Tweets

You blocked @naveenrjy

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @naveenrjy

  1. 4 hours ago

    2/2 దీన్ని గుర్తించకో / అంగీకరించలేకో స్ట్రగులౌతున్న కులాలు చీలిపోయాయి. ఈ చీలికల్లో ప్రధానశిబిరాలకు ఒక వైపు చంద్రబాబు “నాయుడు” మరోవైపు జగన్ “రెడ్డి”నాయకత్వం వహిస్తున్నారు. ధర్మయుద్ధాన్ని అతిక్రమించి వీరిపోరు సాగుతున్నది. నమ్మకం కుదిరించగల కాపునాయకత్వంవచ్చేవరకూ ఈ పోరు ఆగదు

    Show this thread
    Undo
  2. 4 hours ago

    1/2 ప్రజల చైతన్యం సామాజిక పునరేకీకరణలకు దారితీస్తుంది. ఈ పోలరైజేషన్ రాజకీయ అధికారం, ఆధిపత్యాలవైపే ప్రయాణిస్తుంది. ఈ వలయంలో బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మల ఆధిపత్యాలు పూర్తయ్యాయి. ఇప్పటి వంతు కాపులదే.

    Show this thread
    Undo
  3. 7 hours ago

    రంగుల రాగాలు... హృదయం రాత్రిలా గాఢమైనది ఆలోచనలు పగలులా స్పష్టమైనవి కాంక్షలు రెండింటికీ మధ్య సంధ్యలాంటివి లేవగానే తలుపుతీసి చూడండి... ఇవి రంగురంగుల్లో పరిమళాలాలై పలకరిస్తాయి. ఇవి...మనలో ఇంకిపోయాయనుకున్న అనుభూతులు, ఉద్వేగాలే!!

    Undo
  4. Retweeted

    తెలుగు ప్రపంచంలో 15వ అతిపెద్ద భాష తెలుగు ఈనాడు అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్టుకు తాళం చెవి తెలుగు కోట్లమంది అనుభవాలు, విజ్ఞానం, వినోదం చెప్పుకోగల ఒకే మార్గం తెలుగు వేల కోట్ల రూపాయల గని ఆఖరికి ఈ రాజకీయ నాయకులు ఐదేళ్లకు ఒకసారి ఓట్లు అడుక్కోవాలన్నా ఉన్న ఒకే ఒక మార్గం

    Show this thread
    Undo
  5. Retweeted

    ఇది 2019. రాసిపెట్టుకోండి. ఐదేళ్లలో తెలుగు, ఇతర భారతీయ భాషల్లో లోతైన పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు లభించే మార్కెట్ ఏర్పడకపోతే పోటీలు పడి తెలుగు భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకపోతే తెలుగు మీద చిన్న చూపు ఉన్న వారందరికీ కళ్ళు చెదరకపోతే నా పేరు మార్చుకుంటాను.

    Show this thread
    Undo
  6. Retweeted
    Nov 13

    No further Explanation needed....

    Undo
  7. Retweeted
    Nov 12

    లో జన్మించి, మూడో ఏటనుంచే పాటలుపాడుతూ 12ఏళ్లకే రైతుబిడ్డ సినిమాలో నటించి, "మా తెనుగు తల్లికి మల్లెపూదండ","దేశమును ప్రేమించుమన్నా" వంటి గొప్ప దేశభక్తిగీతాలు ఆలపించిన ప్రసిద్ధగాయని, మద్రాసు తొలి అందాలసుందరి (మిస్ మద్రాసు) శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారి జయంతి.

    Undo
  8. Nov 12

    తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో, తెలుగుభాషలో కూడా చెప్పగలగితే రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల భాషనుంచి మేధస్సు, ఆలోచనల స్ధాయికి తెలుగు విస్తరించాలి.

    Undo
  9. Nov 12

    భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు , ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి.

    Undo
  10. Nov 12

    భాష కదలికలు లేని జడపదార్ధం కాదు. వాడుక ఆగిన  కొన్ని మాటలను వొదిలించుకుంటూ, అలవాటౌతున్న పరభాషా పదాలను ఇముడ్చుకుంటూ సాగిపోయే చైతన్య పూరితం! ఈ తరం వాళ్ళకు అర్ధమయ్యేలా సూటిగా చెప్పాలంటే భాష స్టాటిక్ గా వుండి పోయేది కాదు...భాష డైనమిక్ గా సాగిపోయేదే.

    Undo
  11. Nov 12

    కవిత్వానికీ, కాల్పనిక సాహిత్యానికీ దోహదమౌతున్న తెలుగు భాషను శాస్త్రవిజ్ఞానాలను వివరించే భాషగా వికసింపచేయవలసిన అవసరాన్ని ఇప్పటికైనా పెద్దలు గుర్తించి కార్యాచరణకు దారులు చూపించాలి

    Undo
  12. Nov 12

    ఆలోచనలను వ్యక్తీకరించే ఒక ముఖ్యసాధనం భాష... ఏ సమాజపు ఆలోచనలకైనా భూమిక, నేపధ్యం, చట్రం వుంటాయి. మాతృభాషే వీటిని దారం లా గుదిగుచ్చి వుంచుతుంది...మన ఆలోచనలు తెలుగులోనే వుంటాయి. నా English Expressions Effective గా వుంచడానికి ఇక నుంచి నేను ఇంగ్లీషులో ఆలోచించే ప్రయత్నం చేస్తాను.

    Undo
  13. Nov 12

    వెంకయ్యనాయుడుగారి అమ్మాయి, రామోజీరావు గారి శ్రీమతి, చంద్రబాబుగారి ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు నడుపుతున్నారు...

    Undo
  14. Nov 11

    పిల్లలకు విద్యాబుద్ధులు, జ్ఞానం, సవ్యమైన దృష్టీ దృక్ఫధాలు ఇస్తే చాలు ఏ భాష అయితే మాత్రం ఏమిటట అన్నాడు నువ్వు చెప్పే మాటలు తెలిసినట్టున్నాయి కాని నోరుతిరగట్లేదు నాన అన్నాడు ఊరుకోరా! ఆయన చాదస్తాన్ని కదిలించకు మరి అంది

    Undo
  15. Nov 11

    కష్టం రాకుండా దేవుడే చూసుకోవాలన్న ఆశ కార్తీక దీపమై వెలుగుతుంది. పాపభీతితో, ధార్మికచింతనతో, నియమనిష్టతో గుడి కిక్కిరిసిపోతుంది (ఇది సోమవారం రాత్రి సన్నివేశం)

    Undo
  16. Nov 10

    కామ,క్రోథ,మోహ,లోభ,మద,మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అదుపులో ఉంచుకోవడమే సహనం సహనశీలత వల్ల బతుకు,బతకనివ్వు అనే విశాల దృక్పధం మనిషిలో ఏర్పడింది. ఇదే అన్నిమతాలు, కులాలు, ప్రాంతాలు కలసి వున్న భారతీయ జీవన విధానం. ఇందులో ఆధిక్యమన్న భావనను తీసుకురావద్దని పార్టీకి మనవి

    Undo
  17. Nov 10

    మందిరం మసీదు తీర్పు పై అభిప్రాయం ఏర్పరచుకోగల ఇన్ పుట్స్, డెప్త్ నాకు లేవు. కానీ, ఆలయప్రవేశమే దొరకని అంబేద్కర్ - రూపం ఇచ్చిన రాజ్యాంగ పరిధికి లోబడి తీర్పుకోసం రాముడే ఏళ్ళ తరబడి వేచివుండవలసిన పరిస్ధితి అద్భుతమైన మానవీయ విజయంగా కనబడుతున్నది

    Undo
  18. Nov 9

    న్యూస్ పేపర్ ఇవ్వు అంది నువ్వు అప్డేట్ అవ్వాలి...ఇందులో ఇపేపర్ చదువు అని iPad ఇచ్చాడు దాంతో బొద్దింకని చితక్కొట్టేసింది మోరల్ : భార్య ఏది అడిగితే అది మాత్రమే ఇవ్వాలి

    Undo
  19. Retweeted
    Nov 9

    మిత్రులందరికీ శుభోదయం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏

    , , and 6 others
    Undo
  20. Nov 9

    మొన్న ఇవాళ ఈనాడు పేపర్, వరుసగా మూడు రోజులనుంచి సాక్షి పేపర్ రావడం లేదు...ఏజెంట్లను అడగాలని అనిపించలేదు. నెట్ ఎడిషన్లలో వార్తలు “చూస్తూండటం” అలవాటైపోవడం వల్లో ఏమో పేపర్ “చదవాలని” గట్టిగా అనిపించడం లేదనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్ న్యూస్ పేపర్ కు దూరమౌపోతూండటం పరిణామాత్మక విషాదమే

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·