తాము. మా సేవలకు బదులుగా మీరు క్రింది విషయాలలో నిబద్ధత పాటించాలని కోరుకుంటున్నాము:1. Facebookను ఎవరు ఉపయోగించవచ్చు
వ్యక్తులు వారి అభిప్రాయాలు మరియు చర్యలకు కట్టుబడి ఉన్నట్లయితే, మా సంఘం మరింత విశ్వసనీయమైనదిగా అవుతుంది. ఈ కారణం చేత, మీరు తప్పనిసరిగా: - మీ దైనందిన జీవితంలో పిలవబడే పేరునే ఉపయోగించండి.
- మీకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి.
- కేవలం ఒక్క ఖాతాను(మీ స్వంతది) మాత్రమే సృష్టించండి మరియు మీ టైమ్‌లైన్‌ని వ్యక్తిగత విషయాలను పంచుకోవడం కోసం ఉపయోగించుకోండి.
- మీ పాస్‌వర్డ్‌ని ఇతరులతో పంచుకోవడం, మీ Facebook ఖాతా యాక్సెస్‌ని ఇతరులకు అందించడం లేదా మీ ఖాతాను వేరొకరికి బదిలీ చేయడం(అనుమతి లేకుండా) వంటివి చేయకూడదు.
- మీ వయస్సు 13 ఏళ్లలోపు ఉండటం.
- మీరు లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిగా గుర్తించబడ్డారు.
- మీ ఖాతా మా నిబంధనలు లేదా విధానాలను ఉల్లంఘించినందున, మేము ముందుగానే దానిని నిలిపివేసాము.
- వర్తించే చట్టాలకు లోబడి మీరు మా ఉత్పత్తులు, సేవలు లేదా సాఫ్ట్వేర్లను పొందకుండా నిషేధించబడ్డారు.
2. Facebookలో ఏవేవి పంచుకోవచ్చు మరియు చేయవచ్చు
వ్యక్తులు Facebook వేదికగా తమ మనస్సులోని భావాలను వ్యక్తపరచాలని మరియు వారికి సంబంధించి ముఖ్యమైన కంటెంట్‌ను పంచుకోవాలని కోరుకుంటున్నాము, అయితే ఈ క్రమంలో ఇతరుల భద్రత మరియు శ్రేయస్సుకు లేదా మా సంఘం నైతిక సిద్ధాంతాలకు విఘాతం వాటిల్లకూడదు. కాబట్టి మీరు క్రింద వివరించిన విధంగా ప్రవర్తించడం (లేదా ఇతరులకు అలా చేసే అవకాశం కల్పించడం లేదా చేయమని ప్రోత్సహించడం) వంటివి చేయమని అంగీకరిస్తున్నారు. - దిగువ పేర్కొన్న విధమైన అంశాలను చేయడానికి లేదా పంచుకోవడానికి మీరు మా ఉత్పత్తులను ఉపయోగించకూడదు:
- ఈ నిబంధనలు, మా సంఘం ప్రమాణాలు మరియు మీ Facebook వినియోగానికి వర్తించే ఇతర నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించే అంశాలు.
- ఇవి చట్టవిరుద్ధమైన, తప్పుదారి పట్టించే, వివక్షత లేదా మోసపూరితమైన అంశాలు.
- ఇవి వేరొకరి మేధోసంపత్తి హక్కులతో సహా వారి హక్కులను ఉల్లంఘించేవి లేదా అతిక్రమించేవిగా ఉంటాయి.
- మీరు వైరస్‌లను లేదా హానికరమైన కోడ్‌ని అప్లోడ్ చేయకూడదు లేదా మా ఉత్పత్తులను నిలిపివేసేలా, వాటిపై అధికభారం పడేలా లేదంటే పనితీరు లేదా కనిపించే తీరును పాడు చేసేలా ఎలాంటి పనులు చేయకూడదు.
- మీరు (ముందుగా మా అనుమతి పొందకుండా) మా ఉత్పత్తుల నుండి స్వయంచాలక మార్గాల ద్వారా డేటాను సేకరించడం లేదా యాక్సెస్ చేయడం లేదా మీకు యాక్సెస్ అనుమతి లేని డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించడం వంటివి చేయకూడదు.
