ఈ దేశంలో ఇలస్ట్రేటర్లకు వర్క్‌షాప్స్ ఉండవు, వారి పనికి ఫెలోషిప్‌లు కానీ, గ్రాంట్లు కానీ ఏం రావు. కానీ విదేశాల్లో నీకు ఈ సదుపాయాలు అన్నీ వుంటాయి. అద్భుతమైన గురువులు ఉన్నారక్కడ. ఒకవేళ చూపు సారించగలిగతే నువ్వు ఆ వేపు చూడాలి. కానీ, నీ భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.

ఈలోగా ఇంకో నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది, “…ఎక్కడ పడిపోయారండీ?” అంటూ. మామయ్య అందా, నాన్న అందా? పిల్లర్ నంబర్ థర్టీన్ అని చెప్పాను. రోడ్డుకు అటువైపా? ఇటువైపా? రైతుబజార్‌కు ఎంతదూరం? కుడిపక్కా, ఎడమపక్కా అంటూ వచ్చిన ప్రశ్నలకు జవాబు చెబుతూనే ఇంకో షాపులోకి వెళ్లాను. నేను అడిగింది కాక ఇంకేదో పేరు చెప్పి, అది ఉందన్నాడు.

మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహరం కథ వినిపిస్తా.

దిక్కు తోచక దాచుకున్నవన్నీ బయటికి తీసి చూస్తావు. చాకొలేట్ రేపర్, సినిమా టికెట్, రుమాలు, ఎండిన మల్లెపువ్వొకటి, రెండు గవ్వలు, నాలుగు మబ్బులు మూసిన సాయంత్రాలు, కొన్ని పాత పాటలు. చెదలు తినేస్తూ. దేన్నీ రేకెత్తించని, దేన్నీ సూచించని ఈ చెత్తంతా ఎందుకు ఏరిపెట్టుకున్నట్టో అర్థం కాదు. బరువు దించుకుని అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. అప్పుడు తను ఈ భూమ్మీద ఇదే కాలంలో జీవించే తోటి మనిషి.

రాజుగారి ప్రస్తుత పరిస్థితికీ ఈ నడింపిల్లోరి టెంకబాబుకీ ఏదో మెలికుంది. ఏంటదీ? టెంక మాటెత్తితేనే ఈయన ఉలుకులికిపడుతున్నారు. టెంకగారేమో అస్సలు ఏమీ తెలనట్టే వుంటాడు. ఆ బాబు కూడా చాలా మంచోడు. అందరితో కలివిడిగా వుంటూ ఊరికేదో ఉపకారం చేద్దాం అనే బాపతే తప్ప అల్లరి చిల్లర రకం కూడా కాదు. అసలేమై వుంటది?

మలుపులన్నీ తిరిగి తిరిగి
మన కథ కంచికెళ్ళిపోతుంది

నా నుంచి నీ వైపుకు వెళ్ళే దారి
ఒకే ఒక ఉత్తరం ముక్కకీ
ఓ సంక్షిప్త వాక్యానికీ మాత్రం తావుంచి
పూర్తిగా మూసివేయబడుతుంది

రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు. టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ. ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్ధం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది. కోపంతో శ్రీధర్ అన్నయ్య యామిని మీద చేయి చేసుకోలేదు కదా?

…పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో…

సురపురం చదివితే ఒక అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. తనమీద తనకు నమ్మకం ఉన్న మనిషి, తనతోనూ పరిసర ప్రపంచంతోనూ సామరస్యం సాధించిన మనిషి– ఎన్ని గొప్ప పనులూ సాహసాలూ చెయ్యగలడో స్పష్టమవుతుంది. కీర్తీ, జీతభత్యాలూ తనకు అందకపోయినా అలాంటి నిరాశల గురించి యథాలాపంగా, నిర్లిప్తంగా చెప్పే ఒక స్థితప్రజ్ఞత ఆయన జీవనసూత్రం.

నా చిన్ని పెరటిలో పూసిన పువ్వులు
చూడలేదని నిన్ను నిష్టూరమాడాను
నువ్వు నడచి వచ్చిన అడవి ఆరోజున చూశాక
ఎంతటి సిగ్గుతో ముడుచుకుపోయాను
నా అల్పత్వాన్ని చూసి ఎంత నొచ్చుకున్నావో గదా!

తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి చాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు చాయ అనలేము. ఇలాంటి మేనిచాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు అని చెప్తే మీకు అర్థం అవుతుంది.

ఏ కథనయినా సరిగా అనుసరించాలంటే కథలోని ప్రధానపాత్రల ప్రాథమిక పరిచయం అవసరం. ప్రాథమిక పరిచయం అంటే పేరు ఒకటే కాదు. దానికన్నా ముఖ్యం ‘నేను’ కి చెందిన ఇతర వివరాలు. ప్రథమపురుష కథనంలో ఈ వివరాలన్నీ కథలో ప్రధానపాత్రలు ప్రవేశించినప్పుడో, ఆ తర్వాత కొద్దిసేపటికో సందర్భానుసారంగా తెలుస్తాయి. ఈ పాత్రల్తో పోలిస్తే ఉత్తమపురుషలో కథలో ప్రధానపాత్ర అయిన ‘నేను’ పూర్తిగా భిన్నమయినది.

పాపులర్ రచనలను పట్టించుకోవడం అనేది చాలామంది మంచి విమర్శకులు సైతం విస్మరిస్తున్న పని. ‘సాధారణ పాఠకుడి’ పఠన రీతుల్ని మలచగల శక్తి, మలచాల్సిన బాధ్యత విమర్శకున్నాయి. ఈ పనిని చేసిన వాళ్లు కొద్దిమందే, కొడవటిగంటి కుటుంబరావుగారి వంటి వాళ్లు. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో మూడవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది.

గడినుడి 16కు ఈసారి గడువు తేదీలోపు ఎవ్వరూ సరైన సమాధానాలు పంపలేదు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల 2. హరిణి దిగుమర్తి. 3. సతీశ్ 4. భమిడిపాటి సూర్యలక్ష్మి 5. మంథా వీరభద్రం. వీరికి మా అభినందనలు.

గడి నుడి – 16 సమాధానాలు, వివరణ.