1935 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
ఫిబ్రవరి 20 : నేదురుమల్లి జనార్థనరెడ్డి , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2014)
మార్చి 2 : దుద్దిల్ల శ్రీపాద రావు , ప్రముఖ శాసనసభ్యుడు మరియు శాసనసభ స్పీకరు. (మ.1999)
మార్చి 30 : తంగిరాల వెంకట సుబ్బారావు , తెలుగు రచయిత.
జూన్ 12 : తిరుమాని సత్యలింగ నాయకర్ , మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)
జూన్ 23 : నాదెండ్ల భాస్కరరావు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
జూన్ 28 : ఆచంట వెంకటరత్నం నాయుడు , నాటక రచయిత. (మ.2015)
జూలై 26 : కోనేరు రంగారావు , కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. (మ.2010)
ఆగష్టు 1 : ఏ.బి.కె. ప్రసాద్ , ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
ఆగష్టు 15 : రాజసులోచన , తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (మ.2013)
ఆగష్టు 20 : సి. ఆనందారామం , కథా, నవల రచయిత్రి
ఆగష్టు 20 : గౌరు తిరుపతిరెడ్డి , ప్రముఖ వాస్తునిపుణుడు (మ.2016)
ఆగష్టు 22 : డి. కామేశ్వరి , కథా, నవల రచయిత్రి
సెప్టెంబరు 4 : కొమ్మూరి వేణుగోపాలరావు , తెలుగు రచయిత. (మ.2004)
సెప్టెంబరు 9 : వేదాంతం సత్యనారాయణ శర్మ , కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012)
సెప్టెంబరు 10 : జి. వి. సుబ్రహ్మణ్యం , వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (మ.2006)
సెప్టెంబరు 10 : పి.ఎల్. నారాయణ , విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. (మ.1998)
సెప్టెంబరు 19 : మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
అక్టోబరు 8 : ప్రభాకర రెడ్డి , తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)
అక్టోబరు 20 : రాజబాబు , ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
నవంబర్ 3 : ఇ.వి.సరోజ , 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. (మ.2006)
నవంబర్ 15 : తెన్నేటి హేమలత , నవలా రచయిత్రి. (మ.1997)
నవంబర్ 27 : ప్రకాష్ భండారి , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
డిసెంబర్ 11 : ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
డిసెంబర్ 12 : వి.రామారావు , సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
డిసెంబర్ 26 : రోహన్ కన్హాయ్ , వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
: వెలుదండ రామేశ్వరరావు , ఆయుర్వేద, హోమియోపతి వైద్యుడు, రచయిత.
: లక్ష్మీదీపక్ ప్రముఖ సినిమా దర్శకుడు. (మ.2001)
పురస్కారాలు [ మార్చు ]
20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు