మాటలలో బొమ్మలు కట్టడం, వాటిని అంత అందంగానూ ఆకాశవాణి ద్వారా శ్రోతలకు చూపించడం వారికి తెలుసు. యస్వీ రేడియో ప్రసంగాలు మహత్తర చిత్రకృతులు, కనువిందు చేసే కొండపల్లి బొమ్మలు. నిజానికి శర్మ అచ్చులకు రాసింది తక్కువ. హల్లులకు, అంటే ప్రసంగ పాఠాలకు రాసిందే ఎక్కువ. కృష్ణశాస్త్రి బడి, పలుకుబడితో పాటు వొద్దిక వొబ్బిడితనం కలిసిన దినుసు యస్వీది.

కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు.

2015లో దాసరి అమరేంద్ర ఆక్టివా స్కూటరు మీద దక్షిణభారతదేశమంతా తిరిగారు. ఆ అనుభవాలు ‘కొన్నికలలు ఒక స్వప్నం’ అన్న పేరుమీద పుస్తకంగా ఈ నెల వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ఒక అధ్యాయం ఈమాట పాఠకుల కోసం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన.

ఘుమఘుమలాడే కాఫీ కప్పు కళ్ళకెదురుగా పట్టుకుని చరిత నా ముందు ప్రత్యక్షమై నా పరధ్యానం పోగొట్టింది. తనను చూసినప్పుడల్లా నన్ను భర్తగా స్వీకరించి నాకు ఈ విశ్వాన్ని బహుకరించినట్టు ఉంటుంది. పెళ్ళై ఐదేళ్ళైనా నాకు చరిత ఎప్పుడు ఒక విచిత్రమైన స్వప్నంలా ఉంటుంది. తన కళ్ళకో విశ్వసంగీతం తెలిసినట్టు ఉంటుంది.

ఆయినెవరో డైరెక్టరునని షే​కాం​డ్ ఇ​త్తా​డా, అంతలో శ్రీశ్రీ నీ చెవి పక్కక్కొచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకో​ ​ఆయన​ నేనే ​మ్యానేజరునని షే​కాం​డ్ ఇత్తాడా, మళ్ళా శ్రీశ్రీ ఎనకమాలగా వచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకప్పుడు శ్రీశ్రీ మీన గయ్యిమని లేత్తావ్. నీ సాగిత్యాలన్నీ చెత్త బుట్టలో బెట్టి కిలోల్లెక్కన అమ్మిపార్నూకి, ​మేయ్, ​లగెత్తు!

ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.

వర్షం కురిసినపుడో
పూవు రాలినపుడో
సన్నజాజులు పలుకరించినపుడో
ఏ వెన్నెలరాత్రో
ఏ శ్రావణ మేఘం ఉరిమినపుడో
ఏ కోవెల ప్రాంగణపు కోనేటి నిశ్శబ్దంలోనో
జీవితపు ఏ శూన్యతో నిన్ను నిలవేసినపుడో

పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు. సమయం చూసి మంచి పంచులు విసురుతుంటాడు. కిటికీ తెరచి అందులోనుండి ప్రకృతిని చూడమంటాడు.

ఏ చెయ్యీ నను చేరదీయదనీ
ఏ మొగ్గా నాకోసం బుగ్గరించదని తెలిసాక
నా కాళ్ళ మోడుపై నేనే ఎదిగి
నా వేళ్ళ చివర్లు నేణే చిగురించుకుని
నాలో నేను మోయలేనంత పువ్వునై విచ్చుకుంటాను.

నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.

నాకేదో అయిపోయినట్టు, అంతలోనే ఏమీ కానట్టు…
రెండు రెండుగా ఆలోచిస్తున్నారు.
రెండు రెండుగా చూస్తున్నారు.
జాలిచూపులు దాచుకోలేక అవస్థ పడుతున్నారు!
నిజం నాకు తెలుసని వాళ్లకీ,
వాళ్లకి తెలుసని నాకు తెలియనిదేమీ కాదు.

మరి కొన్ని కాలాలు ఇక్కడే విడిచిపెట్టినా
మరొక్క మాటా పెగలని మన మర్యాదల మీద
ఒక్క అడుగు ఎటూ కదలని మన విడి విడి కథల మీద
ఇవాళ కాస్త ఎక్కువ జాలిపడుతూ చెరో దారికి విడిపోతాం
ఎప్పటిలాగే నువ్వు తూర్పుకి, నేను పడమరకి!

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

గతంలో బి.ఎన్‌. రెడ్డి పైన వ్యాసం రాసినప్పుడే ఈ రేడియో ఇంటర్‌వ్యూని ప్రస్తావించినందువల్ల దానిని కూడా జత పరచుదామనుకున్నాను కానీ సమయానికి డిజిటైజ్ చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. అలా ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు, ఇక్కడ, మీరందరూ వినగలిగేట్లు!

గడినుడి 13 పూర్తిగా నింపినది ఈసారి ఒక్కరే. కామాక్షిగారికి మా అభినందనలు. సరిచూపు సహాయంతో గడి పూర్తిగా తప్పులు లేకుండా నింపిన మొదటి ఐదుగురు: 1. వైదేహి శశిధర్, 2. రాఘవేంద్ర ఆదిత్య, 3. ఎ. రామారావు, 4. పూల రమాదేవి, 5. కార్తీక్ చంద్ర. వీరికి మా అభినందనలు.

గడి నుడి – 12 సమాధానాలు, వివరణ.