మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 70,489 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
బోయకొట్టములు పండ్రెండు

బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన "పండరంగని అద్దంకి శాసనము" ను ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్టపరిచేందుకు ఒక ఆధారం. "పండరంగడు అనే చాళుక్య సేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనంచేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంతభూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను." అన్నది పండరంగని అద్దంకి శాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం. పన్నెండు బోయకొట్టాలను పండరంగడనే సైన్యవీరుడు ఓడించాడని ఇది తెలుపుతోంది. దీన్ని ఆధారం చేసుకుని రచయిత రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పునఃసృజించి చారిత్రక నవలారచన చేశాడు. నవల తెలుగు సాహిత్యరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. సాహిత్యవేత్తలైన "రాళ్ళబండి కవితా ప్రసాద్", "అంపశయ్య నవీన్" వంటి వారు ప్రశంసించారు.

(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

Ambati Chantibabu-cartoonist-2.jpg
  • ... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులలో అంబటి చంటిబాబు ప్రముఖ కార్టూనిష్టు, రచయిత అనీ!(చిత్రంలో)
  • ... 1975 లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విపక్షాలు కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశాయనీ!
  • ... చార్లీ చాప్లిన్ తీసిన మూకీ చిత్రం మోడరన్ టైమ్స్ ను సంభాషణలతోనే తీయాలని డైలాగులు రాసుకున్నా చివర్లో మనసు మార్చుకుని మూకీగా తీశాడనీ!
  • ... ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజు పట్నాయక్ మొదట్లో సైన్యంలో పనిచేశాడనీ, జమ్ము-కాశ్మీర్ మీద 1947లో దాడి జరిగినప్పుడు శ్రీనగర్లో అడుగుపెట్టిన తొలి సైనికుడు అతనేననీ!
  • ... భారత ఆహార సంస్థ మొట్ట మొదటి ప్రధాన కార్యాలయం చెన్నై అనీ!


చరిత్రలో ఈ రోజు
మార్చి 18:
  • భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.
  • 1858 : రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త జననం (మరణం:1913).
  • 1871 : భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం (జననం:1806).
  • 1922 : మహత్మా గాంధీ కి, శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు, 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడింది.
  • 1837 : అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం (మ.1908).
  • 1938 : ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.
  • 1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.


ఈ వారపు బొమ్మ
థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము)

థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము)

ఫోటో సౌజన్యం: Supanut Arunoprayote
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=2482917" నుండి వెలికితీశారు