ఇది మతధర్మము, కుల ధర్మము, జాతి ధర్మము కాని కాదు. మఱి మానవధర్మం. వివిధ భేదాలతో అడ్డగోడలతో ఉద్రేకాలు పెరిగి అనాహుతాలపాలై పోతూవుండే మన దేశంలో త్యాగయ్యగారి యీ గానకళను పరస్పరస్నేహ సౌహార్దాలకు సాధనంగా ఉపయోగించి మనం ధన్యులం కావలసి ఉన్నాము.

మన తెలుగువారికి త్యాగరాజు తెలుగుదనముతోనేగాని ఆయన కీర్తనా సంగీతంతో నిమిత్తం లేదు. త్యాగరాజు తన కీర్తనలను సంగీతంలో మూర్తీభవించినాడుగాని తెలుగులో మూర్తీభవించలేదు. దక్షిణాదివారు పాపం తెలుగు ఏమీ రాకపోయినా, కీర్తనల సంగీతం కోసం వాటిని వల్లించుకున్నారు. వారితో సంగీతవిద్యలో పోటీ చెయ్యలేక, త్యాగరాజు కీర్తనాసాహిత్యాన్ని అరవలు పాడుచేస్తున్నారూ, మేముద్ధరిస్తున్నామని మనము బోరవిరచి ఉపన్యాసాలిస్తున్నాము. కీర్తనలో సంగీతమే ప్రధానము గనుక సాహిత్యానికి జరిగే ఈ ‘అపచారాన్ని’ గురించి నేటి కాలపు ఆంధ్రాభిమానులు తప్ప త్యాగరాజుగాని, ఆయన శిష్యులుగాని బాధపడియుండినట్టు లేదు.

ఆ మేడమీది రెస్టరెంటు పాతపట్నపు సంపూర్ణ దృశ్యాన్ని కళ్ళకు కట్టింది. పట్నంలోని ఎన్నో భవనాలూ లాండ్‌మార్కులూ ఆ దీపాల వెలుగుల్లో చక్కగా కనిపించాయి. సెంట్రల్ ప్లాజా, మెట్రోపాలిటన్ కథెడ్రల్, కొండమీద నెలకొన్న వర్జిన్ మేరీ విగ్రహం, ఊళ్ళోని బసీలికా స్పైరు – అన్నీ ఎంతో చక్కగా కనిపించాయి.

హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి.

మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యతలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం.

గ్రహణాలు అతి ప్రాచీనమైనవి, మనిషి భూమిమీద అంతరించిపోయిన తర్వాత కూడా కొనసాగేవీ. ఖగోళశాస్త్రంలో గణనీయమైన చరిత్ర ఉన్న మనం ఆ క్షేత్రంలో జరుగుతున్న పరిశోధనలను జాగ్రత్తగా గమనిస్తూ, మానవజాతి పురోగతిలో మనవంతు పాత్ర పోషించడానికి తగిన కృషిచెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు.

కవితలు కురవడం ఆగిపోయిన తీగ మీద సుతిమెత్తని కిరణం వాలితే ఇలాంటి సవ్వడే అవుతుందేమో! భుజం మీదినుంచి కోయిల ఎగిరిపోయినా ఇదే చుక్క జారుతుందేమో! లోపలి చూపులనుంచి వొలికే నిశ్వాసల వొరవడీ వొరిపిడీ ఇంతేనేమో. దిండ్లుగా మారిన బండల స్పృహ ఛెళ్లుమనడం ఇలాగే తెలుస్తుందేమో! ఇవన్నీ మీరు వినాలనే అనుకుంటాను కాని, కత్తులే మొద్దుబారాయో, గుండే గడ్డకట్టిందో కాని…

“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.

ఇంతకీ దుఃఖానికి
దేవత ఎవరు?
దాహార్తి నివారణకోసం
బలి కోరే,
రుధిర పాత్రల నాహ్వానించే
దేవీదేవతల వలె
కన్నీళ్లు కుండలతో
స్వీకరించే అప్రాచ్య దేవత ఎవరు?

మన యిండియన్లదంతా మెమొరీ పైన నిలబడిన హిస్టరీనే అమృతా! దేన్నీ రికార్డు చేసేది మనవాళ్ళకు తెలియదు. మావూర్లో సంక్రాంతి పండగనాడు ప్రతి యింటోళ్ళూ బ్రాహ్మణుడ్ని పిలిచి పెద్దలకు తర్పణమొదల్తారు. అప్పుడా బ్రాహ్మణుడు వాళ్ళను కనీసం వాళ్ళ మూడు తరాలవాళ్ళ పేర్లయినా చెప్పమని మొత్తుకుంటాడు. వాళ్ళకు వాళ్ళ తాత పేరయినా సక్రమంగా జ్ఞాపకముండదు. అందరిండ్లల్లో జమిందార్లు, వీరులు, శూరులూ వుంటారా చెప్పు గుర్తు పెట్టుకునేదానికి?

ఇంక నువ్వు తెల్లవార్లూ
సణుగుతావు చూడూ…
తను నిద్రకు మెలకువకు
నేటికి రేపటికి మధ్య

కాలం శూలానికి
దృశ్యరహిత రక్తమోడుతుంది

ఈ లోగా నేనూ అనేక అవతారాలెత్తి
పని భూగోళాన్నంతా అట్లాసై మోసేసి
పై వాడిని మెప్పించో వప్పించో
కావలిసినంత అలసటనో ఆవేగాన్నో నింపుకుని
మనిషితనానికి తావీయకుండా
ఈసురోమని ఇల్లు చేరతాను.

కాళికాంబ ఎక్కడికి వెళ్లినా పోలీసులు వెంటాడుతుండేవారు. ఇల్లు సోదా చేసేవారు. ఇంట్లో సామాన్లు, వండిన వంటలు, ఊరగాయలు అన్ని పాడుచేసి, చేతికి వచ్చినవి పట్టుకుపోతూ ఉండేవారు. నోటికి వచ్చినట్లు ఛండాలపు మాటలనేవారు. ఆడవాళ్ళని నానా భీభత్సంగా భయపెట్టడం, మానభంగాలు చేయడం, కొట్టడం చేసేవారని ఆమె పేర్కొన్నారు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

నెచ్చెలి 5వ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం! ఎంపిక చేసిన కథలు, కవితలు ‘నెచ్చెలి’లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి. రచనలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ మే 10, 2024.