3. మీరు మాకు అందించే అనుమతులు
మా సేవలను అందించే క్రమంలో మీరు మాకు నిర్దిష్ట అనుమతులను ఇవ్వవలసి ఉంటుంది: - మీరు సృష్టించి భాగస్వామ్యం చేసే కంటెంట్‌ను వినియోగించేందుకు అనుమతి: ఫోటోలు లేదా వీడియోలు వంటి మీరు పంచుకున్న లేదా అప్లోడ్ చేసిన కొంత కంటెంట్, మేధోసంపత్తి చట్టాల ద్వారా రక్షింపబడతాయి.మీరు ఉపయోగిస్తున్న Facebook మరియు ఇతర Facebook కంపెనీ ఉత్పత్తులలో సృష్టించి భాగస్వామ్యం చేసే ఏదైనా అటువంటి కంటెంట్‌లోని (కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్‌లు వంటి) మేధోసంపత్తి హక్కులకు మీరే యజమానిగా ఉంటారు. ఈ నిబంధనలలోని ఏదీ మీ స్వంత కంటెంట్‌కు మీరు కలిగి ఉన్న హక్కులను తీసివేయదు. మీకు నచ్చిన కంటెంట్‌ను ఎవరితోనైనా పంచుకునే స్వేచ్ఛని మీరు కలిగి ఉన్నారు.అయితే, మీకు మా సేవలను అందజేసేందుకుగానూ, మీరు మాకు ఈ కంటెంట్‌ను ఉపయోగించేందుకు ('లైసెన్స్'గా పిలువబడే) కొన్ని చట్టపరమైన అనుమతులను అందజేయవలసి ఉంటుంది. ఎగువన 1వ విభాగంలో వివరించబడిన విధంగా ఇది పూర్తిగా మా ఉత్పత్తులు మరియు సేవలను అందజేయడం మరియు మెరుగుపరచడం వంటి ప్రయోజనాల కోసం మాత్రమే.ముఖ్యంగా, మీరు మా ఉత్పత్తులకు సంబంధించిన లేదా మేధోసంపత్తి హక్కులచే రక్షించబడిన కంటెంట్‌ను (మీ గోప్యత మరియు అప్లికేషన్ సెట్టింగ్‌లకు అనుగుణంగా ఉన్నది) పంచుకున్నప్పుడు, పోస్ట్ చేసినప్పుడు లేదా అప్లోడ్ చేసినప్పుడు మీ కంటెంట్‌ను హోస్ట్ చేయడం, వినియోగించడం, పంపిణీ చేయడం, సవరించడం, అమలు చేయడం, కాపీ చేయడం, పబ్లిక్‌గా నిర్వహించడం లేదా ప్రదర్శించడం, అనువదించడం మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే పనులను సృష్టించడానికి మీరు మాకు సాధారణమైన, బదిలీ చేయదగిన, ఉప లైసెన్స్ ఇవ్వదగిన, రాయల్టీ రహిత మరియు ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు మీరు Facebookలో ఫోటోను భాగస్వామ్యం చేస్తే, మీరు దీన్ని నిల్వ చేయడానికి, కాపీ చేయడానికి మరియు మా సేవకు లేదా మీరు ఉపయోగించే ఇతర Facebook ఉత్పత్తులకు మద్దతిచ్చే సేవా ప్రదాతల వంటి ఇతరులతో (ఇక్కడ కూడా మీ సెట్టింగ్‌లకు కట్టుబడి ఉంటూ) పంచుకోవడానికి మాకు అనుమతి ఇస్తున్నారని అర్థం. మీ కంటెంట్ మా సిస్టమ్‌ల నుండి తొలగించబడినప్పుడు, ఈ లైసెన్స్ ముగుస్తుంది.మీరు కంటెంట్‌ను వేర్వేరుగా కానీ లేదా మీ ఖాతాను తొలగించడం ద్వారా మొత్తం ఒక్కసారిగా కానీ తొలగించవచ్చు. మీ ఖాతాను తొలగించడానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీ ఖాతాను తొలగించే ముందుగా ఎప్పుడైనా మీరు మీ డేటాకి సంబంధించిన కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీరు కంటెంట్‌ని తొలగించినప్పుడు అది ఇకపై ఇతర వినియోగదారులకు కనిపించదు, అయితే క్రింది సందర్భాలలో మా సిస్టమ్‌లలో మరెక్కడైనా అలాగే ఉండిపోయే అవకాశం ఉంది:
