ఆమెను లేపబోయేంతలో ఏం జరిగిందో అతనికి ముందు అర్థంకాలేదు. బెడ్‌లాంప్ మసక వెలుతురులో నడుచుకుంటూ పోతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. గోడల మీద పొడుగ్గా నీడలు పాకుతూ పోతున్నాయి. కొన్ని పిల్లల నీడలు, కొన్ని వొంగిపోయిన ముసలి నీడలు, భుజాలకు వేలాడుతూ పసిపాపల నీడలు, నెలల నిండు గర్భిణుల నీడలూ. నెత్తిన ఏవో మూటలూ. నివ్వెరపోయి చూస్తూ కూచుండిపోయాడు.

తెల్లవారితే అతను చెప్పే మాటకోసం
ఆమె కొన్ని రాత్రులుగా మేలుకొనే ఉంటోంది.
మిట్టమధ్యాహ్నం అయ్యింది…
అతనెందుకో ఈ మధ్య ఇచ్చిన మాటలు మర్చిపోతున్నాడు.
ఆగలేక ఎదురెళ్ళింది
“చూడు, గందరగోళంలో ఉన్నాను” అని
కాయితపు ముక్కలు చూపించాడు.

నేను యూట్యూబులో ఒకే ఒక్కసారి మా పెద్దోడు నడవడానికి ముందు కాళ్లు హుషారుగా టపటపలాడించే వీడియో పోస్టు చేయడానికిగానూ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్‌వర్డ్ ఏదో ఉంటుంది. నాకే గుర్తులేదిప్పుడు. ట్విట్టర్ కూడా ఓపెన్ చేశాను. కానీ వాడట్లేదు. అయినా దానికి కూడా ఏదో ఉండేవుంటుంది. గూగుల్ ప్లస్ కూడా ఏదో ఉన్నట్టుందిగానీ దానిలో నేను ఉన్నట్టో లేనట్టో నాకే తెలీదు.

“ఆ వెళ్ళాంలెండి నైనితాలు! మరీ అర్ధరాత్రి మూడింటికే లేపి కార్లో కుదేస్తారు. ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు అది చూద్దాం ఇది చూద్దాం అంటూ హడావుడి పెడతారు. అయినా ఎక్కడ చూసినా అవే పరాఠాలు, అదే బటర్ చికెన్. ఏ లోకానికెళ్లినా మీకు మాత్రం మందు పడాల్సిందే. మీ మందు కార్యక్రమం అయ్యేదాకా మేమంతా డిన్నర్ కోసం చూస్తూ చొంగలు కార్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు చూళ్లేదూ?”

ఉన్నట్టుండి
గోడమీంచి వూగని వూయల పైకి
దాని మీంచీ వూగే చిటారు కొమ్మపైకి ఎగిరింది
పిడికెడంత బరువుకే
కిందాకా తూగిన కొమ్మచివరన
చిన్ని పిట్ట పైకీ కిందకీ సంతోషాన తేలింది

ఎవరైనా చూశారేమో బహుశా
వేగం పెరిగిన శ్వాసలనీ
వెనక సీట్లో వేడిమినీ నీరెండలో ముంగురులనీ
గోళ్ల చివర్ల నెత్తుటి ఎరుపునీ తిరిగిపోయే తారల మెరుపునీ
పల్చగా జారిన విశ్వాసాల కొనకంటి చూపులనీ

పూర్వం, ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చేది యోగక్షేమాలను తెలియజేస్తూ. వ్యక్తులు అవసరం మేరకు మాట్లాడేవారు. అంచేత ఏ వ్యక్తి అయినా అవతలివారికి ఎంత మేరకు అవసరమో అంతే తెలిసేవారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తి సోషల్‌ మీడియాలో ‘ఎవైలబుల్’గా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిరోజు అనేక విషయాల మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాటి మీద చర్చోపచర్చలు చేస్తున్నాడు.

నాకోసం ఎవరూ పుట్టినరోజులు జరపలేదు. కేక్ కోయలేదు. కేండిల్స్ వెలిగించి పాటలూ పాడలేదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. నా శరీరంలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ చాలాసేపు నిల్చుని ఉండిపోయాను, ఆ రోజు సాయంత్రం పిన్ని కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తు కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోకుండా.

మహమ్మదీయులీదేశమునకు వచ్చిన కొలదికాలములోనే మారిపోయిరి. ఈ దేశమునకు వచ్చిన ముసల్మానులు క్రౌర్యమును మతావేశమును వీడి సాత్వికులైరి. ఈ దేశములోని ఇస్లాము, విదేశములలోని ఇస్లాముకు భిన్నమైన మతముగా మార్పుజెందినది. అది భారతీయ సంస్కృతిని పొంది జాతీయ మతముగా మారినది. ఈ దేశపు మహమ్మదీయులు మనోవాక్కాయకర్మములగు భారతీయులుగనేయుండిరి.

వేద పండితుడు ప్లస్ సంస్కృత మాష్టారి కూతురిని పెళ్లిచేసుకొని తప్పు చేశానని వెయ్యిన్నొక్కోమారు విచారించాడు ప్రద్యుమ్నుడు. ఈ విషయంపై చర్చను పొడిగిస్తే ఆమె వేదాలు, పురాణాలు చెబుతుందేమోనని భయపడ్డాడు కూడా. మొన్నీమధ్యనే ఒకడు దైవదూషణ చేసి బ్రహ్మరాక్షసుడైన కథను చెప్పింది. పైగా వర్క్ ఈజ్ గాడ్ అనీ, పనియే ప్రత్యక్షదైవం అనీ తేల్చిచెప్పింది.

చిత్రంగా వినిపించినా, ఈ సంకలనం కవిత్వ పాఠకుల కన్నా కవులకే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తెలుగులో కవిత్వం రాస్తున్నవాళ్ళందరూ వాదాలకతీతంగా చదివి చూడాల్సిన పుస్తకమిది. ఈ కొత్త పోకడల కవిత్వ రీతులను అధ్యయనం చెయ్యాలి. మూసలు బద్దలు కొట్టిన తీరును గమనించాలి. వస్తువుతో కవి ఎంత నిజాయితీగా మమేకమైతే కొత్త అభివ్యక్తి వస్తుందో అర్థంచేసుకోవాలి.

ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.