జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ తూర్పు కమిషనరేట్ పేరు ఖరారయింది. చారిత్రక నేపథ్యమున్న రాచకొండ పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలన సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను తూర్పు, పశ్చిమగా విభజించిన విషయం తెలిసిందే. జూలై ఒకటో తేదీ నుంచి ఇవి