- సాంకేతికపరమైన పరిమితుల కారణంగా సత్వర తొలగింపు సాధ్యం కాదు (ఈ సందర్భంలో, మీరు మీ కంటెంట్‌ని తొలగించినప్పటి నుండి గరిష్టంగా 90 రోజులలోపు అది శాశ్వతంగా తొలగించబడుతుంది);
- ఈ లైసెన్స్‌కి అనుగుణంగా మీ కంటెంట్ ఇతరులచే ఉపయోగించబడడంతోపాటు వారు దానిని తొలగించలేదు (ఈ సందర్భంలో ఆ కంటెంట్ తొలగించబడేంత వరకు ఈ లైసెన్స్ వర్తించడం కొనసాగుతుంది); లేదా
- ఈ క్రింది సందర్భాలలో సత్వర తొలగింపు మా సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది:
- అక్రమ కార్యకలాపం లేదా మా షరతులు మరియు విధానాల ఉల్లంఘనలను పరిశీలించినా లేదా గుర్తించినా (ఉదాహరణకు, మా ఉత్పత్తులు లేదా సిస్టమ్‌ల దుర్వినియోగం గుర్తించేందుకు లేదా పరిశీలించేందుకు);
- సాక్ష్యాల భద్రత వంటి చట్టబద్ధమైన నిర్బంధానికి కట్టుబడి ఉండడం; లేదా
- న్యాయ సంబంధిత లేదా పరిపాలనా సంబంధిత అధికార యంత్రాంగం, చట్ట పరిరక్షణ అధికారులు లేదా ప్రభుత్వ ఏజెన్సీల అభ్యర్థనకు కట్టుబడి ఉండేందుకు;
ఈ సందర్భంలో, కంటెంట్ నిల్వ ఉంచబడిన ప్రయోజనాలకు సంబంధించిన కాల వ్యవధి తర్వాత సంబంధిత కంటెంట్ నిల్వ ఉంచబడదు (ఖచ్చితమైన కాల వ్యవధి ఒక్కో కేసు వారీగా వేర్వేరుగా ఉంటుంది). పై అన్ని సందర్భాలలోనూ, కంటెంట్ పూర్తిగా తొలగించబడేంత వరకు ఈ లైసెన్స్ కొనసాగించబడుతుంది. - మీ పేరు, ప్రొఫైల్ చిత్రం, అలాగే ప్రకటనలు మరియు ప్రాయోజిత కంటెంట్‌తో మీ చర్యల గురించిన సమాచారాన్ని ఉపయోగించడానికి అనుమతి: మేము మీ పేరు మరియు ప్రొఫైల్ చిత్రాన్ని, అలాగే మేము మా ఉత్పత్తుల్లో ప్రదర్శించే ప్రకటనలు, ఆఫర్లు మరియు ఇతర ప్రాయోజిత కంటెంట్ పక్కనే లేదా దానికి సంబంధించి Facebookలో మీరు తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని మీకు ఎటువంటి పరిహారం లేకుండా వినియోగించడానికి మాకు అనుమతి ఇచ్చారు. ఉదాహరణకు, ప్రకటనలో చూపిన ఈవెంట్ పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లు లేదా Facebookలో దాని ప్రకటనలను ప్రదర్శించడానికి మేము చెల్లింపును స్వీకరించిన బ్రాండ్ సృష్టించిన పేజీని ఇష్టంగా గుర్తు పెట్టినట్లు మేము మీ స్నేహితులకు చూపవచ్చు. ఇటువంటి ప్రకటనలు మీరు Facebookలో తీసుకున్న చర్యలను చూడటానికి మీ అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే కనిపిస్తాయి. మీరు మీ ప్రకటన సెట్టింగ్‌లు మరియు ప్రాధాన్యతల గురించి మరింత తెలుసుకోండి.
- మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను నవీకరించడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి అనుమతి: మీరు మా సాఫ్ట్‌వేర్‌ని డౌన్లోడ్ చేసినా లేదా ఉపయోగించినా, అందుబాటులో ఉన్నప్పుడు దానికి సంబంధించిన అప్డేట్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేందుకు మీరు మాకు అనుమతిస్తున్నారు.
4. మేధోపరమైన ఆస్తి వినియోగంపై పరిమితులు
మా ఉత్పత్తులలో ఉన్నటువంటి మేధోపరమైన ఆస్తి హక్కులు వర్తించే కంటెంట్‌ను (ఉదాహరణకు, మీరు Facebookలో సృష్టించే లేదా పంచుకునే కంటెంట్‌కు జోడించేందుకు మేము అందించే చిత్రాలు, డిజైన్లు, వీడియోలు లేదా ధ్వనులు) మీరు ఉపయోగిస్తే, మేము ఆ కంటెంట్‌కు (మీది కాదు) అన్ని హక్కులను అలాగే కలిగి ఉంటాము. మా బ్రాండ్ వినియోగ మార్గదర్శకాల ప్రకారం స్పష్టమైన అనుమతి ఉన్నప్పుడు లేదా మా నుండి ముందస్తుగా వ్రాతపూర్వక అనుమతిని పొందినప్పుడు మాత్రమే మా కాపీరైట్లు లేదా వ్యాపారచిహ్నాల (లేదా ఏవైనా సారూప్య చిహ్నాల)ను ఉపయోగించవచ్చు. మీరు సవరించడానికి, అనుబంధ రచనలు చేయడానికి, డీకంపైల్ చేయడానికి లేదా మా నుండి సోర్స్ కోడ్‌ను సంగ్రహించేందుకు ప్రయత్నించడానికి తప్పనిసరిగా మా నుండి రాతపూర్వక అనుమతి (ఓపెన్ సోర్స్ లైసెన్స్ క్రింద అందించే అనుమతి) పొంది ఉండాలి. 4. అదనపు నియమాలు
1. మా నిబంధనలను నవీకరించడం
మీకు మరియు మా సంఘానికి మా ఉత్పత్తులను మెరుగైనవిగా చేయడం కోసం మా సేవలను మెరుగుపరచడానికి మరియు కొత్త ఫీచర్లను అభివృద్ధిపరచడానికి మేము నిరంతరంగా పని చేస్తున్నాము. ఫలితంగా, మా సేవలు మరియు సాధనాలను ఖచ్చితంగా అందించడానికి మేము ఈ నిబంధనలను కాలానుగుణంగా నవీకరించవలసి ఉంటుంది. చట్ట ప్రకారం అవసరమైతే మాత్రమే, మేము ఈ నిబంధనలకు మార్పులు చేసే ముందు మీకు తెలియజేస్తాము మరియు అవి ప్రభావంలోకి వచ్చే ముందు వాటిని సమీక్షించే అవకాశాన్ని అందిస్తాము. నవీకరించబడిన ఏవైనా నిబంధనలు ప్రభావంలోకి వస్తే, మీరు మా ఉత్పత్తులను ఉపయోగించడానికి కొనసాగించాలనుకుంటే వాటికి కట్టుబడి ఉండాలి. మీరు మా ఉత్పత్తులను వినియోగించడం కొనసాగించాలని భావిస్తున్నాము, అయితే మీరు నవీకరించబడిన మా నిబంధనలకు అంగీకరించకుంటే మరియు ఇప్పుడు Facebook సంఘంలో భాగంగా ఉండకూడదనుకుంటే, మీరు ఎప్పుడైనా మీ ఖాతాను తొలగించవచ్చు. 2. ఖాతా తాత్కాలిక నిలిపివేత లేదా రద్దు
