1908 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము .
జనవరి 17 : ఎల్.వి.ప్రసాద్ , తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
ఫిబ్రవరి 4 : మఖ్దూం మొహియుద్దీన్ , ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
మార్చి 1 : ఖండవల్లి లక్ష్మీరంజనం , సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (మ.1986)
మార్చి 30 : దేవికారాణి , సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
ఏప్రిల్ 5 : జగ్జీవన్ రాం , భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
జూన్ 5 : రావి నారాయణరెడ్డి , కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
జూన్ 10 : ఈశ్వరప్రభు ప్రముఖ హేతువాది. [మ. ?]
జూలై 7 : కొమ్మూరి పద్మావతీదేవి , తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ.1970)
ఆగష్టు 5 : చక్రపాణి , బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. (మ.1975)
ఆగష్టు 24 : రాజ్ గురు , స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)
ఆగష్టు 27 : డోనాల్డ్ బ్రాడ్‌మాన్ , అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
సెప్టెంబరు 3 : జమలాపురం కేశవరావు , నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
సెప్టెంబరు 8 : చెలికాని అన్నారావు , తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
అక్టోబరు 1 : గడిలింగన్న గౌడ్ , కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
అక్టోబరు 2 :పర్వతనేని బ్రహ్మయ్య , ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
అక్టోబరు 6 : ఈశ్వరప్రభు , చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
అక్టోబరు 10 : ముదిగొండ లింగమూర్తి , తొలి తరం సినిమా నటుడు.
అక్టోబర్ 15 : జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ , ప్రముఖ ఆర్థికవేత్త. (జ.2006)
నవంబర్ 16 : బి.ఎన్.రెడ్డి , తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
డిసెంబరు 1 : నార్ల వెంకటేశ్వరరావు , తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. (మ.1985)
డిసెంబరు 9 : రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి , ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
పురస్కారాలు [ మార్చు ]
20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు