అడ్డగుట్ట / హైదరాబాద్ సిటీ : గాంధీ ఆస్పత్రిలో రోగుల అవస్థలను చూసి గవర్నర్ నరసింహన్ చలించిపోయారు. ఆస్పత్రిలో అందుతున్న సదుపాయలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పరిస్థితిని గమనించిన గవర్నర్ వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి వివరించారు. గాంధీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని మంత్రి గవర్నర్కు హామీ ఇచ్చారు.