ప్రజలు తమ భావాలను వ్యక్తపరచగల, అలాగే ఆలోచనలు మరియు సూచనలను పంచుకోగల స్నేహపూర్వకమైన మరియు సురక్షితమైన వేదికగా మేము Facebookని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. మీరు మా నిబంధనలు లేదా విధానాలతో పాటు మా సంఘం ప్రమాణాలను పూర్తిగా, ఉద్దేశ్యపూర్వకంగా లేదా పదే పదే ఉల్లంఘిస్తున్నారని మేము భావించినట్లయితే, మీ ఖాతాకి యాక్సెస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు. మీరు ఇతర వ్యక్తుల మేధోసంపత్తి హక్కులను పదే పదే ఉల్లంఘిస్తున్నా లేదా మరేదైనా చట్టపరమైన కారణాల చేత మేము దానిని తొలగించవలసి వచ్చినా, మేము మీ ఖాతాను తాత్కాలికంగా ఆపివేయవచ్చు లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. మేము అటువంటి చర్య తీసుకున్న పక్షంలో మీకు తెలియజేస్తాము, అలాగే సమీక్షను అభ్యర్థించడానికి మీకు ఏవైనా ఎంపికలు ఉంటే, వాటి గురించి వివరిస్తాము, అలా వివరించడం వలన మేము లేదా ఇతరులు చట్టపరమైన బాధ్యతను స్వీకరించాల్సి రావడం; మా వినియోగదారుల సంఘానికి హాని జరగడం; మా సేవలు, వ్యవస్థలు లేదా ఉత్పత్తులలో వేటి యొక్క న్యాయవర్తన లేదా నిర్వహణలో అయినా రాజీపడటం లేదా జోక్యం చేసుకోవడం వంటివి జరిగే సందర్భాలలో; లేదా సాంకేతిక పరిమితుల కారణంగా మేము నియంత్రించబడినప్పుడు; లేదా చట్టపరమైన కారణాల రీత్యా మేము అలా చేయడం నిషిద్ధమైనప్పుడు మేము వివరించము. మీ ఖాతా నిలిపివేయబడితే మీరు ఏమి చేయవచ్చు, అలాగే ఒకవేళ మేము మీ ఖాతాను పొరపాటున నిలిపివేసామని మీరు భావిస్తే మమ్మల్ని ఎలా సంప్రదించాలనే దాని గురించి మరింత తెలుసుకోండి. మీరు మీ ఖాతాని తొలగించినా లేదా మేము దానిని నిలిపివేసినా, ఈ నిబంధనలు వర్తించకుండా పోతాయి, అలాగే మీకు మరియు మాకు మధ్య ఉన్న ఒప్పందం రద్దు అవుతుంది, కానీ క్రింది నియమాలు అమలులో ఉంటాయి: 3, 4.2-4.5. 3. బాధ్యతపై పరిమితులు
మాకు సాధ్యమైనంత ఉత్తమ ఉత్పత్తులను అందించడంతో పాటు వాటిని వినియోగించే ప్రతి ఒక్కరికీ స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ మా ఉత్పత్తులు, "యథాతథంగా" అందించబడతాయి మరియు ఆ ఉత్పత్తులు ఎప్పటికీ భద్రంగా, సురక్షితంగా లేదా దోష రహితంగా ఉంటాయని లేదా ఎటువంటి అంతరాయాలు, కాలయాపనలు లేదా లోపాలు లేకుండా పని చేస్తాయని మము ఎటువంటి హామీలు ఇవ్వలేము. చట్టప్రకారం అనుమతించిన పరిధి మేరకు, మేము విక్రయ యోగ్యత, నిర్దిష్ట ప్రయోజనం కోసం యుక్తత, హక్కు మరియు ఉల్లంఘేతర వారెంటీల వంటి అన్ని సూచిత వారెంటీలతో సహా అన్ని స్పష్టమైన లేదా సూచిత వారెంటీలను కూడా నిరాకరిస్తాము. వ్యక్తులు మరియు ఇతరులు చేసే చర్యలను లేదా చెప్పే వాటిని మేము నియంత్రించము లేదా వారిని అలా చేయమని సూచించము, అలాగే వారి చర్యలకు