డెవలపర్ల కోసం YouTube
ఏ స్క్రీన్‌లో అయినా, ఏ సమయంలో అయినా YouTubeని పొందండి.
మీ వినియోగదారులకు YouTubeను అందించాలనుకుంటున్నారా? మీ వెబ్సైట్, అనువర్తనం లేదా పరికరంలోకి YouTube వీడియో కంటెంట్ మరియు కార్యాచరణను సమాకలనం చేయడానికి YouTube APIలు మరియు సాధనాలు మిమ్మల్ని అనువతిస్తాయి.
స్థూలదృష్టి
YouTubeతో సమాకలనం చేయండి
YouTube కార్యాచరణను మీ స్వంత అనువర్తనం లేదా వెబ్సైట్లో చొప్పించడానికి డేటా APIలు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు శోధనలను అమలు చేయవచ్చు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు, ప్లేజాబితాలను సృష్టించవచ్చు మరియు మరిన్నింటిని చేయవచ్చు.
YouTube ప్లేయర్‌ని అనుకూలీకరించండి
ప్లేయర్ APIలు మీ వెబ్సైట్ లేదా మీ మొబైల్ అనువర్తనంలో YouTube వీడియో ప్లేబ్యాక్‌పై మీకు నియంత్రణను అందిస్తాయి. ప్రాథమిక సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి, ప్లేయర్ ఇంటర్ఫేస్ను చొప్పించండి లేదా మీ స్వంత ప్లేయర్ నియంత్రణలను కూడా రూపొందించండి.
మీ వినియోగదారుల నుండి వీడియో సమర్పణలను సేకరించండి మరియు నియంత్రించండి
మీ సైట్ సందర్శకుల నుండి వినియోగదారు రూపొందించిన కంటెంట్‌ను సేకరించడాన్ని, సమర్పణలను నియంత్రించడాన్ని మరియు వాటిని మీ సైట్లో ప్రదర్శించడాన్ని సులభంగా చేయడానికి YouTube Direct లైట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
మరింత తెలుసుకోండి
వీడియోలను మీ అనువర్తనంలో పొందుపరచండి
iframe embed, ప్లేయర్ పరామితులు లేదా iframe మరియు Android ప్లేయర్ APIలను ఉపయోగించి మీ వెబ్ లేదా మొబైల్ అనువర్తనంలో YouTube వీడియోలను ప్రదర్శించడాన్ని మరియు ప్లేయర్‌ను అనుకూలీకరించడాన్ని సులభంగా చేయండి.
వీడియో విశ్లేషణలను పొందండి
Analytics APIని ఉపయోగించి మీ YouTube వీడియోలు మరియు ఛానెల్‌లకు సంబంధించిన వీక్షణ గణాంకాలు, జనాదరణ గణాంకాలు మరియు జనాభా సమాచారాన్ని పొందండి.
మీ అనువర్తనం లేదా సైట్ నుండి వీడియోలను అప్లోడ్ చేయండి
వీడియోలను నేరుగా అప్లోడ్ చేయడానికి YouTube డేటా APIలను ఉపయోగించండి. దీన్ని మీకు సులభం చేయడానికి మేము అనేక ప్రోగ్రామింగ్ భాషల్లో క్లయింట్ లైబ్రరీలను కలిగి ఉన్నాము.
సభ్యత్వ బటన్
మీ సందర్శకులు YouTubeలో కంటెంట్‌ని భాగస్వామ్యం చేయడంలో మరియు మీతో కనెక్ట్ కావడంలో సహాయం చేయడానికి మీ వెబ్‌సైట్‌కు YouTube సభ్యత్వ బటన్ని జోడించండి.