వాస్తవంలో యివి రెండు కావు కూడా. పారలౌకికంలో లౌకికం యిమిడి ఉంటుంది, గుర్తించగలిగినవాడికి. ఈ రెండు ప్రేమలను సూఫీలు ఇష్కే హకీకీ, ఇష్కే మిజాజీ అంటారు. తమిళ వేదాంతులు చిరిన్బమ్ పెరిన్బమ్ అంటారు. వీరందరికీ ముందు ఉపనిషత్తే చెప్పింది, దివ్యానందం స్త్రీపరిష్వంగంలా ఉంటుందని:
డిసెంబర్ 2023
తెలుగు సాహిత్యాభిమానులందరూ ఎదురు చూసే పుస్తకాల పండుగ మళ్ళీ వస్తోంది. డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగునాట – ముఖ్యంగా హైద్రాబాదు, విజయవాడలలో – జరిగే అతి పెద్ద పండుగల్లో పుస్తక మహోత్సవం కూడా ఒకటి. ఎన్నో ప్రాంతాల, ఎందరో రచయితల కథలను, కవితలనూ మూటగట్టుకుంటూ, మళ్ళీ ఈ నెలాఖరుకి కొత్త కాగితాల రెపరెపలతో సందడి మొదలు కాబోతోంది. పుస్తకాలు కొనడమూ, చదవడమూ కాదు, ఊరికే చూడటం కూడా ఉత్సవమయి, ఉత్సాహాన్నిచ్చే సంబరంగా ఏడాది చివర్లలో సాగడం, గత కొన్నేళ్ళుగా తెలుగునాట స్థిరపడిపోయిన ఆనవాయితీ. ఈ ఏడాది చదివిన పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు, వెతుక్కోవాల్సిన పుస్తకాలు… ఒక నెలలో పండుగ రానుందంటే ఈపాటికి ఎన్ని జాబితాలు ప్రకటితమవ్వాలి! పుస్తక ప్రేమికులే చొరవ తీసుకుని మొదలెట్టాల్సిన వేడుకలివి. పుస్తకాల పండుగ అంటే ప్రచురణకర్తలదీ రచయితలదీ మాత్రమే కాదు, పాఠకులది కూడా. ఈ బుక్ ఫెస్టివల్స్ జరిగినన్నాళ్ళూ అక్కడ సభలూ జరుగుతాయి. ప్రక్రియల వారీగా చర్చలు జరుగుతాయి. అక్కడైనా, బయట మాధ్యమాల్లో అయినా, పత్రికల్లో అయినా విమర్శ వ్యక్తిగతంగా వ్రాయకుండా రచనాపరిధికి లోబడి వ్రాసే నియంత్రణను రచయితలు; విమర్శను వ్యక్తిగతంగా తీసుకోకుండా సూచనగా గమనించగల విజ్ఞతను పాఠకులూ అలవరచుకుంటే, సాహిత్య సమాజంగా మనకు ఎంతో కొంత ఎదుగుదల ఉంటుంది. రచయితలు కూడా వ్రాయడం అన్న ప్రక్రియకు పదును పెట్టుకోడానికి మొదట పాఠకులవ్వాలి. సాటి రచయితల పుస్తకాలపై సద్విమర్శలు వ్రాయాలి. వాటిని చర్చించాలి. వాటి మీద ఆసక్తి పెంచాలి, వాటికి గుర్తింపు తేవాలి. పాఠకులు వెతుక్కుని వెళ్లి పుస్తకాలను కొనుక్కునే రీతిలో ఆకర్షణ కలుగజేయాలి. ఒక రచన మంచి చెడ్డలు, బలాబలాలు సాటి రచయితలే చప్పున గుర్తు పట్టగలరు కనుక, ఇదంతా రచయితలే ఒక కర్తవ్యంగా చేయవలసిన పని. వాళ్ళు క్రియాశీలమైతే, ఆ ఉత్సాహం పాఠకులలోకీ పాకుతుంది. అలా పుస్తకం నలుగురి నోళ్ళల్లో నానుతుంది. చదివిన పుస్తకాల గురించి నచ్చినా నచ్చకున్నా నిర్మొహమాటంగా అభిప్రాయాలను పంచుకోవడము, చదువరులు వీలైనంత వివరంగా తమ విమర్శలను, సమీక్షలను రాసి పత్రికలకు పంపించడమూ చేస్తే, అటు మరో నలుగురికి చదివే స్పూర్తిని అందించినవారు అవుతారు. ఇటు సాహిత్యమూ ఇంకాస్త చలనశీలమైనట్టు ఉంటుంది. ఆహ్లాదం, ఆలోచన, హక్కులు, బాధ్యతా, ఉత్తేజం, స్పూర్తి – పుస్తకాలు ఇవ్వలేనిది లేదు, పుస్తకాలు చెప్పనివీ ఏం లేవు. అయితే ఇప్పుడు మొదలయే ఈ పుస్తక మహోత్సవాల ద్వారా ఇవన్నీ అందిపుచ్చుకుని, వచ్చే పండుగ దాకా వీటిని నిలిపి ఉంచుకోవడమే ఇప్పటి మన కర్తవ్యం.