లేదా ప్రవర్తనకు (ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్) లేదా వారు భాగస్వామ్యం చేసే ఏదైనా కంటెంట్‌కు (అసహ్యకరమైన, అనుచితమైన, అశ్లీలమైన, చట్టవిరుద్ధమైన మరియు ఇతర అభ్యంతరకరమైన కంటెంట్‌తో సహా) మేము ఎటువంటి బాధ్యత వహించము. మా ఉత్పత్తులలో సమస్యలు ఎప్పుడు ఏర్పడతాయో మేము ఊహించలేము. అదే విధంగా, వర్తించే చట్టాలు అనుమతించే పూర్తి పరిధి మేరకు మా బాధ్యత పరిమితం చేయబడుతుంది మరియు ఈ షరతులు లేదా Facebook ఉత్పత్తులు కారణంగా ఇటువంటి నష్టాలు జరగవచ్చునని మేము సూచించి ఉన్నప్పటికీ, మీరు పోగొట్టుకొనే లాభాలు, ఆదాయాలు, సమాచారం లేదా డేటా లేదా పరిణామపూర్వక, ప్రత్యేక, పరోక్ష, ఉత్తమ, దండనాత్మక లేదా అనుబంధిత నష్టాలకు మేము ఎట్టి పరిస్థితులలోనూ బాధ్యత వహించము. ఈ నిబంధనలు లేదా Facebook ఉత్పత్తులపై లేదా వాటికి సంబంధించి మా పూర్తి బాధ్యత $100కు లేదా గత పన్నెండు నెలల్లో మీరు మాకు చెల్లించిన మొత్తానికంటే ఎక్కువ కాకూడదు. 4. వివాదాలు
మీకు మాకు మధ్య తలెత్తే వివాదాలను తగ్గించడానికి లేదా పూర్తిగా నివారించడానికి మేము స్పష్టమైన నియమాలను అందించడానికి ప్రయత్నిస్తాము. అయినప్పటికీ ఏదైనా వివాదం తలెత్తితే, దాన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలి మరియు దానికి వర్తించే నియమాల గురించి ముందుగా తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది. ఈ నిబంధనలు లేదా Facebook ఉత్పత్తులపై ("దావా") లేదా వాటికి సంబంధించిన ఏదైనా దావా, చర్య తీసుకోవడానికి గల కారణం లేదా మాతో మీకు ఉన్న వివాదానికి సంబంధించి, వాటిని ప్రత్యేకంగా కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతానికి యు.ఎస్ జిల్లా న్యాయస్థానం లేదా శాన్ మాటియో కౌంటీలో ఉన్న రాష్ట్ర న్యాయస్థానంలో పరిష్కరించుకునేందుకు అంగీకరిస్తున్నారు. అలాగే మీరు అలాంటి ఏదైనా దావాపై చట్టపరమైన విచారణల కోసం వీటిలోని ఒక న్యాయస్థానంలో వ్యక్తిగత అధికార పరిధికి సమర్పించడానికి మరియు చట్టపరమైన నియమాల వైరుధ్యంతో సంబంధం లేకుండా ఈ నిబంధనలను మరియు ఏదైనా దావాను కాలిఫోర్నియా రాష్ట్రం చట్టాలు నిర్వహిస్తాయని అంగీకరిస్తున్నారు. 5. ఇతరం
- ఈ నిబంధనలు (ఇంతకు ముందు హక్కులు మరియు బాధ్యతల ప్రకటనగా పిలవబడేది) మీరు మా ఉత్పత్తులను వినియోగించే తీరుకు సంబంధించి మీకు మరియు Facebook, Inc.కి మధ్య సంపూర్ణ ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి. ఇంతకు ముందు మరేవైనా ఒప్పందాలు ఉన్నట్లయితే, వాటి స్థానంలో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
- మేము అందించే కొన్ని ఉత్పత్తులు అనుబంధ నిబంధనల ద్వారా కూడా నిర్వహించబడతాయి. మీరు ఆ ఉత్పత్తులలో వేటినైనా ఉపయోగిస్తే, అనుబంధ నిబంధనలు అందుబాటులోకి వస్తాయి మరియు మీతో మేం చేసుకునే ఒప్పందంలో భాగమవుతాయి. ఉదాహరణకు, ప్రకటనలను కొనుగోలు చేయడం, ఉత్పత్తులను విక్రయించడం, యాప్‌లను రూపొందించడం, మీ వ్యాపారం కోసం ఒక గ్రూపు లేదా పేజీని నిర్వహించడం లేదా మా లెక్కింపు సేవలను వినియోగించడం వంటి వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం మా ఉత్పత్తులను మీరు యాక్సెస్ చేసినా లేదా వినియోగించినా, తప్పనిసరిగా మా వాణిజ్య నిబంధనలు అంగీకరించాలి. మీరు సంగీతం ఉన్న కంటెంట్‌ని పోస్ట్ చేసినా లేదా పంచుకున్నా, తప్పనిసరిగా సంగీత మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. అనుబంధ నిబంధనలు మరియు ఈ నిబంధనల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి అనుబంధ నిబంధనలు వర్తిస్తాయి.
- ఈ నిబంధనలలో ఏవైనా కొన్ని అమలు కాదగినవిగా కనుగొనబడితే, మిగిలినవి పూర్తి స్థాయిలో అమలవుతాయి. మేము ఈ నిబంధనలలో వేటినైనా అమలు చేయడంలో విఫలమైతే, అవి రద్దు చేయబడినట్లుగా పరిగణించబడవు. ఈ నిబంధనలకు ఏవైనా సవరణలు చేయాలనుకున్నా లేదా విడిచిపెట్టాలని అనుకున్నా తప్పనిసరిగా మేము రాతపూర్వకంగా సంతకం చేసి ఆమోదించాలి.
- మీరు ఈ నిబంధనల క్రింద మీ హక్కులు లేదా బాధ్యతలు వేటినీ మా సమ్మతి లేకుండా వేరొకరికి బదిలీ చేయకూడదు.
- మీ ఖాతా స్మారకంగా మార్చబడితే, దానిని నిర్వహించడానికి మీరు ఒక వ్యక్తిని (ఉత్తరాధికార వ్యక్తి అని పిలువబడతారు) నియమించవచ్చు. కేవలం మీరు ఉత్తరాధికారిగా నియమించినవారు లేదా మీ మరణానంతరం లేదా అశక్తులైనప్పుడు మీ కంటెంట్ గురించి వెల్లడించడానికి ప్రామాణిక వీలునామా లేదా సారూప్య పత్రంలో స్పష్టమైన సమ్మతి ఇవ్వబడినట్లుగా గుర్తించిన వ్యక్తి మీ ఖాతా స్మారకంగా గుర్తించిన తర్వాత మీ ఖాతా నుండి సమాచార వెల్లడి కోరవచ్చు.
- ఈ నిబంధనలు ఎటువంటి మూడవ-పక్ష లబ్ధిదారుల హక్కులను అందించవు. ఈ నిబంధనల క్రింద మా హక్కులు మరియు బాధ్యతలన్నీ ఆస్తుల విలీనం, ఆర్జన లేదా విక్రయాలకు సంబంధించి లేదా చట్టప్రకారంగా లేదా వేరొక విధంగా నిర్వహణ ద్వారా మాచే సులభంగా కేటాయించబడతాయి.
- మేము నిర్ధిష్ట సందర్భాలలో (ఉదాహరణకు, ఎవరైనా ఒక వినియోగదారు పేరుని క్లెయిమ్ చేసుకున్నాక అది దైనందిన జీవితంలో ఉపయోగించే పేరుకి సంబంధితంగా లేనప్పుడు) మీ ఖాతా వినియోగదారు పేరును మార్చాల్సి రావచ్చని మీరు గమనించాలి.
- మేము మీ అభిప్రాయానికి, అలాగే మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీరు ఇచ్చే ఇతరత్రా సూచనలకు ఎల్లప్పుడూ విలువిస్తాము. కానీ మేము వాటిని మీకు ఏ విధమైన చెల్లింపులు చేయకుండా ఉపయోగించవచ్చని మరియు వాటిని రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత ఏదీ మాపై ఉండదని మీరు గమనించగలరు.
- మీకు నిర్దిష్టంగా మంజూరు చేసినవి మినహా మిగతా అన్ని హక్కులు మా స్వంతం.
5. మీకు వర్తించే అవకాశం ఉన్న ఇతర నిబంధనలు మరియు విధానాలు
- సంఘం ప్రమాణాలు: ఈ మార్గదర్శకాలు మీరు Facebookలో పోస్ట్ చేసే కంటెంట్, అలాగే Facebook మరియు ఇతర Facebook ఉత్పత్తులలో మీ కార్యాచరణకు సంబంధించిన మా ప్రమాణాలను వివరిస్తాయి.
- వాణిజ్య నిబంధనలు: మీరు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం, మా ప్లాట్‌ఫారమ్‌లో యాప్‌ను అమలు చేయడం, మా అంచనా సేవలను ఉపయోగించడం, వ్యాపారం కోసం సమూహాన్ని లేదా పేజీని నిర్వహించడం లేదంటే వస్తువులు లేదా సేవలను విక్రయించడంతో సహా ఏదైనా వాణిజ్యపరమైన లేదా వ్యాపారపరమైన ప్రయోజనం కోసం మీరు మా ఉత్పత్తులను యాక్సెస్ చేసినా లేదా వినియోగించినా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- ప్రకటన విధానాలు: Facebook ఉత్పత్తులలో ప్రకటనలు ఇచ్చే భాగస్వాములు ఏ రకాల ప్రకటన కంటెంట్‌ను అనుమతిస్తారనే దాన్ని ఈ విధానాలు పేర్కొంటాయి.
- స్వీయ-సేవ ప్రకటన నిబంధనలు: మీరు ఏదైనా ప్రకటన లేదా ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కార్యాచరణ లేదా కంటెంట్‌ను సృష్టించడానికి, సమర్పించడానికి లేదా అందించడానికి స్వీయ-సేవ ప్రకటన ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించినప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- పేజీలు, సమూహాలు మరియు ఈవెంట్ల విధానం: మీరు Facebook పేజీ, సమూహం లేదా ఈవెంట్‌ను సృష్టించినా లేదా నిర్వహించినా లేదంటే ప్రచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి లేదా నిర్వహించడానికి Facebookని ఉపయోగించినా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- Facebook ప్లాట్‌ఫారమ్ విధానం: మీరు మా ప్లాట్‌ఫారమ్‌ను (ఉదాహరణకు, ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ డెవలపర్లు లేదా ఆపరేటర్ల కోసం లేదంటే మీరు సోషల్ ప్లగిన్లను ఉపయోగిస్తే) వినియోగించే తీరుకి వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.
- డెవలపర్ చెల్లింపుల నిబంధనలు: Facebook చెల్లింపులను ఉపయోగించే అప్లికేషన్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- సంఘం చెల్లింపుల నిబంధనలు: Facebookలో లేదంటే Facebook ద్వారా జరిగే చెల్లింపులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- వాణిజ్య విధానాలు: మీరు Facebookలో విక్రయించడం కోసం ఉత్పత్తులు మరియు సేవలను ఉంచినప్పుడు వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.
- Facebook బ్రాండ్ వనరులు: ఈ మార్గదర్శకాలు Facebook వ్యాపారచిహ్నాలు, లోగోలు మరియు స్క్రీన్షాట్ల వినియోగానికి వర్తించే విధానాలను వివరిస్తాయి.
- సంగీత మార్గదర్శకాలు: మీరు Facebookలో సంగీతాన్ని కలిగి ఉన్న కంటెంట్‌ను పోస్ట్ చేసినప్పుడు లేదా పంచుకున్నప్పుడు వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.
చివరి సవరణ తేదీ: జూలై 31, 2019