టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ల కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం.

మనకు వట్టిపుణ్యానికి తెలిసిన విషయాలు రెండు కలవు. సూర్యుడు తూర్పున ఎక్కి పడమట దిగుట. దీని గురించి మళ్ళీ ఎప్పుడయినా చెప్పుకుందాం. రెండు బాపూ గొప్పవాడు, బడా చిత్రకారుడు, ఎలా? అంటే ఆయన బొమ్మలు బాగా వేస్తారు, నవ్వించే కార్టూన్లు గీస్తారు. ఆ గీతల వెనుక పనిముట్ల మర్మం, ఈ చిన్న వ్యాసంలో వీలయినంత విప్పిచేప్పే ప్రయత్నం చేస్తా.

జీవితం ఒడ్డుకి చేరి అక్కడే నిలబడిపోయాడు. “కదులు కదులు!” మబ్బులు గర్జిస్తూ చెప్పాయి. “పద పద!” చినుకులు కురుస్తూ తట్టాయి. “రా రా!” పిట్టలు పాడుతూ పిలిచాయి. “మరిచిపో మరిచిపో!” ఆకులు రాలుతూ అన్నాయి. కదలని మరవని అతనికి అవసానదశలో ఒకటే ప్రశ్న. దాన్ని మోసుకుంటూ ఎక్కడెక్కడో వెతకగా చివరికి కలిసింది. ఆమె గుర్తు పట్టాక అడిగాడు “నేను పరీక్షలో నెగ్గానా?”

సాధారణంగా పొద్దున పొద్దున్నే టీవీ పెట్టను. కానీ ఒక్కోసారి పిల్లలు స్కూలుకు వెళ్లిపోయాక ఏర్పడే నిశ్శబ్దాన్ని శబ్దంతో భర్తీ చేయాలనిపిస్తుంది. సినిమా, ట్రావెల్, ఫుడ్ ఇవి నా ప్రయారిటీలు. శబ్దం మరీ ఎక్కువైందన్నట్టుగా పెట్టగానే ఏదో ఫైట్ వస్తోంది. మహేశ్‌బాబు సినిమా. తలల మీద ఇటుకలు పగులుతున్నాయి. గోడలకు వెళ్లి గుద్దుకుంటున్నారు.

ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడికి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి అవగాహన ఉందనిపించింది. లేకపోతే ఈ స్థాయిలో వ్యంగ్యవ్యాఖ్యలు ఎలా విసరగలడు? పొగడ్తల సంగతి తర్వాత. తనముందు ఉన్న అగడ్త దాటటం ఎలా? చూపును రహదారి మీదనే కేంద్రీకరించి కాసేపు ఆలోచించాడు.

నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్లి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది.

“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్లు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.

అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్లి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది. అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే.

గచ్చు మీద తన నీడనే చూస్తూ
గుమ్మం దగ్గర నిలిచున్న తలుపు

అడుగులతో నడిచొచ్చిన జ్ఞాపికలను దాచుకుని
మూసిన గాజు తలుపుల అరమరలతో
మూగ సాక్షిగా నిలిచిన గది

కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!

కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.

ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-

నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.

స్వీయచరిత్ర చదివించాలి, చదివించే జీవశక్తి దానికి ఉండాలి. డైరీని ఎత్తి ముద్రించిన చందంగా ఉంటే, పత్రికల్లో వచ్చే ప్రకటనలకుండే విలువే దానికి. అలా చదివించాలంటే, ఆ ‘స్వీయం’ మరుగునపడి ‘చరిత్ర’ బయటకు పొంగాలి, పెరుగును చిలికితే వెన్న చందంగా.

జేరిన కొత్తలో జగదీష్ సింగ్ కేసి చూసి, ఓ అస్సాం కుర్రాడు, మనీష్ అనే అతను సింగ్ ఎత్తు ఎంతో అడిగి పేంట్ కేసి చూపిస్తూ, ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ,’ అన్నాడని బాగా ప్రచారం అయింది ఆ రోజుల్లో. మనీష్ అలా అన్నందుకు సింగ్ నొచ్చుకున్నా తర్వాత స్పోర్టివ్‌గా తీసుకుని మర్చిపోయాడని చెప్పుకున్నారు.

సమాజములో స్త్రీ స్థానాన్ని గురించి ఇప్పుడు కూడ వాదాలు, వివాదాలు తగ్గకుండా ఉన్నాయి. కాని నియంతలైన రాజులు, సుల్తానులు పరిపాలించే కాలములో రాణీవాసాన్ని ఒక్క చిరునవ్వుతో తిరస్కరించి తన ఇష్టాయిష్టాలకు మాత్రమే విలువ నిచ్చిన యువతి ఒకామె జీవించి ఉన్నదనడము నిజముగా గర్వ కారణమే.

క్రితం సంచికలోని గడినుడి 21కి గడువు తేదీలోగా నలుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన నలుగురు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. జంధ్యాల ఉమాదేవి, 3. గిరిజ వారణాసి, 4. ప్రతిభ. వారికి మా అభినందనలు. గడి నుడి – 21 సమాధానాలు, వివరణ

సాహిత్యవిమర్శతత్త్వం వస్తుతత్త్వ వివేచన. విషయాన్ని కవి తన రచనా సంవిధానంతో ఆవిష్కరించినప్పుడు అది వస్తువుగా పరిణమిస్తుంది. విషయం వస్తువుగా మారడమన్న ప్రక్రియ వల్ల అది కళాత్మక రూపంతో సాహిత్యంగా పాఠకుడిని చేరుతుంది. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో ప్రచురణకు ఎంపికైన వ్యాసం.)

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.