మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 70,823 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
రత్నం బాల్ పెన్ వర్క్స్
రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమండ్రిలో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నంపెన్ ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నంపెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది. స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నగరంలో 'కలం' పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ నాంది పలికింది. ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం గారి హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్ గా విడివడింది. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారంలో విరాజిల్లుతున్నాయి. దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు.
(ఇంకా…)
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి


చరిత్రలో ఈ రోజు
జూన్ 20:




ఈ వారపు బొమ్మ
గుంటూరు జిల్లా, గురజాల దగ్గరలో కృష్ణానది ఒడ్డున దైద అమరలింగేశ్వరస్వామి బిలానికి మార్గం. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు.

గుంటూరు జిల్లా, గురజాల దగ్గరలో కృష్ణానది ఒడ్డున దైద అమరలింగేశ్వరస్వామి బిలానికి మార్గం. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు.

ఫోటో సౌజన్యం: Pavuluri satishbabu 123
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు గానీ, వికీమీడియా భారతదేశ విభాగానికి (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) గానీ సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.