వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 50,670 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
|
|
|
|
ఈ వారపు వ్యాసం
నరేంద్ర మోడి
1950 సెప్టెంబర్ 17న జన్మించి నరేంద్ర మోడి ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. డిసెంబర్ 2007 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువైనాడు. 1990లలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఆర్గనైజర్‌గా ఉంటూ రాష్త్రంలో పార్టీ అభివృద్ధికై విశేష కృషి సల్పినాడు. దాని పలితమే 1995లో గుజరాత్‌లో భాజపా అనూహ్యమైన విజయం సాధించింది. పార్టీ అధికారంలోకి రావడాన్కి కృషి చేసిననూ వెంటనే అధికార పీఠం దక్కలేదు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భాజపా ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేకుండా పోయింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీసులై ఉన్నాడు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిస్తున్నాడు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.(ఇంకా…)
|
చరిత్రలో ఈ రోజు
అక్టోబర్ 15:
- 1542: మొఘల్ చక్రవర్తి అక్బర్ సింధు ప్రాంతంలోని అమర్‌కోట్‌లో జన్మించాడు.
- 1582: పోప్ గ్రెగరీ-13 గ్రెగరియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.
- 1918: షిర్డీ సాయిబాబా పరమపదించిన రోజు. ఆ ఏడాది ఆరోజు విజయదశమి.
- 1920: 'గాడ్‌ఫాదర్' నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత మారియోపుజో పుట్టినరోజు.
- 1931: తమిళనాడు లోని రామేశ్వరం లో ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జననం (పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం).
- 1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ('టాటా సన్స్ లిమిటెడ్') ప్రారంభమైంది.
- 1949: బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్ భారత్‌లో విలీనమయ్యాయి.
- 1992: ఎయిర్ ఇండియా విమానం - కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
- 1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్ కు బ్రిటన్ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్ ప్రైజ్' లభించింది.
ఈ వారపు బొమ్మ
మెదడు లో ముఖ్యభాగాలు
ఫోటో సౌజన్యం: Wyglif
|