ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మిస్బా-వుల్-హక్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలి: సల్మాన్ భట్ (Misbah-ul-haq | Salman Butt | Amir Sohail | Abdul Kadhir | Zaheer Abbas)
న్యూజిలాండ్‌తో జరిగిన తొలివన్డేలో పాకిస్థాన్ ఘోర పరాజయానికి పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిదియే కారణమంటూ మాజీ క్రికెటర్లు మాజీ క్రికెటర్లు అమీర్ సొహైల్, అబ్దుల్ ఖాదిర్, జహీర్ అబ్బాస్‌లు విమర్శల వర్షం గుప్పించారు.
అలాగే స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఏకంగా ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించేందుకు మిస్బావుల్ హక్ సరైనవాడని వ్యాఖ్యానించాడు.
భారత ఉపఖండంలో జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ దగ్గరపడుతున్న నేపథ్యంలో పాక్ క్రికెటర్లు ఇలా చెత్తగా ఆడితే ఎలా అంటూ మాజీ క్రికెటర్లతో పాటు సల్మాన్ భట్ కూడా దుయ్యబట్టాడు. అఫ్రీది కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడుతూ ప్రేరణగా నిలవాల్సింది పోయి ఓటమికి సహచరులను నిందిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు.