2001 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
డిసెంబర్ 13 : భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
ఫిబ్రవరి 9 : హెర్బర్ట్ సైమన్ , ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
ఫిబ్రవరి 25 : డొనాల్డ్ బ్రాడ్మన్ , అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్మన్గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
మే 13 : ఆర్.కె.నారాయణ్ , ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత.
మే 28 : వులిమిరి రామలింగస్వామి , పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)
జూన్ 1 : బీరేంద్ర, నేపాల్ రాజు.
జూన్ 4 : దీపేంద్ర , నేపాల్ రాజు.
జూన్ 6 : కె.ప్రత్యగాత్మ , తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
జూన్ 19 : జంధ్యాల , సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
ఆగష్టు 16 : అన్నా మణి , భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
సెప్టెంబర్ 10 : పొట్లపల్లి రామారావు , కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు
సెప్టెంబర్ 27 : కోట్ల విజయభాస్కరరెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రి . (జ.1920)
పురస్కారాలు [ మార్చు ]
నోబెల్ బహుమతులు [ మార్చు ]
భౌతికశాస్త్రం: ఎరిక్ అలిన్ కార్నెల్, వోల్ఫ్గాంగ్ కెట్టెర్లీ, కార్ల్ ఎడ్విన్ వీమన్.
రసాయనశాస్త్రం: విలియం నోలెస్, యోజి నొయోరి, బారి షార్ప్లెస్.
వైద్యం: లెలాండ్ హార్ట్వెల్, తిమోతి హంట్, పాల్ ఎం నర్స్.
సాహిత్యం: వి.ఎస్.నైపాల్ .
శాంతి: ఐక్యరాజ్య సమితి , కోఫీ అన్నన్
ఆర్థికశాస్త్రం: జార్జి ఏ అకెర్లోఫ్, మైకెల్ స్పెన్స్, జోసెఫ్ ఇ స్టిగ్లిడ్జ్.
21వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు