వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 57,054 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఈయన మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. జనగణమన, వందేమాతరం తర్వాత అంతే సంఖ్యలో రోజూ లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్న ‘ప్రతిజ్ఞ’ ను రచించింది ఈయనే. ఈయన నల్గొండ జిల్లా , అన్నెపర్తి లో రాంబాయమ్మ, రామయ్యలకు జూన్ 10 , 1916 లో జన్మించారు.1962 చైనా యుద్ధ సమయంలో విశాఖపట్నం డిటివొగా పనిచేశారు.మన విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’కు రూపకల్పన చేసి తను రాసిన దానిని తెన్నేటి విశ్వనాథానికి చూపించారు.ఆయన అప్పటి విద్యాశాఖమంత్రి పి.వి.రాజుకు చూపించగా ఆయన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తో చర్చించి 1965 , జనవరి 26 వ తేదీనుండి ప్రతి పాఠశాలలో ఉదయాన్నే విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో ఈ ప్రతిజ్ఞ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయించారు..క్రమంగా ఇది అన్ని భాషల్లోను అనువదించబడింది. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబీకులు ఇప్పటికీ నల్లగొండ లోనే వున్నారు. వీరి సతీమణి వెంకట రత్నమ్మ ఇటీవలే చనిపోయారు. పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు.
...గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర పట్టణాలలో ఉత్తరకాశి ఒకటనీ!
...దుర్వాస మహర్షి తన భార్య అయిన "కందని" ని కూడా తన కోపాగ్నితో భస్మం చేశాడనీ! ఔరవ మహర్షి వ్యాసం.
...మొదటి వివాహం అమలులో ఉన్నప్పుడు భర్త రెండో వివాహం చేసుకుంటే నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించే చట్టం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనీ! సి.హెచ్.విద్యాసాగర్ రావు వ్యాసం.
...దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అనీ!
... పితోరాఘర్ సమీపంలోని జౌళ్ జిబి ప్రాంతంలోని కాలాపానీ హిల్ ప్రదేశంని వేడి నీటి బుగ్గలలోని నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయనీ!