మా డేటా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీరు మా కొత్త డేటా విధానాన్ని ఇక్కడ వీక్షించవచ్చు.

డేటా విధానం

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత మెరుగుపరచాలనే మా లక్ష్యంలో భాగంగా పంచుకునే సామర్థ్యాన్ని మేము మీకు అందిస్తాము. ఈ విధానం మేము సమాచారాన్ని సేకరించే, అలాగే దానిని ఉపయోగించే మరియు భాగస్వామ్యం చేసే పద్ధతిని వివరిస్తుంది. మీరు గోప్యతా ప్రాథమికాంశాలులో అదనపు సాధనాలు మరియు సమాచారాన్ని కనుగొనవచ్చు.

మీరు మా విధానాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఇది ప్రత్యేక గోప్యతా విధానం లేని లేదా ఈ విధానానికి లింక్ చేయబడిన అన్ని Facebook బ్రాండ్‌లు, ఉత్పత్తులు మరియు సేవలకు వర్తిస్తుందని గుర్తుంచుకోండి, మేము వీటిని “Facebook సేవలు” లేదా “సేవలు” అని అంటాము.

మేము ఎటువంటి రకాల సమాచారాన్ని సేకరిస్తాము?

మీరు వినియోగించే సేవలపై ఆధారపడి, మేము మీ నుండి లేదా మీ గురించి విభిన్న రకాల సమాచారాన్ని సేకరిస్తాము.
మీరు చేసే పనులు మరియు మీరు అందించే సమాచారం.
మీరు ఖాతాకు సైన్ అప్ చేయడం, సృష్టించడం లేదా భాగస్వామ్యం చేయడం మరియు ఇతరులకు సందేశం పంపడం లేదా కమ్యూనికేట్ చేయడం వంటి సందర్భాలతో సహా మా సేవలను ఉపయోగించినప్పుడు కంటెంట్ మరియు మీరు అందించే ఇతర సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఇందులో ఫోటో స్థానం లేదా ఫైల్‌ను సృష్టించిన తేదీ వంటి మీరు అందించే కంటెంట్‌లోని లేదా దాని గురించిన సమాచారం ఉండవచ్చు. మీరు వీక్షించే లేదా చర్చించే కంటెంట్ రకాలు లేదా మీ కార్యాచరణల తరచుదనం మరియు వ్యవధి వంటి వివరాలతో సహా మా సేవలను ఉపయోగించే విధానం గురించి కూడా మేము సమాచారాన్ని సేకరిస్తాము.
ఇతరులు చేసే పనులు మరియు వారు అందించే సమాచారం.
ఇతర వ్యక్తులు మా సేవలను ఉపయోగించేటప్పుడు వారు మీ ఫోటోను ఎప్పుడు భాగస్వామ్యం చేసారు, మీకు ఎప్పుడు సందేశం పంపారు లేదా మీ సంప్రదింపు సమాచారాన్ని ఎప్పుడు అప్‌లోడ్ చేసారు, సమకాలీకరించారు లేదా దిగుమతి చేసారనేటటువంటి మీ గురించిన సమాచారంతో సహా కంటెంట్ మరియు వారు అందించే సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము.
మీ నెట్‌వర్క్‌లు మరియు అనుసంధానాలు.
మీరు అత్యంత ఎక్కువగా కమ్యూనికేట్ చేసే వ్యక్తులు లేదా మీరు భాగస్వామ్యం చేయాలనుకునే సమూహాల వంటి వివరాలతో సహా మీరు అనుసంధానమైన వ్యక్తులు మరియు సమూహాల గురించి, అలాగే మీరు వారితో పరస్పర చర్య చేసే విధానం గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. మీరు పరికరం నుండి ఈ సమాచారాన్ని (చిరునామా పుస్తకం వంటిది) అప్‌లోడ్ చేస్తే, సమకాలీకరిస్తే లేదా దిగుమతి చేస్తే మీరు అందించే సంప్రదింపు సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము.
చెల్లింపుల గురించిన సమాచారం.
మీరు కొనుగోళ్లు లేదా ఆర్థిక లావాదేవీల (మీరు Facebookలో ఏదైనా కొనుగోలు చేయడం, గేమ్‌లో భాగంగా కొనుగోలు చేయడం లేదా విరాళం ఇవ్వడం వంటి సందర్భాలలో) కోసం మా సేవలను ఉపయోగిస్తే, ఆ కొనుగోలు లేదా లావాదేవీ గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. ఇందులో మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్ మరియు ఇతర కార్డ్ సమాచారం అలాగే ఇతర ఖాతా మరియు ప్రామాణీకరణ సమాచారం అంతేకాకుండా బిల్లింగ్, షిప్పింగ్ మరియు సంప్రదింపు వివరాల వంటి మీ చెల్లింపు సమాచారం ఉంటుంది.
పరికర సమాచారం.
మీరు మంజూరు చేసిన అనుమతుల ఆధారంగా మీరు మా సేవలను ఇన్‌స్టాల్ లేదా ప్రాప్యత చేసే కంప్యూటర్‌లు, ఫోన్‌లు లేదా ఇతర పరికరాల నుండి లేదా వాటి గురించి సమాచారాన్ని మేము సేకరిస్తాము. మీ వేర్వేరు పరికరాల నుండి మేము సేకరించే సమాచారాన్ని సమగ్రంగా చేయవచ్చు, అలా చేయడం వలన మీ పరికరాలలో స్థిరమైన సేవలను అందించడంలో మాకు సహాయకరంగా ఉంటుంది. మేము సేకరించే పరికర సమాచారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

  • ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్ సంస్కరణ, పరికర సెట్టింగ్‌లు, ఫైల్ మరియు సాఫ్ట్‌వేర్ పేర్లు మరియు రకాలు, బ్యాటరీ మరియు సిగ్నల్ సామర్థ్యం మరియు పరికర ఐడెంటిఫైయర్‌ల వంటి విశేషాంశాలు.
  • GPS, బ్లూటూత్ లేదా WiFi సిగ్నల్‌ల ద్వారా నిర్దిష్ట భౌగోళిక స్థానాలతో సహా పరికర స్థానాలు.
  • మీ మొబైల్ ఆపరేటర్ పేరు లేదా ISP, బ్రౌజర్ రకం, భాష మరియు సమయ మండలి, మొబైల్ ఫోన్ నంబర్ మరియు IP చిరునామా వంటి అనుసంధాన సంబంధిత సమాచారం.
మా సేవలను ఉపయోగించే వెబ్‌సైట్లు మరియు అనువర్తనాల నుండి అందించబడే సమాచారం.
మా సేవలను (మాకు చెందిన ఇష్టం బటన్ Facebook లాగిన్‌ను అందించినప్పుడు లేదా మా కొలమాన మరియు ప్రకటన సేవల వినియోగించినప్పుడు) ఉపయోగించే మూడవ పక్ష వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనా‌లను మీరు సందర్శించినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు మేము సమాచారాన్ని సేకరిస్తాము. ఇందులో మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనా‌లు, ఆ వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనా‌ల్లో మీరు మా సేవలను వినియోగించిన విధానం గురించి సమాచారం, అలాగే అనువర్తనం లేదా వెబ్‌సైట్ డెవలపర్ లేదా ప్రచురణకర్త మీకు లేదా మాకు అందించే సమాచారం ఉంటుంది.
మూడవ-పక్ష భాగస్వాముల నుండి అందించబడే సమాచారం.
మేము మూడవ పక్షం భాగస్వాముల నుండి మీ గురించి మరియు మీరు Facebookలో మరియు వెలుపల చేసే కార్యాచరణల గురించి మేము సేవలను ఉమ్మడిగా అందించినప్పుడు భాగస్వామి నుండి పొందే సమాచారం లేదా ప్రకటనదారు నుండి వారితో మీ అనుభవాలు లేదా పరస్పర చర్యల వంటి సమాచారాన్ని మేము స్వీకరిస్తాము.
Facebook కంపెనీలు.
Facebook కలిగి ఉన్న లేదా నిర్వహించే కంపెనీల నిబంధనలు మరియు విధానాలకు లోబడి వాటి నుండి మీ గురించిన సమాచారాన్ని మేము స్వీకరిస్తాము. ఈ కంపెనీలు మరియు వాటి గోప్యతా విధానాల గురించి మరింత తెలుసుకోండి.

మేము ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము?

మేము వ్యక్తుల కోసం అద్భుతమైన మరియు అభిరుచులకు అనుగుణంగా ఉండే అనుభవాలను అందించడంపై మక్కువతో ఉన్నాము. మా సేవలను అందించడంలో మరియు వాటికి మద్దతివ్వడంలో మాకు సహాయపడేందుకు మా వద్ద ఉన్న సమాచారం మొత్తాన్ని ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇక్కడ ఉంది:
సేవలను అందించడం, మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడం.
మీరు మా సేవలను ఎలా ఉపయోగిస్తున్నారు మరియు వాటితో ఎలా పరస్పర చర్య చేస్తున్నారు, మీరు అనుసంధానమైన వ్యక్తులు లేదా అంశాలు, అలాగే మా సేవల్లో లేదా వెలుపల చూపే ఆసక్తిని అర్థం చేసుకోవడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా మా సేవలను అందించగలము, కంటెంట్‌ను వ్యక్తిగతీకరించగలము మరియు మీ కోసం సూచనలను అందించగలము.

మీకు సత్వరమార్గాలు మరియు సూచనలను అందించడానికి కూడా మా వద్ద ఉన్న సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ ప్రొఫైల్ చిత్రాలు మరియు మిమ్మల్ని ట్యాగ్ చేసిన ఇతర ఫోటోల నుండి మేము సమగ్రంగా సేకరించిన సమాచారంతో మీ స్నేహితుల చిత్రాలను సరిపోల్చడం ద్వారా చిత్రంలో మీ స్నేహితుడు మిమ్మల్ని ట్యాగ్ చేసినట్లు సూచించగలము. మీరు ఈ లక్షణాన్ని ప్రారంభిస్తే, “టైమ్‌లైన్ మరియు ట్యాగింగ్” సెట్టింగ్‌లు ఉపయోగించి మిమ్మల్ని ఫోటోలో ట్యాగ్ చేయమని వేరొక వినియోగదారుకు మేము సూచించాలో వద్దో నియంత్రించవచ్చు.

మా వద్ద స్థాన సమాచారం ఉన్నప్పుడు, మీ ప్రాంతానికి చెక్ ఇన్ చేయడంలో మరియు స్థానిక ఈవెంట్‌లు లేదా ఆఫర్‌లను కనుగొనడంలో లేదా మీరు సమీపంలోనే ఉన్నట్లు మీ స్నేహితులకు తెలియజేయడంలో సహాయపడటం వంటి విషయాల్లో మీకు మరియు ఇతరులకు మా సేవలను వ్యక్తీకరించడానికి ఆ సమాచారాన్ని ఉపయోగిస్తాము.

మేము సర్వేలు మరియు పరిశోధనలను నిర్వహిస్తాము, అభివృద్ధి దశలో లక్షణాలను పరీక్షిస్తాము, అలాగే ఉత్పత్తులు మరియు సేవలను అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి సమాచారాన్ని విశ్లేషిస్తాము, కొత్త ఉత్పత్తులు లేదా లక్షణాలను అభివృద్ధి చేస్తాము, అలాగే ఆడిట్‌లను నిర్వహిస్తాము మరియు సమస్య పరిష్కార చర్యలను తీసుకుంటాము.
మీతో కమ్యూనికేట్ చేయడం.
మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లను పంపడానికి, మా సేవల గురించి మీతో కమ్యూనికేట్ చేయడానికి, అలాగే మా విధానాలు మరియు నిబంధనల గురించి మీకు తెలియజేయడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ప్రతిస్పందించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
ప్రకటనలు మరియు చూపడం మరియు అంచనా వేయడం.
మా ప్రకటన మరియు ప్రమాణం వ్యవస్థను మెరుగుపరచడానికి మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము, కాబట్టి మేము మా సేవల్లో ఉండే మరియు లేని సముచిత ప్రకటనలను మీకు చూపగలము మరియు ప్రకటనలు మరియు సేవల ప్రభావాన్ని మరియు అవి చేరుకోవడాన్ని కొలవగలము. మా సేవలలో వ్యాపార ప్రకటన విధానం గురించి మరియు మీకు చూపబడే ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి మీ గురించిన సమాచారం వినియోగించబడే విధానాన్ని ఎలా నియంత్రించాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
భద్రత మరియు రక్షణను పెంపొందించడం.
ఖాతాలు మరియు కార్యాచరణను ధృవీకరించడంలో మరియు అనుమానాస్పద కార్యాచరణను లేదా మా నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘనను పరిశోధించడం వంటి వాటితో సహా మా సేవలలో మరియు వెలుపల భద్రత మరియు రక్షణను పెంపొందించడంలో సహాయపడటానికి మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఇంజినీర్ల బృందాలు, స్వయంచాలక సిస్టమ్‌లు మరియు గుప్తీకరణ మరియు మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికత ఉపయోగించి మీ ఖాతాను రక్షించడానికి మేము చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాము. మీ ఖాతాకు అదనపు భద్రతను జోడించే సులభ వినియోగ భద్రతా సాధనాలను కూడా మేము అందిస్తాము. Facebookలో భద్రతను పెంపొందించడం గురించి మరింత సమాచారం కోసం, Facebook భద్రతా సహాయ కేంద్రాన్ని సందర్శించండి.
మా సేవలను అందించడానికి మరియు వాటికి మద్దతివ్వడానికి మేము కుక్కీలు మరియు అటువంటి సాంకేతికతలను ఉపయోగిస్తాము మరియు ప్రతి వినియోగం మా విధానంలోని ఈ విభాగంలో నిర్వచించబడింది మరియు వివరించబడింది. మరింత తెలుసుకోవడానికి మా కుక్కీల విధానం చదవండి.

ఈ సమాచారం ఎలా భాగస్వామ్యం చేయబడుతుంది?

మా సేవల్లో భాగస్వామ్యం
వ్యక్తులు ఇతరులతో అనుసంధానమవ్వడానికి మరియు పంచుకోవడానికి మా సేవలను ఉపయోగిస్తారు. క్రింది మార్గాల్లో మీ సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా మేము దీన్ని సాధ్యమయ్యేలా చేస్తాము:
మీరు భాగస్వామ్యం చేసే మరియు కమ్యూనికేట్ చేసే వ్యక్తులు.
మా సేవలను ఉపయోగించి మీరు భాగస్వామ్యం చేసినప్పుడు మరియు కమ్యూనికేట్ చేసినప్పుడు, మీరు భాగస్వామ్యం చేసే వాటిని చూడగల ప్రేక్షకులను మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు Facebookలో పోస్ట్ చేసినప్పుడు, పోస్ట్ కోసం అనుకూలీకరించిన వ్యక్తుల సమూహం, మీ స్నేహితులందరూ లేదా సమూహంలోని సభ్యులు వంటి ప్రేక్షకులను మీరు ఎంచుకోవచ్చు. అలాగే మీరు Messengerని ఉపయోగించినప్పుడు, ఫోటోలు మరియు సందేశాన్ని పంపే వ్యక్తులను కూడా ఎంచుకోవచ్చు.

మీరు పబ్లిక్ ప్రేక్షకులతో భాగస్వామ్యం చేసే ఏదైనా సమాచారం, అలాగే మీ పబ్లిక్ ప్రొఫైల్‌లోని సమాచారం, లేదా మీరు Facebook పేజీ లేదా వేరొక పబ్లిక్ ఫోరమ్‌లో భాగస్వామ్యం చేసే కంటెంట్‌ని పబ్లిక్ సమాచారం అంటారు. పబ్లిక్ సమాచారం మా సేవలను ఉపయోగించే లేదా ఉపయోగించని ఎవరికైనా అందుబాటులో ఉంటుంది మరియు ఈ సమాచారాన్ని ఆన్‌లైన్ శోధన ఇంజిన్‌లు, APIలు మరియు టీవీ వంటి ఆఫ్‌లైన్ మీడియా ద్వారా చూడవచ్చు లేదా ప్రాప్యత చేయవచ్చు.

కొన్ని సందర్భాల్లో, మీరు భాగస్వామ్యం చేసే మరియు కమ్యూనికేట్ చేసే వ్యక్తులు ఈ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు లేదా మా సేవలను ఉపయోగించే లేదా ఉపయోగించని ఇతరులతో మళ్లీ భాగస్వామ్యం చేయవచ్చు. మీరు Facebookలో వేరొక వ్యక్తి పోస్ట్‌పై వ్యాఖ్యానించినప్పుడు లేదా వారి కంటెంట్‌ను ఇష్టపడినప్పుడు, మీ వ్యాఖ్యను లేదా ఇష్టాన్ని చూడగల ప్రేక్షకులను ఆ వ్యక్తి నిర్ణయిస్తారు. వారి ప్రేక్షకులు పబ్లిక్‌గా ఉంటే, మీ వ్యాఖ్య కూడా పబ్లిక్‌గా ఉంటుంది.
మీ గురించి ఇతరులు భాగస్వామ్యం చేసే కంటెంట్‌ను చూడగల వ్యక్తులు.
మీకు చెందిన కంటెంట్‌ను ఇతర వ్యక్తులు తాము ఎంచుకునే ప్రేక్షకులతో భాగస్వామ్యం చేయడానికి మా సేవలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వ్యక్తులు మీ ఫోటోను భాగస్వామ్యం చేయవచ్చు, పోస్ట్‌లో ఒక స్థానం వద్ద మిమ్మల్ని పేర్కొనవచ్చు లేదా ట్యాగ్ చేయవచ్చు, లేదా మీరు వారితో భాగస్వామ్యం చేసే మీ గురించిన సమాచారాన్ని భాగస్వామ్యం చేయవచ్చు. వేరొకరి పోస్ట్ విషయంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే, వ్యక్తులు తాము విశ్వసించే వ్యక్తులను త్వరగా మరియు సులభంగా సహాయం అందించమని అడగటానికి సామాజిక నివేదన ఒక మార్గం. మరింత తెలుసుకోండి.
మా సేవల్లోని లేదా వాటిని ఉపయోగించే అనువర్తనా‌లు, వెబ్‌సైట్‌లు మరియు మూడవ-పక్ష ఏకీకరణలు.
మీరు మా సేవలను వినియోగించే లేదా వాటితో ఏకీకృతమైన మూడవ-పక్ష అనువర్తనా‌లు, వెబ్‌సైట్‌లు లేదా ఇతర సేవలను ఉపయోగించినప్పుడు, అవి మీరు పోస్ట్ చేసే లేదా భాగస్వామ్యం చేసే వాటి గురించి సమాచారాన్ని స్వీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ Facebook స్నేహితులతో గేమ్ ఆడినప్పుడు లేదా వెబ్‌సైట్‌లో Facebook వ్యాఖ్య లేదా భాగస్వామ్యం బటన్‌ను ఉపయోగించినప్పుడు, గేమ్ డెవలపర్ లేదా వెబ్‌సైట్ గేమ్‌లో మీ కార్యాచరణల గురించి సమాచారాన్ని పొందవచ్చు లేదా మీరు Facebookలో వారి వెబ్‌సైట్ నుండి భాగస్వామ్యం చేసే వ్యాఖ్యను లేదా లింక్‌ను స్వీకరించవచ్చు. 0అదనంగా, మీరు అటువంటి మూడవ-పక్ష సేవలను డౌన్‌లోడ్ చేసినప్పుడు లేదా వినియోగించినప్పుడు, వారు మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను ప్రాప్యత చేయగలరు, ఇందులో మీ వినియోగదారు పేరు లేదా వినియోగదారు ఐడి, మీ వయస్సు పరిధి మరియు దేశం/భాష, మీ స్నేహితుల జాబితా, అలాగే మీరు వారితో భాగస్వామ్యం చేసే ఏదైనా సమాచారం ఉంటాయి. ఈ అనువర్తనా‌లు, వెబ్‌సైట్‌లు లేదా ఏకీకృత సేవల ద్వారా సేకరించిన సమాచారం వారి నిబంధనలు మరియు విధానాలకు లోబడి ఉంటుంది.

ఈ అనువర్తనాలు మరియు వెబ్‌సైట్‌లతో మీరు మరియు ఇతరులు భాగస్వామ్యం చేసే మీ గురించిన సమాచారాన్ని మీరు ఎలా నియంత్రించగలరనేదాని గురించి మరింత తెలుసుకోండి.
Facebook కంపెనీలలో భాగస్వామ్యం.
మీ గురించి మా వద్ద ఉన్న సమాచారాన్ని Facebookలో భాగమైన అనుబంధ కంపెనీలలో మేము భాగస్వామ్యం చేస్తాము. మా కంపెనీల గురించి మరింత తెలుసుకోండి.
కొత్త యజమాని.
మా సేవల లేదా వారి ఆస్తులలో సంపూర్ణంగా లేదా పాక్షికంగా యాజమాన్యం మరియు నియంత్రణలో మార్పులు ఉంటే, మేము మీ సమాచారాన్ని కొత్త యజమానికి బదిలీ చేయవచ్చు.

మూడవ-పక్ష భాగస్వాములు మరియు కస్టమర్‌లతో భాగస్వామ్యం
మా సేవలను అందించడం మరియు మెరుగుపరచడంలో మాకు సహాయపడే లేదా వ్యాపార ప్రకటన లేదా సంబంధిత ఉత్పత్తులను ఉపయోగించే మూడవ పక్ష కంపెనీలతో పని చేస్తాము, దీని వల్ల మా కంపెనీలను నిర్వహించగలుగుతాము మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉచిత సేవలను అందించగలుగుతాము.

మీ గురించిన సమాచారాన్ని మేము భాగస్వామ్యం చేయగల మూడవ పక్ష రకాలు ఇక్కడ ఉన్నాయి:
ప్రకటన, అంచనా మరియు విశ్లేషణల సేవలు (వ్యక్తిగతంగా గుర్తించబడని సమాచారం మాత్రమే).
మా సేవల్లో మీరు కనుగొనే ఇతర సమాచారం ఎంత సముచితంగా మరియు ఆసక్తికరంగా ఉంటుందో మా వ్యాపార ప్రకటన విధానం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీకు సముచిత ప్రకటనలు చూపడానికి మీ గురించి మా వద్ద ఉన్న సమాచారం మొత్తాన్ని మేము ఉపయోగిస్తాము. మీరు మాకు అనుమతి ఇస్తే తప్ప మేము ప్రకటన, కొలత లేదా విశ్లేషణల భాగస్వాములతో మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే (వ్యక్తిగతంగా గుర్తించే సమాచారం అంటే మిమ్మల్ని సంప్రదించగలిగే లేదా గుర్తించగలిగే అవకాశం గల పేరు లేదా ఇమెయిల్ చిరునామా వంటి సమాచారం) సమాచారాన్ని భాగస్వామ్యం చేయము. మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అందించకుండా ఈ భాగస్వాముల ప్రకటన చేరువ మరియు ప్రభావం గురించిన సమాచారాన్ని మేము వారికి అందించవచ్చు లేదా మేము సమాచారాన్ని సమగ్రపరిచి ఉంటే, ఇది మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించేలా ఉండదు. ఉదాహరణకు, ప్రకటనదారుని ప్రకటనలు ఎలా నిర్వహించబడుతున్నాయి లేదా వారి ప్రకటనలను ఎంతమంది వ్యక్తులు వీక్షించారు లేదా ప్రకటన చూసిన తర్వాత అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు అని మేము వారికి తెలియజేయవచ్చు, లేదా భాగస్వాముల ప్రేక్షకులు లేదా వినియోగదారులను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి వారికి వ్యక్తిగతంగా గుర్తించని జన సంబంధ సమాచారాన్ని (మాడ్రిడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌ను ఇష్టపడే 25 ఏళ్ల వయస్సు గల స్త్రీ వంటివి) అందించవచ్చు, అయితే ప్రకటనదారు మా ప్రకటన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటానికి అంగీకరించిన తర్వాత మాత్రమే అందిస్తాము.

మీకు Facebookలో నిర్దిష్ట ప్రకటనను ఎందుకు చూపుతున్నారో అర్థం చేసుకోవడానికి, దయచేసి మీ ప్రకటన ప్రాధాన్యతలను సమీక్షించండి. మీరు Facebookలో మీ ప్రకటన అనుభవాన్ని నియంత్రించాలనుకుంటే మరియు నిర్వహించాలనుకుంటే మీ ప్రకటన ప్రాధాన్యతలను సర్దుబాటు చేయవచ్చు.
విక్రేతలు, సేవా ప్రదాతలు మరియు ఇతర భాగస్వాములు.
మేము సాంకేతిక సదుపాయ సేవలను అందించడం, మా సేవలు వినియోగించబడే విధానాన్ని విశ్లేషించడం, ప్రకటనలు మరియు సేవల ప్రభావాన్ని అంచనా వేయడం, కస్టమర్ సేవను అందించడం, చెల్లింపుల సదుపాయం కల్పించడం లేదా విద్యా సంబంధ పరిశోధనలు మరియు సర్వేలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు నిర్వహించే విక్రేతలు, సేవా ప్రదాతలు మరియు మా వ్యాపారానికి భౌగోళికంగా మద్దతిచ్చే ఇతర భాగస్వాములకు సమాచారాన్ని బదిలీ చేస్తాము. ఈ భాగస్వాములు ఈ డేటా విధానం మరియు మేము వారితో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కఠినమైన గోప్యతా బాధ్యతలకు కట్టుబడి ఉండాలి.

నా గురించిన సమాచారాన్ని నేను ఎలా నిర్వహించగలను లేదా తొలగించగలను?

మీరు కార్యాచరణ లాగ్ సాధనం ద్వారా Facebookను ఉపయోగిస్తున్నప్పుడు మీరు పంచుకునే కంటెంట్ మరియు సమాచారాన్ని నిర్వహించవచ్చు. మేము అందించే మీ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి సాధనం ద్వారా మీరు మీ Facebook ఖాతాకు అనుబంధించబడిన సమాచారాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేము ఎగువ పేర్కొన్న వాటితో సహా మీకు మరియు ఇతరులకు ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి అవసరమైనంత కాలం డేటాను నిల్వ చేస్తాము. మీ ఖాతాతో అనుబంధించబడిన సమాచారం ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి ఇకపై మాకు డేటా అవసరం లేదని భావించినప్పుడు మినహా మీ ఖాతా తొలగించబడే వరకు అలాగే ఉంటుంది.

మీరు మీ ఖాతాను ఎప్పుడైనా తొలగించవచ్చు. మీరు మీ ఖాతాను తొలగించినప్పుడు, మీరు పోస్ట్ చేసిన మీ ఫోటోలు మరియు స్థితి నవీకరణలు వంటి అంశాలను మేము తొలగిస్తాము. మీరు మీ ఖాతాను తొలగించకుండా Facebookను ఉపయోగించడం తాత్కాలికంగా ఆపివేయాలనుకుంటే, బదులుగా మీరు మీ ఖాతాను నిష్క్రియం చేయవచ్చు. మీ ఖాతాను నిష్క్రియం చేయడం లేదా తొలగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇతరులు మీ గురించి భాగస్వామ్యం చేసిన సమాచారం మీ ఖాతాలో భాగం కాదు మరియు మీరు మీ ఖాతాను తొలగించినప్పుడు అది తొలగించబడదని గుర్తుంచుకోండి.

చట్టపరమైన అభ్యర్థనలు లేదా హానిని నిరోధించడానికి మేము ఎలా ప్రతిస్పందించాలి?

చట్టపరమైన అభ్యర్థనకు (సెర్చ్ వారెంట్, కోర్టు ఆర్డర్ లేదా కోర్టు హాజరు సమను) ప్రతిస్పందించే క్రమంలో చట్ట ప్రకారం అవసరమని మేము విశ్వసించినప్పుడు మీ సమాచారాన్ని ప్రాప్యత చేయవచ్చు, భద్రపరచవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు. ఇందులో యునైటెడ్ స్టేట్స్‌కు వెలుపలి అధికార పరిధుల నుండి చట్టపరమైన అభ్యర్థనలకు ప్రతిస్పందించడం ఉండవచ్చు, అవి ఆ అధికార పరిధిలోని చట్టప్రకారం ప్రతిస్పందించడం అవసరమని, ఆ అధికార పరిధిలోని వినియోగదారులను ప్రభావితం చేస్తుందని మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రమాణాలకు లోబడి ఉందని మేము విశ్వసించినప్పుడు యునైటెడ్ స్టేట్స్‌కు వెలుపల అధికార పరిధుల నుండి చట్టపరమైన అభ్యర్థనలకు కూడా ప్రతిస్పందించవచ్చు. మోసం మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను కనుగొనడం, నిరోధించడం మరియు పరిష్కరించడం; పరిశోధనల్లో భాగంగా మమ్మల్ని, మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించడం; లేదా మరణం లేదా త్వరలో భౌతికంగా గాయాల పాలయ్యే పరిస్థితిని నివారించడం వంటి వాటి కోసం అవసరమని విశ్వసించినప్పుడు మేము సమాచారాన్ని ప్రాప్యత చేయవచ్చు, భద్రపరచవచ్చు మరియు భాగస్వామ్యం చేయవచ్చు. ఉదాహరణకు, మా సేవలలో మరియు వెలుపల మోసం మరియు దుర్వినియోగం జరగకుండా నివారించడానికి మీ ఖాతా విశ్వసనీయత గురించి మూడవ-పక్ష భాగస్వాములకు మేము సమాచారాన్ని అందించవచ్చు. Facebookలో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీ డేటాతో సహా మీ గురించి మేము స్వీకరించే సమాచారం చట్టపరమైన అభ్యర్థన లేదా బాధ్యత, ప్రభుత్వ విచారణ లేదా మా నిబంధనలు లేదా విధానాల సంభావ్య ఉల్లంఘనలకు సంబంధించిన విచారణలు లేదంటే హాని జరగకుండా నిరోధించడం వంటి వాటికి లోబడి పొడిగించిన కాల వ్యవధి వరకు ప్రాప్యత చేయబడవచ్చు, ప్రాసెస్ చేయబడవచ్చు మరియు నిలిపి ఉంచవచ్చు. పునరావృతంగా దుర్వినియోగం చేయడం లేదా మా నిబంధనలను ఉల్లంఘించడం నిరోధించడానికి కనీసం సంవత్సరం పాటు మా నిబంధనలను ఉల్లంఘించినందుకు నిలిపివేసిన ఖాతాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా మేము నిలిపి ఉంచవచ్చు.

మా భౌగోళిక సేవలు ఎలా నిర్వహించబడతాయి

Facebook ఈ విధానంలో వివరించిన ప్రయోజనాల దృష్ట్యా అంతర్గతంగా మా అనుబంధ సంస్థలలో లేదా మూడవ పక్షాలతో సమాచారాన్ని భాగస్వామ్యం చేయవచ్చు. ఉదాహరణకు, యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో (“EEA”) సేకరించిన సమాచారాన్ని ఈ విధానంలో వివరించిన ప్రయోజనాల కోసం EEA వెలుపలి దేశాలకు బదిలీ చేయవచ్చు. మేము EEA నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలకు డేటా బదిలీలను చట్టబద్ధం చేయడానికి యురోపియన్ కమీషన్ ద్వారా ఆమోదించబడిన ప్రామాణిక ఒప్పంద ఉపనిబంధనలను ఉపయోగిస్తాము, యురోపియన్ యూనియన్ చట్టం ప్రకారం ఇతర మార్గాలను అవలంబిస్తాము మరియు మీ సమ్మతిని పొందుతాము.

మీకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే దిగువ అందించిన సమాచారాన్ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించవచ్చు. మా గోప్యతా విధానాలు మరియు పద్ధతులకు సంబంధించి మీకు మాతో ఏవైనా వివాదాలు తలెత్తిన పక్షంలో మేము TRUSTe ద్వారా వాటిని పరిష్కరించవచ్చు. మీరు TRUSTeని వారి వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు.

ఈ విధానంలో మార్పుల గురించి మేము మీకు ఎలా తెలియజేస్తాము?

ఈ విధానానికి మార్పులు చేయడానికి ముందు మీకు తెలియజేస్తాము మరియు మా సేవలను ఉపయోగించడం కొనసాగించడానికి ముందు సవరించిన విధానంలో సమీక్షించే మరియు వ్యాఖ్యానించే అవకాశాన్ని మీకు అందిస్తాము.

సందేహాలుంటే Facebookను ఎలా సంప్రదించాలి

Facebookలో గోప్యత ఎలా పని చేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి గోప్యతా ప్రాథమికాంశాలు చూడండి. ఈ విధానం గురించి మీకు సందేహాలుంటే, మమ్మల్ని ఎలా సంప్రదించాలో ఇక్కడ ఉంది:
మీరు యుఎస్ లేదా కెనడాలో నివసిస్తుంటే...
దయచేసి Facebook, Inc.ని ఆన్‌లైన్‌లో సంప్రదించండి లేదా ఈ చిరునామాకు వ్రాసి పంపండి:
Facebook, Inc.
1601 విల్లో రోడ్
మెన్లో పార్క్, సిఎ 94025
మీరు వేరెక్కడైనా నివసిస్తుంటే...
మీ సమాచార బాధ్యతలు వహించే డేటా కంట్రోలర్ Facebook ఐర్లాండ్ లిమి., మీరు వారిని ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు లేదా ఈ చిరునామాకు వ్రాసి పంపవచ్చు:
Facebook ఐర్లాండ్ లిమిటెడ్
4 గ్రాండ్ కెనాల్ స్క్వేర్
గ్రాండ్ కెనాల్ హార్బర్
డబ్లిన్ 2 ఐర్లాండ్


చివరి పునర్విమర్శ జరిగిన తేదీ: సెప్టెంబర్ 29, 2016