టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.
జూలై 2019
ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాల కెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసి వస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం, ఏ సంకలనాన్ని గమనించినా అది ఒక ఏడాదిలో వచ్చిన గొప్ప రచనల తాలూకు జ్ఞాపికగానో లేదంటే ఆ ఏడాది వినపడ్డ కొత్త గొంతుకలను మరికొందరికి పరిచయం చేసే ప్రయత్నంగానో కనపడకపోతుండడం, సాహిత్యేతర ప్రయోజనాలే ఈ సంకలనాలు క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తున్నాయన్న నిజం సాహిత్యావరణంతో అంతగా పరిచయం లేని మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఈ రాజకీయాలు పెచ్చుపెరిగిపోవడం, కలవరపెట్టే విషయాలు.
నాలుగు రచనలు మన ముందున్నప్పుడు వాటిలో ఏది అత్యుత్తమ రచనో బేరీజు వెయ్యడం, నాలుగింటినీ విలువ కట్టి వరుసలో ప్రకటించడం అసాధ్యమైతే కావచ్చు కానీ,ఇన్ని ప్రింట్ పత్రికలు,కొత్తగా పుట్టుకొస్తోన్న వెబ్ పత్రికలు, ఏడాది పొడుగునా ప్రచురిస్తోన్న ఇన్ని వందల రచనల్లో నుండి, ఒక కనీస స్థాయిలో నిలబడగల రచనలను ఎంపిక చేయలేకపోవడం ఎలాంటి దుర్గతి! ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో మాటవరసకు కూడా ప్రకటించని సంపాదకుల అలక్ష్యం. తమ రచనలు ఎట్లాంటి సంకలనాలలో ప్రచురింపడుతున్నాయో కనీస వివరం తెలియని స్థితిలో రచయితలున్నారు. ముందుగా రచయితలకు తెలియబరచడం, అనుమతి తీసుకోవడం అక్కర్లేని పనులయ్యాయి. ఆపాటి గౌరవాన్ని కూడా ఆశించకుండా, తమ రచనలను అచ్చులో చూసుకుంటే చాలన్న తృప్తితో బ్రతుకుతున్నారా తెలుగు రచయితలు? వెబ్పత్రికలలో రచనలు పరిశీలనకు అనర్హమైనవనీ, ప్రింట్ పత్రికలలో ప్రచురింపబడ్డ రచనలనే ఈ సంకలనాలకు పరిశీలిస్తామనీ బిగ్గరగా, బహిరంగంగా చెప్పుకుంటున్న సంపాదకవర్గాలది మరో వింత పోకడ. సాంకేతికతను కళకు విరోధిగా భావించే మూర్ఖత్వమిది. లేదా వెబ్పత్రికలలో వస్తోన్న సాహిత్యాన్ని గమనించలేని అలసత్వం. మాధ్యమాలను బట్టి, రచయిత పేరును బట్టీ కాక, అక్షరాలను బట్టి రచనలకు విలువ గట్టే ధోరణి మనకింకెప్పటికి అలవడుతుంది? లేని విలువలను ఈ సంకలనాలకు ఆపాదించడం ఆపి, మన చేతుల్లో నుండి చల్లగా జారుకుంటోన్న ఉత్తమ ప్రాచీన సాహిత్యమేదైనా ఉంటే దానిని పునఃప్రచురించుకుంటే, కనీసం కొత్త చెత్తను కాస్త తగ్గించుకున్నవారమవుతాం.
అకస్మాత్తుగా ఒకాయన తన కిష్టమైన ఓ బూజీ వూజీ ట్యూన్ చెప్పి అది పియానో పై వాయిస్తే వెయ్యి డాలర్లు కేష్ ఇస్తానన్నాడట. ఆలక్స్ స్టూడెంట్లని వద్దనలేదు. అతను అసలు ఏమైనా అనే లోపలే, ఒక కుర్రాడు ఉత్సాహంతో వాయించాడు. అక్కడి నుండీ అక్కడి అతిథులందరికీ ఒక్కొక్కరికీ కిర్రెక్కి, వారి జాజ్, పాప్ మ్యూజిక్ కోర్కెలు అడగటం, వెంటనే కేష్ ప్రైజ్ ఆఫర్స్, ఆ ట్యూన్స్ వచ్చిన వాళ్లు అవి వాయించటంలో, ఒక కొత్త ఉత్సాహం, ఒక కోలాహలం.
ఒక్కోసారి తాతగారి హుంకరింపు వినిపించినా పలికేవాణ్ణి కాదు. మా అమ్మ కూడా గట్టిగా అరిస్తే విసుక్కుంటూ వెళ్ళేవాణ్ణి. ఒకటి రెండుసార్లు చూసి, మా తాతగారు, “సీఈఈత! పి. బి. కామేశ్వర్రావని కొత్తగా ఈ. ఎన్. టీ వచ్చాడట. బాగా చూస్తాట్ట. వీణ్ణి తీసుకుని వెళ్ళకూడదూ” అన్నారు. ఆయన అంత గంభీరంగా జోకేస్తున్నారో నిజంగా చెప్తున్నారో తెలిసి చావలేదు నాకు. ఆ తరవాత ఎప్పుడూ వినపడగానే దగ్గరకెళ్ళేవాణ్ణి, ఈ వెటకారాలెవడు పడతాడనుకుంటూ.
పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, వినాశనం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం అడుగులు వేస్తున్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.
అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఒక వ్యక్తిత్వమూ, ఒక అభిరుచి, ఒక రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్లముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.
నిజానికి ఇది ఒక్క అమెరికా తెలుగువాళ్లకే చెందిన కథ కాదు. మూలాల నుంచి విడివడి బ్రతుకుతోన్న ప్రతి ఒక్కరి కథ ఇది. తరాల తరబడి తమ తమ మూలాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొత్త జీవితాల నిర్మాణాలకు ఆపూర్వ అస్తిత్వాలు అవరోధమవడమన్న విషయాన్ని గ్రహించడం, వాటిల్ని దాటుకోవడం ఇంకా ముఖ్యం అన్న విషయాన్ని సమర్థవంతంగా ప్రతిపాదించిన కథ ఇది.
మనసులో కోరికలు
కళ్ల చివర్ల నుంచి
నిరాశ వాసన కొడుతూ
జారి పడిపోతున్నా
పట్టుకోకుండా కూర్చున్నాడు
అతను నవ్వుతున్నాడు
‘ఒక రోజు’ అనే ఈ పంక్తి ఇప్పుడు మొదలవ్వాలి. అయితే చంద్రానికి ఇలా దేన్నీ సాదాసీదాగా చేస్తే నచ్చదు కాబట్టి–ఒక దివ్యమైన శుక్రవారం అని ప్రారంభం కానుంది ఈ పంక్తి. ఎంత విభిన్నంగా చెయ్యాలనుకున్నా ఈ పంక్తి ఒకరోజు అనే మొదలవ్వడాన్ని తప్పించడం వీలు కాలేదు చూడండి. వచ్చే పంక్తే దివ్యమైన శుక్రవారం… ప్చ్… సరే రండి తర్వాత పంక్తికి… వచ్చే పంక్తిలో కథ రాకెట్ వేగాన్ని పుంజుకోబోతుంది…
ఇంద్రజాలికుని
టోపీలోని
పావురాయిని
నేనేనోయ్
ఇత్తడి మాటల
లోకుల సరసన
పరుసవేదిని
నేనేనోయ్
తమ పిల్లల పసితనం లోని అమాయకత్వంలో కనపడకుండా దాక్కున్న కళ్ళు చెదిరే తెలివీ, సమయోచిత సంభాషణలకీ అబ్బురపడి ఆ అబ్బురాన్ని పదిమందికీ పంచి ఆనందించే చిట్టి తల్లులని గుండెకి హత్తుకోవాలనిపిస్తూ వుంటుంది. అందుచేత ఈ నెమలీకల్ని అలా తడిమే సాహసం చేస్తున్నాను.
క్రితం సంచికలోని గడినుడి-32కి మొదటి పది రోజుల్లోనే 11మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, ఆదిత్య, సుభద్ర వేదుల, వైదేహి అక్కిపెద్ది, అగడి ప్రతిభ, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, రవిచంద్ర ఇనగంటి, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఆళ్ళ రామారావు, బండారు పద్మ, జిబిటి సుందరి/గోటేటి మార్కండేయులు/హరిణి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-32 సమాధానాలు, వివరణ.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.