ఏమనుకుంటున్నావు నాగురించి? వెండిరంగు దేవుడు పసుపుపచ్చ ఫాదర్‌ను అడిగేడు ఆక్రోశంతో, అలిసిపోయి, రాజీ పడిపోయిన గొంతుతో. నేను మిమ్మల్ని ఇలా కావాలనే, నాకు ఇష్టమయే పుట్టించాననుకుంటున్నావా? నేను మీ అందరూ బాధ పడుతుంటే చూసి ఆనందిస్తున్నానని అనుకుంటున్నావా? మీరు ఏడుస్తుంటే చూసి నవ్వుకొనే శాడిస్టులాగా కనిపిస్తున్నానా నీకు? ఇలా పుట్టించడమే నేను చేయగలిగింది. నాకు చేతనయింది. అంతే.

వీళ్లకు మనలాంటి శ్రుతిమించిన పోటీతత్వం లేదు. నింపాదిగా తమ పని తాము చేసుకొంటూ పోతారు. రేయింబవళ్లు పనిచేసి అందరికన్నా ముందు ఉండాలి అన్న తాపత్రయం లేదు. ఒక పట్టాన సహనం కోల్పోరు, ఆవేశపడరు. మనం కోల్పోయి ఆవేశపడినా స్పందించనే స్పందించరు. తరిమో, ఆశపెట్టో, భయపెట్టో వీళ్లతో పనిచేయించలేం.

జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు. నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసిన వాళ్లకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది.

మా నాన్నకి కామ్రేడ్ గావ్‌ని చాచి లెంపకాయ కొట్టాలనిపించిందిట. మా అమ్మ చనిపోతే అతనికెందుకానందమో మా నాన్నకర్థం కాలేదు. నిజానికి, కామ్రేడ్ గావ్ ఆనందమల్లా, తను ఇంకా వెతకాల్సిన పని తప్పినందుకు మాత్రమే. కామ్రేడ్ గావ్ మా నాన్నతో తరువాత అన్నాడట. “షాంగ్‌హాయ్‌లో ఎంతమంది షూ గూయింగ్‌లున్నారో, మీకు తెలుసునా? 288 మంది! వాళ్ళలో ఒక మగవాడు కూడా ఉన్నాడు.

ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌన మేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.

కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

తమని బాణాలతో కొట్టిన ఆ రాముడే కొద్ది రోజుల ముందు, తమ తల్లి తాటకిని కడతేర్చాడు. ఆ కుర్రాడు పినతల్లి కైక దగ్గిరే విలువిద్య అంతా నేర్చుకున్నాడనీ ఆవిడ ఈ కుర్రాణ్ణి స్వంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటోదంనీ తెలిసొచ్చింది. సవితి అంటేనే తన పిల్లలు కాని వారిని రాచిరంపాన పెడుతుందని కదా లోకంలో అనుకునేది? ఇదో వింత అయితే, తన తల్లి తాటకిని చంపినందుకు విశ్వామిత్రుడు తన దగ్గిరున్న అస్త్రవిద్యంతా ఈ రాముడికి ఉచితంగా ధారపోశాడు.

నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!

ఉరికంబంలాగానో, ధ్వజస్థంభంలాగానో నిటారుగా నిలబడి మనం అన్నిటినీ ప్రశ్నించగలం. అసలు ప్రశ్నే ఎదురవని సమాజం చివరికి అంతరంగం కూడా సులువుగా పట్టుబడవని రచయిత నందిగం కృష్ణారావు ఈ నవలతో మనముందుకు వచ్చారు. ఆ పై, ఇరుపక్కల తోడై నీకో నిజాయితీ, నిన్ను దాటిన ప్రయోజనం, వీటిలో మనిషితనం వుండాలనీ కూడా గుర్తు చేయించే పనిపెట్టారు ఈ నవలతో.

రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

నిజానికి ప్రతి మనిషి మనసూ ఒక యుద్ధ రంగమే. ప్రత్యర్థులూ, పరిష్కారాలూ, కొండొకచో ఒప్పంద మార్గాలూ మారుతూ ఉంటాయంతే. నేరుగా వస్తున్న కథల్లోనైనా, అనువాదాల్లోనైనా, అరిగిపోయిన వస్తువుగా కనపడుతోన్న స్త్రీ పురుష సంబంధాలను దాటి, విభిన్నమైన వస్తువులతో ముడిపడ్డ కథల ఎంపిక పాఠకులకు తెరిపినిస్తుంది.

క్రితం సంచికలోని గడినుడి-37కి మొదటి ఏడు రోజుల్లోనే ఏడుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, భమిడిపాటి సూర్యలక్ష్మి, బండారు పద్మ, జి.బి.టి సుందరి, అగడి ప్రతిభ, రవిచంద్ర ఇనగంటి, ఆళ్ళ రామారావు, అన్నపూర్ణాదేవి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-37 సమాధానాలు, వివరణ.