అన్నాప్రగడ కామేశ్వరరావు
వికీపీడియా నుండి
అన్నాప్రగడ కామేశ్వరరావు | |
---|---|
స్థానిక పేరు | అన్నాప్రగడ కామేశ్వరరావు |
జననం | అన్నాప్రగడ కామేశ్వరరావు 1902 అక్టోబరు 21 |
మరణం | 1964 జూలై 01 |
జాతీయత | భారతీయుడు |
మతం | హిందూ |
అన్నాప్రగడ కామేశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
జననం[మార్చు]
గుంటూరు జిల్లా నరసరావు పేట తాలుకా కనుమర్తి లో 1902, అక్టోబరు 21 న జన్మించాడు.[1] మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. మొదటి ప్రపంచ యుద్ధము లో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి జస్టిస్ పార్టీ ఆధ్వర్యములోని ప్రభుత్వము పాఠశాలను మూసివేయించింది[2].
క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ కు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసన సభ్యుడు.
మూలాలు[మార్చు]
- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113
- ↑ http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1017/5/UOH-1993-241-4.pdf