1921
వికీపీడియా నుండి
1921 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1918 1919 1920 - 1921 - 1922 1923 1924 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- జనవరి 27: అదివరకే ఉన్న 3 బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంకు ఏర్పాటుచేయబడింది.
జననాలు[మార్చు]
- జనవరి 8: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
- ఫిబ్రవరి 14: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
- మార్చి 7: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)
- ఏప్రిల్ 19: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1995)
- మే 7: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989)
- మే 21: ఆండ్రూ సఖరోవ్, రష్యా మానవహక్కుల ఉద్యమనేత.
- మే ....: జలగం వెంగళరావు, ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి. (మ.1999)
- మే 30: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .
- జూన్ 18: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
- జూన్ 28: పి.వి.నరసింహారావు, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.2004)
- జూలై 4: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఆగష్టు 1: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966)
- ఆగష్టు 3: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)
- ఆగష్టు 8: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
- ఆగష్టు 21: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
- ఆగష్టు 23: కెన్నెత్ ఆరో, ప్రముఖ ఆర్థికవేత్త.
- సెప్టెంబర్ 10: వడ్డాది పాపయ్య, ప్రముఖ చిత్రకారుడు. (మ.1992)
- సెప్టెంబరు 24: ధూళిపాళ సీతారామ శాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007)
- అక్టోబరు 1: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
- అక్టోబరు 25: టి.వి.రాజు, తెలుగు, తమిళ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
మరణాలు[మార్చు]
- సెప్టెంబర్ 11: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882)