కాలక్రమేణా రామాయణాలు మారుతూ వచ్చాయి, కొత్తగా పుడుతూ వచ్చాయి, కొత్త కొత్త కథనాలు, దృక్కోణాలు వాటిలో ప్రక్షిప్తమయ్యాయి, అవుతూనే ఉంటాయి. రామాయణం ఏ కొందరి సొత్తో కాదు. సీతారాములు ఏ కొందరికో మాత్రమే దేవుళ్ళు కారు. మరెందరికో కేవలం దేవుళ్ళు మాత్రమే కారు. ఇది రామాయణానికి, వాల్మీకికీ అశేష భారతం చూపుతూనే ఉన్న గౌరవం. ఎప్పుడైతే ఇది మరిచిపోయి రాముడు ‘మా’వాడు, రామాయణం ‘మాది’, ‘మాకు నచ్చిందే, మేము చెప్పిందే రామాయణం’ అన్న దౌర్జన్యం ప్రబలుతుందో అప్పుడు సమాజంలో భిన్నవర్గాల మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. ఈ పోరులో మనగలిగితే, మానవజాతి సజీవంగా ఉన్నంతవరకూ రామాయణం కూడా సజీవంగా ఉంటుంది. లేదూ, ఒక నిర్జీవ కావ్యంగా మాత్రమే మిగిలిపోతుంది.
విమానం గాలిలోకి ఎగరగానే నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం.
ఋగ్వేదంలో మొట్టమొదటి అనువాకంలోని మొదటి సూక్తంలోని తొమ్మిది శ్లోకాలకు యథాతథంగా తెలుగులో తెచ్చే అనువాద ప్రయత్నం ఇది. ప్రాచీనాంధ్ర కవులు వేదాలకు అనువాదం చేయకపోయినా, ఆధునిక పద్యానువాదాలు ఒకటి రెండు ఇదివరకు వచ్చాయి. ఉదా. చర్ల గణపతి శాస్త్రిగారు, నేమాని నరసింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు నాకు పరిచయం. అయితే, వారి అనువాద ప్రయోజనం వేరు. నా అనువాద ప్రయత్నం వేరు.
మనం ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. నా జీవితకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురౌతాయని నేను ఊహించలేదు. ముఖ్యంగా భావప్రకటనా స్వాతంత్ర్యానికి చాలా గడ్డు పరీక్షలు ఎదురౌతున్న కాలం ఇది. ప్రపంచంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మనకు కనిపించే వైవిధ్యమైన పుస్తకప్రపంచమే ఉండేది కాదు.
ఈ కథకి ఒక రకంగా ప్రేరణ నేను చిన్నప్పుడెప్పుడో పత్రికలోనో, ప్రభలోనో చదివిన కథ. కథ పేరు గాని, రచయిత పేరు గాని గుర్తు లేవు. కానీ కథ మాత్రం బాగా గుర్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, అందులో ఒక పసివాడి తల్లి చనిపోతుంది. వాడు బయట ఆడుకుంటూంటాడు. లోనికి వచ్చి, ఆమెను కుదిపి కుదిపి మాటాడటానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఎవరో వచ్చి వాడికి ఇష్టమైన కుక్కపిల్లతో ఆడుకోమని దూరంగా తీసుకుపోతారు.
గజరాజుకి ఏభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, తన కొడుకులకి, తమ్ముళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయేయి. ఎవరికి ఇంకా సంతానం కలగలేదు. గజరాజు తల్లి కాలధర్మం చెందింది. ఒక చెల్లెలు భర్త చనిపోయి నిస్సంతుగా అన్నగారి దగ్గరకు వచ్చేసింది. పుట్టింటి వారిచ్చిన రెండెకరాలే కాకుండా అప్పుడప్పుడు కూడబెట్టుకున్న మిగులు సొమ్ముతో అన్నగారి ద్వారా కొనుక్కున్న ఇంకో రెండెకరాలు, భర్త ద్వారా జల్లూరులో ఐదు ఎకరాలు ఆమె ఆస్తి.
బాపు మాది అని దుడుకుగా ఉంటుంది. ఏమి కష్టపడకుండా, కనీసం చిన్నపాటి పుణ్యమో, పిసరెత్తు తపస్సో ఒనరించకుండానే బాపుని మావాడిగా పొందామే అని బిఱ్ఱుగా ఉంటుంది. అయితే అయితే ఈ బిఱ్ఱు వెనుక కనపడనిది తడిగుండెగా ఉంటుంది, చెమ్మ కన్నుగా ఉంటుంది, భక్తిగా, రెండు చేతుల కైమోడ్పుగా ఉంటుంది.
రామభక్తులకు నిజానికిన్ని రామాయణాలు వున్నవనే సంగతికాని, వాల్మీకికి ముందు అనేకమైన రామకథల్ని అనేక చోట్ల, అసంఖ్యాక రీతుల్లో గానం చేసేవారని, వాల్మీకి రామకథలను ఏకత్రం చేసిన ఆదికవిగానే కాక, ఆది ఎడిటర్‌గా కూడా పాత్రఃస్మరణీయుడని, మారుతున్న సమాజానికి అవసరమైన రీతిలో రామాయణం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వచ్చిందనీ తెలియదు. భక్తికి విశ్వాసంతోనే గాని, జ్ఞానంతో పనిలేదు. జ్ఞానయోగం కంటె భక్తియోగం గొప్పది.
ఏమో తెలియదు కాని, దాని శబ్దాలు వినే కొద్ది కొన్ని రోజులకు అర్థమైంది, అది చేస్తున్నవి శబ్దాలు కావు, అది పాడుతుందని. ఆ పాట ఎంత తీవ్రతతో ఉంటుందంటే దాన్ని వింటున్నప్పుడు ఒక్కోసారి దుఃఖం వచ్చి ఏడ్చేవాడిని. ఇంకొన్నిసార్లు ఆనందం లోపలనుంచి పొంగుకొచ్చేది. అప్పుడప్పుడు అది ఏదో శాంతి మాత్రం జపిస్తున్నట్లు అనిపించేది. దాని పాట వింటూ ప్రపంచాన్ని మనుషుల్ని మరిచిపోయేవాడిని.
వసుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో శుక్తిమతీనది, కోలాహలపర్వతాల సంబంధాన్ని, సంగమాన్ని ప్రకృతిపరంగాను, వ్యక్తిపరం గాను శ్లేషమూలకంగా అత్యద్భుతంగా వర్ణించడంలో రామరాజభూషణుఁడు చూపిన వైదుష్యం, కౌశల్యం, కవిత్వపాటవం సాహిత్యవిమర్శకులు తరచుగా విశ్లేషించునవే. శుక్తిమతీ కోలాహలుల పుత్త్రికయైన గిరికయొక్క చెలికత్తె మంజువాణి గిరికాదేవి జన్మప్రకారాన్ని నర్మసచివునికి వివరించే సందర్భంలో ఈవర్ణన చేయబడింది.
ఆవిడ నమ్మడం లేదు గానీ, ఈ హత్యకు… అదే హత్యాయత్నానికి కారణం ఆలీబాబానే. కన్ఫ్యూజ్ చేయడానికి అని ఆమె అంది గానీ అసలు సైతాన్ అని పెడితే, ఏ కన్ఫ్యూజన్ వుండేది కాదు. హత్యలు, ఊచకోతల నుంచే నాయకుడిగా ఎదిగినవాడతడు. అంటే స్వయంగా చేస్తాడని కాదు, చేయిస్తాడు. అందుకు అధికార బలాన్ని అర్థవంతంగా వినియోగిస్తాడు. అందరం ఒక్కటిగా వున్న మమ్మల్ని విడదీసి, వేర్వేరని చాటింది అతడే.
బయట నుంచి గుర్రం జూలు విదిలించిన శబ్దమూ గంటల శబ్దమూ వినిపించాయి. అంటే బగ్గీ సిద్ధమైందన్నమాట. కొట్టు తాలూకు తాళాల గుత్తి చేతిలోకి తీసుకుంటాడు నాన్న. గడియారం ముల్లు ఎనిమిదిన్నర వైపు కదులుతూ ఉంటుంది. క్వీచ్ క్వీచ్ మంటూ నాన్న తన కిర్రు చెప్పులు వేసుకుంటాడు. తర్వాత గొడుగు సరిగా పని చేస్తుందా లేదా చూడ్డానికి దాన్ని ఒకసారి తెరిచి మూసిన శబ్దం వినిపిస్తుంది. ఇదంతా రోజువారీ రివాజు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది.
నేనొక్కడినే కూర్చున్నాను అక్కడ, పిగిలి –
ఎదురుగా, ఎవరో
తరుముతున్నట్లుగా, పరిగెత్తి పోయే
నీడ లేని మనుషుల్లో, నువ్వూ కలిసిపోయి
క్షణకాలం ఆగి, నను
వెనుదిరిగి చూసి, వాళ్లలో కనుమరుగై!
ఓ వర్షాకాలపు మధ్యాహ్నం అలిసిపోయిన భూమి వదులుతున్న వెచ్చని ఊపిరి చర్మాన్ని తాకుతున్నట్టుగా, ఎండలో పచ్చిక చెమ్మ నిండిన పిల్లగాలి వీస్తోంది. ప్రకృతికీ ప్రపంచానికీ దాని బాధేదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఓ పక్షి విసుగు పుట్టించేలా మధ్యాహ్నమంతా ఆపకుండా కూసింది. పోస్టుమాస్టరుకు చెయ్యడానికి పనేమీ లేదు. తనకు చూడడానికి ఉన్నదల్లా వానకు తడిసి నిగనిగలాడుతున్న ఆకులూ, మిగిలిపోయిన తెల్లని పలుచని మేఘాలూ మాత్రమే.
కలలపల్లకిపై ఊరేగుతూ
మరొక మెరుపువాక్యం
రంగుల రేకులు విప్పుకుని
అందంగా పూస్తుంది
వేరొక గుండె దోసిలిపట్టి
అపురూపంగా కళ్ళకద్దుకుంటుంది
చర్మంపై మునుపటి నునుపు లేదు,
పోనీ కాంతీ లేదు.
బుగ్గల్లో కరుకుదనం.
నవ్వులో ఒకలాంటి అంతశ్శోకం
పళ్ళ సందుల్లో శూన్యం.
అయినా తెల్లటి నిర్మలత్వంలో ఒక దాపరికం.
కొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. అది కూడా రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది.
తెరిచీ మూసే గుప్పిళ్లతో
ఆ గుప్పెడు పదాల విరాట్ రూపాన్నీ
మాటల మధ్య లుప్తమైన ఖాళీలనూ
ఖాళీల మధ్య గుప్తమైన భావాలనూ
గుండెతో చూసిన ఇంద్రియాలన్నీ
వెలుతురు కొమ్మలై మొలిచాయి
ఈ కవిత చివరిలో బాలుడికి ఉండే జిజ్ఞాస, చైతన్యం మనిషిలో నిరంతరం లేకపోతే ఈ ఆటని ఆడలేడని ఒకే ఒక పార్శ్వాన్ని మనకి తెలియజేసినట్లు మనకి అనిపిస్తుంది. కాని, తరచి చూస్తే, కవిత ప్రారంభంలో చెప్పిన ‘చదివి పారేసిన పుస్తకం’ అయిన ఆకాశం ఆ జిజ్ఞాస ఉన్నవాడికే తన పుస్తక రహస్యాల్ని విప్పుతుందన్నది సంజ్ఞ.
క్రితం సంచికలోని గడినుడి-85కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై నాలుగు మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-85 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: